EPISODE · Aug 15, 2020 · 1 MIN
Happy Independence Day
from Dwani · host Dwani Voice Services
నా దేశ పౌరులందరికీ 74 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ... భారత దేశం నా మాతృ భూమి అని చిన్నపుడు ఎపుడో స్కూల్ లో చదివినట్టు గుర్తు , కానీ ఇపుడు తెలిసొచ్చింది.....తల్లి పేరుమీదున్న భూమికోసం అన్నదమ్ములిద్దరు కొట్టుకు చస్తుంటే.....నా దేశానికి " స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళు అయ్యిందని.. పంజాబ సింధు గుజరాత మరాఠా అని గర్వంతో ఉచ్చరించేటప్పుడు అనుకోలే ..., ఈ దేశం లో కులం మతం ప్రాంతం కోసం ప్రాణాలు కూడా పణంగా పెట్టి యుద్దానికి ఏ మాత్రం తీసిపోని విధంగా కల్లోలం సృష్టించగల మనుషులున్న నా దేశానికి స్వతంత్రం వచ్చి74 ఏళ్ళు అయ్యిందని.. ఆడది అర్దరాత్రి 12 గంటలకి తిరిగినపుడే నిజమైన స్వాతంత్రమని గాంధీ గారంటే అర్ధం చేసుకోలేదు ....కానీ ఇపుడు అర్ధమయింది ఒక ఆడది ఒంటరిగా 9 గంటలకు బయట తిరిగినా మానభంగాలు చేసే మృగాళ్ళున్న నా దేశానికి స్వతంత్రం వచ్చి74 ఏళ్ళు అయ్యిందని.. పెద్దోడు పేదోడి రక్తం తాగుతున్నా , ఉన్నోడు లేనోడి ఉసురు తీస్తున్నా , దేశ స్వాతంత్ర ఫలాలు అర్హులకు అందినా అందకున్నా, నిరుద్యోగం పెరిగినా , ఆకలి చావులు ఆగకున్నా నా దేశమంటే నాకు ఇష్టం ...ఓ ప్రజాస్వామ్య దేశమా నీకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Embed this episode
Ready to play
Happy Independence Day
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.