హై టెక్ లైఫ్ | High Tech Life | Telugu Short Story | A. Annapurna | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 12, 2023 · 5 MIN

హై టెక్ లైఫ్ | High Tech Life | Telugu Short Story | A. Annapurna | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) హై టెక్ లైఫ్ రచన: ఏ. అన్నపూర్ణ (ఉత్తమ అభ్యుదయ రచయిత్రి) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ''ఆకాష్! వాషింగ్ మెషిన్లో క్లోత్స్ వేయమని రెండురోజులుగా చెబుతున్నాను. వేయనేలేదు. నామాట అంటే ఇంత నిర్లక్ష్యమా..... పింకీ, అమర్ స్కూల్ కి వెళ్ళాలి. డ్రెస్ రెడీగా లేదు! ఇప్పుడు ఏమి చేయాలి? ” విల్లా మూడో ఫ్లోర్ నుంచి పెద్ద గొంతుతో అరిచింది మేఘన.. ''సారీ మేఘా, నేను వర్క్తో బిజీ. మర్చిపోయాను. ఇప్పుడే వెళ్లి కొని తెస్తా... అంటూ కారు బయటికి తీసాడు ఆకాష్. ''ఇదేమి విడ్డూరం! పనిమనిషి మాలిని వుంది. దానితో చెప్పకుండా ఆకాష్ తో చెబుతుంది ఏమిటి? పాపం వాడు రాత్రి అంతా మేలుకుని ఇప్పుడే పడుకున్నాడు. వాడి నిద్రా చెడగొట్టింది'' అంటూ జానకి బాధతో గొణుక్కుంది. ''మనకెందుకు? వాళ్ళయిష్టం. వీడు చేస్తాడు, ఆవిడ ఆర్డర్ వేస్తుంది.." అన్నాడు లాప్ టాప్లో న్యూస్ పేపర్ చదువుతున్న నిరంజన్. ''నేను రెడీ చేసిపెట్టాను. అవి వేయదు. ఐరన్ చేయలేదుట.. వొకరోజుకి ఏమవుతుంది? '' పిల్లలు మరీ చిన్నవాళ్లు కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ వాళ్ళు చేయరు అంటే నేను ఐరన్ చేసాను. నచ్చలేదు. ఏం చేస్తాం.. ఆకాష్ కష్టపడుతుంటే చూడలేం. మనపని నచ్చదు. రోజూ ఉండేదే. పద అలా పార్కులో వాక్ చేసి వద్దాం...." అంటూ బయలుదేరాడు నిరంజన్. ''సరే పదండి. అందరూ బయటికి వెళ్ళేక ఇంటికి వద్దాం!” అని తన రూముకి లాక్ చేసి బయటికి వచ్చింది జానకి. పిల్లలను రెడీచేసి కారులో కూర్చోబెట్టి, మేఘనకి కాఫీ చేసి బ్రేక్ ఫాస్ట్ టేబుల్ మీద పెట్టి కూర్చున్నాడు నిరంజన్. ''ఈరోజూ బ్రెడ్డేనా...." అంటూ విసుక్కుని పూర్తిచేసి.... కాఫీతాగి వెళ్ళిపొయిన్ది. వాళ్లకి బై చెప్పి హాల్లో సోఫాలో వొరిగిపోయాడు ఆకాష్. మేఘన ఈ మధ్య త్రీ లెవెల్స్ ఉన్న ఈ విల్లా చూసి మురిసిపోయి కొనేసింది. చుట్టుపక్కల ఇంకా ఎవరూ లేరు. యాభై విల్లాలు. సిటీకి దూరం. ధరా ఎక్కువే అని చాలామంది వెనక్కి వెళ్లిపోతున్నారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/V2kPkTcYnPE

Episode metadata supplied by the publisher feed · Published Feb 12, 2023

Embed this episode

NOW PLAYING

హై టెక్ లైఫ్ | High Tech Life | Telugu Short Story | A. Annapurna | manatelugukathalu.com

0:00 5:45

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 5 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 12, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!