EPISODE · Oct 23, 2022 · 8 MIN
ఇచ్చినమ్మా వాయనం | Ichhinamma Vayinam | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఇచ్చినమ్మా వాయనం శ్రీనివాసరావు జీడిగుంట ఏమిటో మా వైపు నలుగురు, మీ వైపు ఆరుగురు అన్నదమ్ములు వున్నా, ఒక్కపూట ఆదరించి భోజనం పెట్టే వాళ్ళు లేరు. మా తమ్ముడు వాళ్ళు పిలిచినా, వాళ్ల వంటలు బాగుండవని రారు, మీ వాళ్ళు పిలవరు, రోజూ ఏమి వండాలి అని అడగటం, మీ కిష్టమైంది వండటం, విసుగెత్తిపోతోంది ఈజీవితం అంటూ గోనుగుకుంటున్నట్టు కొద్దిగా పెద్దగానే అంటోంది సుకుమార్ భార్య సీత. చూడు, ఎవ్వరి పనిలో వాళ్ళు వుంటారు. పూర్వం లాగా ఆప్యాయతలు లేవు. తమ గొప్ప చూపించుకోవడానికి పెళ్లిళ్ళకి పిలుస్తున్నారు, అనవసరంగా బాధపడక, ఆ దరిద్రపు గోరుచిక్కుడు కాయలు వండక, ఈ రోజు బంగాళాదుంప ఉల్లికారం, చల్లపులుసు వండు. నేను స్నానం చేసి వచ్చి పప్పులోకి నాలుగు చల్లమిరపకాయలు వేయించుకుంటానులే అన్నాడు సుకుమార్. మొగుడు వంక అదో రకంగా చూసి, ఈ గోరుచిక్కుడు కాయలు ఎవరు తెమ్మన్నారు, మీకు యిష్టం లేకపోతే. తెచ్చి పడేస్తే గోళ్లు ఊడేడట్లు వలవడం, నేనే తినడం. మీకు మాత్రం రుచులు కావాలి అరవై దాటినా అంది సీత. వంటింటి మహారాణివి, నీకు కావలిసినవి వండుకుంటే నేను కాదన్నానా అన్నాడు నవ్వుతు సుకుమార్. మీకే ఎంతసేపైనా మాట్లడుతూ కూర్చుంటారు. వండలేక నేను చావాలి. ముందు ఆ బుట్టలోనుంచి నాలుగు పెద్ద బంగాళాదుంపలు అందివ్వండి, లేవలేను నడుములాగేస్తోంది అంది సీత. యింకా నయం నడుము నొప్పి రాత్రి నుంచి అనలేదు, ఎవరైనా వింటే నన్ను హేళన చేసేవాళ్ళు అన్నాడు చిలిపిగా నవ్వుతూ... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/exOtuMy859I
Embed this episode
NOW PLAYING
ఇచ్చినమ్మా వాయనం | Ichhinamma Vayinam | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.