EPISODE · Apr 2, 2023 · 14 MIN
గరుడాస్త్రం - ఎపిసోడ్ 5 | Garudashram - Episode 5 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 5 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఎప్పుడు లేనిది ఆ రోజు శ్రీ హర్ష పెళ్ళిని పూర్తిగా చూసాడు. ముందు ముహుర్త సమయానికి జీలకర్ర, బెల్లం పెట్టడం, ఆ తరువాత మాంగల్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠేబ.. ” అన్న మంత్రోచ్ఛరణతో మంగళ సూత్ర ధారణ, ఆ తరువాత తెల్లటి మధు పర్కాలతో తెల్లటి తలంబ్రాలను వధూవరులు ఒకరి మీద ఒకరు పోసుకోవడం, ఆ తలంబ్రాలు పోస్తున్నప్పుడు ప్రణవి తన స్నేహితురాలికి సహాయం చేయడం.. తదనంతరం అప్పగింతలు, తెల్లవారుతుండగా అరుంధతీ నక్షత్ర దర్శనం.. ఇలా మొత్తం పెళ్ళి తంతులన్నీ చాలా ఇష్టంగా అనుభవిస్తూ చూసాడు శ్రీ హర్ష. మొత్తం పెళ్ళిపందిరి అంతా ఒక మంగళకరమైన పవిత్ర పరిమళం వ్యాపించి ఒక పవిత్ర వాతావరణానికి అంకురార్పణ జరిగింది.. తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు పిడికిట తలంబ్రాల పెళ్ళికూతురు.. అన్న అన్నమయ్య కీర్తన పందిరంతా మారుమ్రోగటం, తాళి కడుతున్నప్పుడు అలనాటి రామచంద్రుని.. అన్న పాట మధురంగా వినిపించటం.. ఆ సమయంలో అతన్ని ప్రణవి క్రీగంట చూసి నవ్వటం అన్నీ గుర్తుకొచ్చాయి శ్రీ హర్ష కి. ఏదైనా అతని జీవితంలో ఆ పెళ్ళి రోజు రాత్రి ఎన్నో మధురానుభూతులను మిగిల్చిందని చెప్పవచ్చు. ఆ మర్నాడు తొమ్మిది గంటలకు పెళ్ళి పెద్దలకు చెప్పి బయలుదేరడానికి సిద్ధ పడింది ప్రణవి. అప్పటికే అన్నీ సర్దుకొని సిద్ధంగా ఉన్నాడు హర్ష.. ప్రణవి పెళ్ళికూతురుకి తను వెళ్ళిపోతానన్నా విషయం చెప్పగానే ప్రియంవద “అదేంటి ఈ రోజు ఉండి రేపు వెళ్ళొచ్చు కదా.. నిజంగా తోడి పెళ్ళికూతురిగా నువ్వు నా పక్కన కూర్చోవటం నాకు ఎంతో ఆనందం కలిగింది తెలుసా? ఇంకో విషయం చెప్పనా! మా శ్రీవారు నీ పక్కన కూర్చున్న ఆ సౌందర్యరాశి ఎవరనీ నీ గురించి అడిగారు తెలుసా.. నిజంగా నువ్వు నిన్న రాత్రి చాలా అందంగా కనిపించావు?” అంది ఆమె బుగ్గలు నొక్కుతూ “ఎలాగూ ఇంత దూరం వచ్చాను. పాపికొండలు చూసి వెళ్ళిపోతాము. అయినా రాత్రంతా పెళ్ళితంతుతో నీకు నిద్రలేదు. హాయిగా పడుకో. రేపట్నుంచీ నీకెలాగూ నిద్ర ఉండదు” అంది పకపకా నవ్వుతూ.. ఆమె మాటలకు ప్రియంవద బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. “పోవే! చిన్నప్పటి చిలిపితనం నీ కింకా పోలేదు” అంది తను కూడా నవ్వుతూ.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/kfWmRneFZ-Y
Embed this episode
NOW PLAYING
గరుడాస్త్రం - ఎపిసోడ్ 5 | Garudashram - Episode 5 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.