EPISODE · Apr 2, 2023 · 15 MIN
గరుడాస్త్రం - ఎపిసోడ్ 6 | Garudashram - Episode 6 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 6 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఇక గరుడాస్త్రం ఆరవ భాగం చదవండి.. సాయంత్రం ఐదు గంటలైంది - కాలేజీలో హైడ్రాలిక్ లేబొరేటరీలో శ్రీ హర్ష ప్రాజెక్ట్ విషయమై కొన్ని ప్రయోగాలు చేసి అప్పుడే బయటకు వచ్చాడు. కొద్ది సేపటికి ప్రణవి కారు వచ్చి అతని దగ్గర ఆగింది. శ్రీ హర్ష కారు ఎక్కగానే బయలుదేరింది. వాతావారణం ఆహ్లాదకరంగా ఉంది.. ఇంకో రెండు నెలల్లో మీ చదువు పూర్తతుంది. తరువాత ఏం చెయ్యాలనుకుంటున్నారు?” శ్రీహర్షని అడిగింది ప్రణవి. “కాలేజీ స్టడీస్ అయితే పూర్తైంది. ఇప్పుడు మేము ప్రాజెక్టు వర్క్ చేస్తున్నాము. అది ఈ వారంతో పూర్తవుతుంది . ఆ తరువాత పరీక్షలు.. నాకైతే మిలట్రీలో చేరి దేశానికి సేవ చేయ్యాలనుంది. అంటే యుద్ధాలను చెయ్యడం కాదు.. రక్షణ శాఖకు శాస్త్రీయంగా ఉపయోగ పడాలని వుంది. అంటే సైంటిఫిక్ గా ఏదైనా చెయ్యాలనుంది..” అన్నాడు శ్రీ హర్ష "సైంటిఫిక్ గా అంటే ఎలా?” ప్రణవి ఆసక్తిగా అడిగింది. “అంటే జెట్ విమానాలు, విక్రాంత్, విరాట్ లాంటి నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్స్ ని అభివృద్ధి చెయ్యటం, అలాగే సబ్ మరైన్స్ కొత్తవి తయారు చెయ్యటం.. ఇలాంటి వన్నమాట.. అలాగే మిసైల్స్, గన్ షిప్స్.. ఇటువంటివి అభివృద్ధి చేస్తే దేశానికి రక్షణ శక్తి పెరుగుతుంది” అన్నాడు. “మీరు చెప్పినవన్నీ మానవ వినాశనానికి కారణం అవుతాయి కదా?” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/yZavPLVKUqw
Embed this episode
NOW PLAYING
గరుడాస్త్రం - ఎపిసోడ్ 6 | Garudashram - Episode 6 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.