EPISODE · Apr 2, 2023 · 15 MIN
గరుడాస్త్రం - ఎపిసోడ్ 9 | Garudashram - Episode 9 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గరుడాస్త్రం - ఎపిసోడ్ 9 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఇలా సాఫీగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో ఓ అనుకోని సంఘటన ఓ కుదుపు కుదిపింది. ఒకరోజు శ్రీహర్ష ఆఫీసులో వున్నప్పుడు డైరెక్టర్ గారు పిలుస్తునారు అంటూ అటెండర్ చెప్పాడు .ఎప్పుడూ తనని పిలవని డైరెక్టర్ ఈ రోజెందుకు పిలిచారో నని ఆలోచిస్తూ రెండవ అంతస్తులో ఉన్న అతని ఛాంబర్ కి వెళ్ళాడు. ఐదు నిముషాలు బయట వేచి ఉన్న తర్వాత అతన్ని లోపలికి రమ్మని పిలుపొచ్చింది.శ్రీహర్ష లోపలికి వెళ్లాడు. చాలా విశాలంగా, ఆధునాతనంగా ఉందా గది. ఎదురుగా విశాలమైన టేబుల్ ముందు డైరెక్టర్, అతని కెదురుగా ఒక పొడవైన వ్యక్తి కూర్చొన్నారు.శ్రీహర్షని చూడగానే డైరెక్టర్ వేదవ్యాస్ “కమిన్” అని చెప్పి ఎదురుగా కుర్చీలో కూర్చోమని చెప్పాడు.కొద్దిసేపు అక్కడ సూదిమొన పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం.“మిస్టర్ శ్రీహర్ష మీరు ఈ కేంద్రంలో చేరి ఎన్నాళ్ళైంది” అని అతనడిగాడు. “సార్! రెండు సంవత్సరాలైంది.” “ప్రస్తుతం మీ ఎసైన్మెంట్ ఏమిటి?” “సార్ మేము గరుడ మిసైల్ ని డిజైన్ చేస్తున్నాము”“ఓకే! అది పూర్తైందా?”“95%” అయింది.. ఇంకా డిజైన్స్ ఫైనలైజ్ కావాలి. ఆ పనిలోనే ఉన్నాము”“ఓకే..” అంటూ అతను ఒక డ్రాయింగుని శ్రీహర్షకి చూపించాడు.అది తాము డిజైన్ చేస్తున్న గరుడ మిసైల్ దే.. అది అతని చేతిలోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఎందుకంటే ఆ డ్రాయింగ్ లను తాము బయటకు పంపలేదు. ఎవ్వరికి తెలియదు కూడా.అందుకే దాన్ని చూడగానే శ్రీహర్షకు ఆశ్చర్యం కలిగింది.“ఈ డ్రాయింగ్ దేనికి సంబంధించినది” అని అడిగాడు.. మెల్లగా అతని స్వరంలో మార్పుని గమనించసాగాడు శ్రీహర్ష..“సార్! ఇది మేము డిజైన్ చేస్తున్న గరుడ మిసైల్ ది. కానీ అది ఎవ్వరికీ తెలియదు. ఇంకా అది ఫైనల్త్జ్ కాలేదు” అని చెప్పాడు హర్ష.“మరి ఇది బయటకు ఎలా వచ్చింది”?అతని స్వరం గంభీరంగా ఉంది. ప్రశ్నిస్తున్నాట్లు గా ఉంది.అతని ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు శ్రీ హర్షకు. “తెలియదు” అన్నాడు మెల్లగా.. ఆ మాట చెబుతున్నప్పుడు అతని గొంతు తడి ఆరిపోయింది. “మిస్టర్ హర్ష! ఈ డ్రాయింగ్స్ ఎవరి ఆధీనంలో ఉంటాయి?” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/3KCSK2wF3eA
Embed this episode
NOW PLAYING
గరుడాస్త్రం - ఎపిసోడ్ 9 | Garudashram - Episode 9 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.