EPISODE · Sep 24, 2023 · 16 MIN
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 11 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 11 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 11' - New Telugu Web Series Written By Pandranki Subramani 'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 11' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ మరెందుకో మరి— ఇక్కట్లలో ఉన్న తన బామ్మర్ది విషయమై సోమనాధం దగ్గర ప్రస్తావించాలన్న తలంపు రాలేదు రామ భద్రానికి. ఎందుకంటే— సెలయేళ్లు వంకర్లుపోతూ చిట్టచివర నదిలోకి వచ్చి చేరినట్టు అతడు కూడా రూపవతి వద్దకు వచ్చి సలహా అడుగుతాడేమో! ఆ మాటకు వస్తే ఇంటా బైటా పెట్టుబడి అంతా ఆమెదేగా! ఆర్ధిక వనరులపైన పట్టు కూడా రూపవతిదేగా! ఆమెను మీరి సోమనాథం గాని— మంజులదేవి గాని ఇప్పటిప్పుడు ముందుకు వెళ్ళరు. వెళ్లలేరు. అంచేత అతడి మనసిప్పుడు సూదంటురాయిలా రూపవతి వైపే లాగుతూంది; చివరి ఆసరా దొరక్క అసహాయంగా అంబ విగ్రహం వేపు చేతులు చాచే దేవీ ఉపాసకుడిలా- నిజానికి ఎట్టి పరిస్థితుల్లోనైనా తనను ఆదుకునే ఆర్ద్రత ఆమెకు మాత్రమే ఉందన్న విశ్వాసం అతడిలో ఇసు మంతం కూడా తరగలేదు. కాని- అదే సమయం-- ఇంట్లో వాళ్ళు వెలిబుచ్చిన అభిప్రాయాలు- వార్నింగులు అతణ్ణి వెంటాడటం మానలేదు. ఏదైనా ఎక్కడైనా మరీ ఎక్కువగా ఎదురు చూస్తే భంగపాటు ఎదురయే తీరుతుందిగా! అందులో తనకు ఆమెతో ఈమధ్య చనువు కూడా పెరిగింది. ఇప్పుడు తను ఏది అడిగినా, వేడుకోలుగా ఏమన్నా తను ఆ చనువుని తనకనుకూలంగా ఉపయోగించడానికి పూనుకున్నాడని రూపవతి తలపోస్తే- అపార్థం చేసుకుంటే-- ఒకసారి సింహాద్రి పంతులుగారు చెప్పలేదూ- మనిషి అదుపులేని తన ఆశల వల్లనే ముప్పు తెచ్చుకుంటాడని; తమ పొడవైన కాళ్ళ వల్లనే వలలో చిక్కుకు పోయే పక్షుల్లా. ఈ ఆలోచన వచ్చిన తోడనే అతడి గుండె కొట్టుకోనారంభించింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Hg3adLhdK68
Embed this episode
Ready to play
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 11 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 11 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.