EPISODE · Jul 30, 2023 · 24 MIN
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 1 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 1 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 1 ' - New Telugu Web Series Written By Pandranki Subramani 'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 1' తెలుగు ధారావాహిక మొదటి భాగం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) భద్రం ఇప్పుడు మాడవీధి చివరన, జీవన ప్రస్థానపు మలుపున వెనక్కి తిరిగి చూడలేని తావున నిల్చున్నాడు. ఆకాశం లోకి తేరి చూస్తూ, నిట్టూర్పుల నడుమ దిక్కుతోచని స్థితిలో నిస్సహాయంగా నిల్చున్నాడు. బ్రతుకు బాటలోని తటపటలు అతణ్ణి కుదురుగా ఆలోచించనివ్వడం లేదు. అవలోకనంలో పడి మరింత ఆలస్యమైతే ఇంటి వాకిట వరకూ వచ్చిన అవకాశం విహంగం లా యెగిరిపోవచ్చు, చేజారి పోవచ్చు. మరైతే-- కడుపులోని చల్ల కదలనీయకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు కాలమంతా గడిపేయాలనుకుంటే, జీవితానికి నిలకడ యెప్పుడు వస్తుందని? బ్రతుకు రథ చక్రం ఎప్పుడు కుదుటపడుతుంది. గనుక-- అప్పుడతని కళ్ల ముందు మొన్న జరిగిన దృశ్యం పొడుచుకు వచ్చిన పొద్దులా మెదిలింది. టీ. వీ. సీరియల్స్- లైవ్ కార్యక్రమాలు మిక్కిలి ఇష్టంగా చూసే భార్యను అటు వెళ్తూ అడిగాడు- “అదేంవిటి? జంతువుల ప్రోగ్రాము కూడా చూస్తావేమిటి అంత ఆసక్తిగా! ” కాంతం తలూ పుతూ బదులిచ్చింది- “ఔనండీ! నాకన్నీ ఇష్టమే—ప్రోగ్రాముల టైమింగ్సు కూడా నాకు బాగా తెలుసు, మరైతే టీ వీ సెట్ మాత్రం మరీ చిన్న సైజు” అతడు నవ్వి అడిగాడు- “అది సరేగాని- దాని గురించి తరవాత ఆలోచిద్దాం గాని- అదేమిటి- చిన్న పాటి ఎలుగు లా ఉంది. దానిని చూసి తోడేళ్ళు- దుప్పిలు- అడవి గేదెలు- పందులు తప్పుకు తిరుగుతున్నాయి. అది మాత్రం అదురూ బెదురు లేకుండా చేతులూపుతూ రికారిగా తోకాడిస్తూ తిరుగుతూంది. అంతటి చిన్నరూపానికి అంతటి గుండె నిబ్బరమా! అదెలా?" అది విని నవ్వింది. పుంజుకున్న ఉత్సాహంతో చెప్పింది. “ఔనండీ! చూపుకి చిన్నదయినా దానికి తెగువెక్కువ. రౌడీ షీటర్ లా మొండి గా అడివంతా తిరుగుతుంటుంది- ఎంతటి మొండిదంటే- అన్నిటి తోనూ సైఁ అంటూ కలబడుతుంది. చీటాలు ఎలుగులు సహితం దానిని చూసి దూరంగా తొలగిపోతుంటాయి. బొందిలో ప్రాణం ఉండగా ఏవీ సాహసించి తేనెపుట్టవద్దకు వెళ్ళవు కదా! ఇది మాత్రం అదేమీ లక్ష్యపెట్టకుండా వెళ్లి తేనేటీగల్ని చెల్లా చెదురు చేసి పుట్టతేనెను బాగా తాగి తనకు అడ్డు వచ్చిన తేనెటీగల్ని సహితం నమిలి మ్రింగేస్తుంది. దానిని హనీ బడ్జర్ అంటారు”. అతడు నమ్మలేనట్టు గుడ్లప్పగించి చూస్తుండగా తన జీవన సహచరి అన్న మరొక మాట అతడి గుండె కవాటాలను తాకింది. “అడవిలో బ్రతకాలంటే అంతటి తెగువ ఉండేతీరాలి కదండీ! ” నిజమే కదూ! అడవిలోనే కాదు- అడవి వంటి ప్రపంచంలో కూడా మనుగడ చేయాలంటే కడగండ్లకు బెదరకుండా తెగువ చూపించే తీరాలి కదూ ఆ హనీబడ్జర్ లా! ఎదురవబోయేది కడగండ్ల వర్షం కదానని తను పట్టుతప్పి కొట్టుకుపోకుండా ఉండాలి కదానని జాగ్రత్త చూపిస్తే మరి తన కుటుంబం సహితం కొట్టుకుపోతే-- అప్పుడు తను మాత్రం మిగిలిపోయి ఏమి చేస్తాడు? దేని కోసం మనుగడ సాగిస్తాడు? ఏది ఏమైనా సరే- నయానో భయానో వృధ్ధ తల్లిదండ్రులకి, లోక జ్ఞానం అంతంత మాత్రమే కలిగున్న సతీమణికి నచ్చచెప్పి ముందున్న నేల, జారుడుగా కనిపిస్తున్నా పట్టు తప్పిపోకుండా వెనక్కి చూడకుండా ముందుకు సాగిపోవాలి. ఇంతకూ తను యెదుర్కోవలసిందేమిటి? జీవితం- అంతా తన కనుకూలంగా జరగదు. ఆ మాటకు వస్తే యెప్పుడు మాత్రం యెవరికి మాత్రం జీవితం ఆటుపోట్లకు అతీతంగా సాగింది గనుక-- ఇక పైన జాప్యానికి తావివ్వకూడదు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Uw0geQxP1-Q
Embed this episode
NOW PLAYING
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 1 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 1 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.