EPISODE · Nov 3, 2022 · 12 MIN
హేమంతం | Hemantham | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) హేమంతం రచన: యశోద పులుగుర్త 'ఈ నాడు' దినపత్రికలోని ఒక వార్తను చూడగానే రామకృష్ణ దృష్టి అక్కడే ఆగిపోయింది. వైజాగ్ లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక ఇరవై సంవత్సరాలు నిండిన అమ్మాయి తన ప్రేమికుడు రోడ్ ప్రమాదంలో చనిపోయాడన్న వార్త విని తట్టుకోలేక ఫేన్ కి ఉరివేసుకుని చనిపోయిందట. ఈ వార్తవిన్న ఆమె తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా కుమార్తె మరణంపై విలపిస్తున్నారని ఆ వార్త సారాంశం.. ఇటువంటి వార్తలు రోజూ ఎన్నో చదువుతున్నా టి.వి.లో చూస్తున్నా, ఎంతో భవిష్యత్ ఉన్న ఒక చిన్న అమ్మాయి అనాలోచితంగా తీసుకున్న నిర్ణయానికి ఆవేదనతోబాటూ ఒకలాంటి కోపంతో ‘ప్రేమిస్తే మటుకు ఇటువంటి ప్రాణత్యాగం చేయలా’ అనుకుంటూ అక్కడే ఉన్న భార్యతో "విన్నావా హేమా" అంటూ మొత్తం విషయాన్ని చెపుతూ “ప్రేమ ను ప్రాక్టికల్ గా తీసుకుంటున్న ఈరోజుల్లోకూడా ఆ అమ్మాయి అనాలోచిత నిర్ణయం తొందరబాటు కాదా" అన్నాడు. హేమంత ఉలిక్కి పడుతూ మౌనం వహించింది. "ఏం మాట్లాడవే హేమా?” "ఏం మాట్లాడాలి ? చాలామందికి అనాలోచితం అనిపించవచ్చు. కానీ ఆ అమ్మాయికి అదే న్యాయమైనదిగా అనిపించవచ్చు. ఆ ప్రేమ విలువ ఏమిటో అనుభవించిన వారికి మాత్రమే తెలిసినంతంగా బయట వాళ్లకు అర్ధం కాకపోవచ్చేమో కృష్ణా”. "నీ ముఖం, ప్రేమించుకుని నీవు లేనిదే నేను జీవించ లేనంటూ చెట్టాపట్టాలేసుకుని పెళ్లి చేసుకుంటున్న జంటలు పెళ్లైన కొద్ది నెలలకే ఎందుకు విడిపోతున్నారు? నా దృష్టిలో ప్రేమించుకోవడం ఒక ఫాషన్ అంటాను. నాకు ఈ ప్రేమలు, త్యాగాలు పట్ల నమ్మకంలేదు హేమా!” భర్త మాటలకు సమాధానమివ్వకుండా వంటింట్లోకి వెళ్లిపోయింది హేమంత. రామకృష్ణ హేమంతను ఒక పెళ్లిలో చూసి ఇష్టపడి తల్లితండ్రులతో ఆ అమ్మాయినే చేసుకుంటానని చెప్పి ఇరువైపుల పెద్దల అంగీకారంతో శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నాడు. ఎవరైనా స్నేహితులు సరదాగా నీది ప్రేమవివాహమే కదా అంటే నాకు ప్రేమపట్ల నమ్మకంలేదు, కాని హేమంతను చూసి ఇష్టపడి ఈ అమ్మాయిని చేసుకుంటే నా జీవితం బాగుంటుందనిపించి పెళ్లిచేసుకున్నాక ప్రేమించడం మొదలు పెట్టానంటాడు... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/fWdmu_l3Wbo
Embed this episode
NOW PLAYING
హేమంతం | Hemantham | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.