EPISODE · Apr 2, 2023 · 15 MIN
గరుడాస్త్రం - ఎపిసోడ్ 8 | Garudashram - Episode 8 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 8 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ మర్నాడే వాళ్ళ మొదటి రాత్రి.. అంతా తెలుపు మయం.. తెల్లటి మేను, తెల్లటి చీర, తెల్లటి మల్లెదండ, తెల్లటి వదనంపై ఎర్రటి తిలకం.. తెలుపు దుప్పట్ల మంచం.. మత్తు కలిగించే పరిమళం.. ఎప్పుడు ఎక్కువగా మాట్లాడే ప్రణవి ఆరోజు మౌనం దాల్చింది. తెల్లటి పాల గ్లాసుతో దేవకన్యలా లోపలి కొచ్చి మంచం మీద కూర్చొంది.. అప్పట్నుంచీ నోటితో కాకుండా కళ్ళతోటే మాట్లాడుతోంది. ఇద్దరూ కొద్ది సేపటి తరువాత డాబా మీదకు వెళ్ళారు. ఊరంతా నిశ్శబ్దం గా ఉంది. డాబా అంతా పండు వెన్నెల పరుచుకొని ఉంది. కొబ్బరాకుల సందుల్లోంచి వెన్నెల కిరణాలు ఆమె మీద పడి మెరిసిపోతునాయి. అలా పౌర్ణమి రాత్రి నిండు ఆకాశం కింద వెన్నెల పడుతుంటే ఆ నిశ్శబ్ద నీరవంలో ఒకరి పక్కన ఇంకొకరు; మత్తుగా ఉంది ఇద్దరికీ.. ఆమె అతనికి దగ్గరికి జరగగానే ఒళ్ళంతా పులకరింత; ఆమె ఒంపు సొంపులు అతన్ని తాకుతూ, ఆమె పరిమళం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ అతన్ని ఆనంద పరవశుణ్ణి చేస్తున్నాయి .. అతని కెందుకో ఇది కలా నిజమా అని అనిపిస్తోంది. అతను ప్రణవితో వివాహం అంటే నమ్మలేకపోతునాడు. పోతపోసిన అందాల రాశి తన స్వంతమైందంటే ఆశ్చర్యపోతునాడు. ఇవే మీ తెలియని ప్రణవి మాత్రం అతని గుండెల మీద తల పెట్టి నిద్రపోసాగింది. ఆమెను అలా చూస్తుంటే శ్రీహర్షకు “తెల్లవారనీకూ ఈ రేయినీ” అనీ చంద్రుణ్ణి వేడుకోవా లనిపించింది.. ప్రణవి ఉచ్ఛాస నిశ్వాసాలు చందన పరిమళం వెదజల్లుతూ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆమెను అలా చూస్తుంటే అతనికి జయదేవుడి అష్టపదులు, కావ్య నాయికలు గుర్తుకు రాసాగాయి. ఆమె పరిమళం ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే అతనిలో కవిత్వం ఉప్పొంగి మోహన రాగం ఆలపించే సాగింది. “గగనాంగనాలింగనోత్సాహియై జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై గంగా తరంగాల సంగీతమై కమనీయ రమణీయ యువగీతమై మలయాద్రి పవనాల అలాపనై మధుమాస యామిని ఉద్దీపనై” శారద యామిని భారంగా గడుస్తోంది, ఆ రాత్రి ఆ జంట జాగారం చేసింది. తెల్లవారు ఝామున వారి తనువులు అలసి సొలసి విశ్రమించాయి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/oUAyJBMW8iA
Embed this episode
NOW PLAYING
గరుడాస్త్రం - ఎపిసోడ్ 8 | Garudashram - Episode 8 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.