EPISODE · Jul 17, 2022 · 5 MIN
హమ్మయ్య అమ్మాయి పెళ్లి కుదిరింది | Hammayya Ammayi Pelli Kudirindi | Telugu Short Story | Parimala Kalyan | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) హమ్మయ్య అమ్మాయి పెళ్లి కుదిరింది రచన: పరిమళ కళ్యాణ్ "ఆడపిల్ల పుడితే అమ్మ పుట్టినట్లే అనుకుని, మీ నాన్న నిన్ను ఎంతో గారాబంగా పెంచాడు. పురిట్లోనే తల్లిని కోల్పోయావని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా పూర్ణిమా? పెళ్ళొద్దని అంటావా? నీకోసం ఎంతో కష్టపడి తెచ్చిన సంబంధాలన్నీ చెడగొడతావా? అసలు పెళ్ళి చేసుకోనని అంటే ఎలాగే? నీకంటూ ఒక తోడు కావద్దా? నాకా వయసైపోయింది, ఇంకెన్నాళ్లు ఉంటానో తెలీదు. నేనూ పోయేలోపు నిన్ను ఒక చేతిలో పెడితే హాయిగా మా ఆయన దగ్గరకి పోతాను. మీ నాన్న కి నీ టెన్షన్ కూడా తగ్గుతుంది. ఆలోచించవే!" అంటూ తన ధోరణిలో చెప్పుకుంటూ పోతోంది వెంకు బాయి అనబడే వెంకాయమ్మ గారు తన మనవరాలిని ఉద్దేశించి పెళ్ళి చేసుకోమని చెప్తూ.. "మళ్ళీ మొదలు పెట్టావా వెంకూ బాయి. ఇదుగో చూడు బామ్మా, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. కానీ చివర్లో నువ్వే చెప్పావ్ చూడు.. నాకు పెళ్ళి చేసి నువ్వు నిశ్చింతగా మీ ఆయన దగ్గరకి వెళ్ళిపోతాను అని, మరి అప్పుడు నాన్నకి ఎవరు తోడుంటారు బామ్మా? అమ్మ పురిట్లోనే పోతే, తల్లి లేని పిల్లని చూసుకోవాలని మళ్ళీ పెళ్ళి కూడా చేసుకోలేదు నాన్న. నువ్వేమో అమ్మకంటే ఎక్కువగా పెంచావ్ నన్ను. నువ్వున్నావు కాబట్టి సరిపోయింది బామ్మా లేదంటే నాన్న పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేనూ పెళ్ళి చేసుకుని నాన్నని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోవాలా చెప్పు బామ్మా? అప్పుడు నాన్నని ఎవరు చూసుకుంటారు? అందుకే నేను పెళ్ళి చేసుకోను అనేది. ఎప్పటికి ఇలా నాన్నని చూసుకుంటూ ఉంటాను. నాకేం వేరొకరి తోడు అవసరం కూడా లేదు!" అంది పూర్ణిమ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/-P7Dl90UX2Q
Embed this episode
NOW PLAYING
హమ్మయ్య అమ్మాయి పెళ్లి కుదిరింది | Hammayya Ammayi Pelli Kudirindi | Telugu Short Story | Parimala Kalyan | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.