EPISODE · Apr 2, 2023 · 15 MIN
గరుడాస్త్రం - ఎపిసోడ్ 7 | Garudashram - Episode 7 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 7 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఇంటికి వెళ్ళగానే అతని తల్లి సుశీల చాలా సంతోషించి దిష్టి తీసింది. స్నానం తరువాత టిఫిన్ ఇచ్చి కొడుకు యోగ క్షేమాలు అడిగింది. కరుణాకరం గారి కుటుంబం గురించి అన్నీ అడిగింది. తల్లికి చెబుతునాడే గాని అతనికి విసుగ్గా వుంది.. ప్రయాణం లో అలసట వల్ల చిరాగ్గా ఉన్నాడని ఆమె అనుకుంది. ఆ రాత్రి భోజనాల తరువాత డాబా మీదకు వెళ్ళాడు. మంచు పడుతోందని జలుబు చేస్తుందనీ సుశీల కొడుక్కి చెప్పింది.. అతను ఆమె మాటల్ని పట్టించుకోకుండా డాబా మీదకు ఎక్కాడు. కొబ్బరి చెట్ల ఆకుల్లోంచి పున్నమి వెన్నెల ముఖం మీద పడుతోంది.. పల్లె కావడం వల్ల ఎనిమిదికే ఊరు నిద్రపోయింది.. అంతా నిశ్శబ్దం.. చాలా రోజుల తరువాత రణ గణ ధ్వనులకు దూరంగా ప్రశాంత వాతావరణాని కొచ్చాడు.. రేపట్నుంచీ ఎటువంటి ఆలోచనలూ పెట్టుకోకుండా పరీక్ష మీద దృష్టి కేంద్రీకరించాలి.. ఈ పరీక్షలో పాసై ఉద్యోగం వస్తేనే తన గమ్యం చేరుకునే అవకాశం కలుగుతుంది.. మీద తెల్లటి ఆకాశం నిర్మలంగా ఉంది.. నక్షత్రాలు మెరుస్తూ ఆకాశానికి అందాన్నిస్తున్నాయి. ఆకాశంలో తెల్లటి కొంగలు ఎగురుతూ కనిపిస్తున్నాయి. దూరంగా ఏటి దగ్గర తోటల్లోంచి కోకిల కుహు కుహు నాదం అక్కడి నిశ్శబ్దన్ని భంగ పరుస్తోంది.. ఆ వెన్నెలను చూస్తూంటే అతనికి చక్రవాక పక్షి గుర్తు కొచ్చింది. దాన్నే వెన్నెల పులుగంటారనీ ఎక్కడో చదివాడు.. కానీ ఆ పక్షినెప్పుడు చూడలేదు. వెన్నెట్లో విహరించే ఆ పక్షిని తలుచుకుంటే అతని శరీరం పులకరించసాగింది.. అలా అతని ఆలోచనలు మళ్ళీ ప్రణవి మీదకు మళ్ళాయి. ఒకసారి సముద్రపు ఒడ్డున వెన్నెల్లో ఆమెను 'వెన్నెల్లో ఆడపిల్ల' నీ చెబితే ఆమె ముఖంలో ఎంతో ఆనందం కనిపించింది.. అప్పుడు చిరునవ్వుతో తనను చూసిన ఆమె చూపు ఎన్నో రోజులు తనను వెంటాడింది.. తిలక్ అందమైన అమ్మాయిలకు ఎంత అందమైన పేరు పెట్టాడు! వెన్నెల్లో ఆడపిల్ల.. మళ్ళీ ఆలోచనలు.. ఆమెతో గోదావరిలో పడవలో ప్రయాణం. తెల్లటి ఆకాశం; తెల్లటి తెరచాప ;తెల్లటి ప్రణవి.. పాపికొండల్లో తెల్లటి జలధార.. దాని కింద తెల్లటి దుస్తుల్లో ప్రణవి. ఆలోచనలు వెంటాడుతున్నాయి.. ఆమెకు దూరంగా వచ్చినా ఆలోచనలు ఆమె వైపే వెళుతుండటం అతనికి కోపం కలిగించ సాగింది.. చదువు కొంటున్నప్పుడు నిద్ర ఎప్పుడు కనురెప్పల మీదే ఉండేది. తను వద్దనీ ఎంత మొత్తుకున్నా అది వినేది కాదు.. ఈ రోజు తనకి కావాలన్నా ఆ నిద్ర రావటం లేదు.. ఈ రోజు కూడా అది కనురెప్పల మీదే ఉంటూ వాటిని మూసుకోనివ్వటం లేదు.. “నిద్రా! నీకెందుకు నేనంటే అంత కోపం.. ”. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ANAXFMYlUnA
Embed this episode
NOW PLAYING
గరుడాస్త్రం - ఎపిసోడ్ 7 | Garudashram - Episode 7 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.