EPISODE · Aug 5, 2023 · 20 MIN
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 2 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 2 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 2' - New Telugu Web Series Written By Pandranki Subramani 'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 2' తెలుగు ధారావాహిక రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం. ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురాలు రూపవతి కనిపిస్తుంది. అతనిలో అలజడి మొదలవుతుంది. 'ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై - పార్ట్ 2' చదవండి. ఇప్పుడతని మనసు మరొక మారు అటువేపు మళ్లింది. ఇంతకీ కలలోకి రూపవతి ఎలా వచ్చిందని? వచ్చి తన ముందు ఎలా కూర్చుందని? నెమరు వేసుకోవడానికి ప్రయత్నించాడు. బుగ్గనిండా చివచివలాడే కొల్ కొత్తా స్వీట్ పాన్ బిగుంచుకొని, పండి పోయిన ఎర్రటి నాలికను పదే పదే తనకు తాను చూసుకుంటూ, అతడికి కావాలనే చూపిస్తూ- కాటుక కళ్ళను ఎగరేసి నవ్వు తూ, కైపెక్కించే చూపులతో పుర్రెక్కిస్తూ- దగ్గరితనమున్న అత్తకూతురులా జారిపోతూన్న పైట చెంగుని కావాలనే గాలికి వదిలే స్తూ- మురిపంగా తన గడ్డం నిమురుతూ బుజ్జగిస్తూంది- గగన వీధిన వీణ మీటగా వినిపించే మోహన రాగంలా-- ఐనా తను భార్యను విడిచి ఎన్నాళ్ళయిందని? పట్టుమని నెలరోజులు కూడా కాలేదే-- కలలో కూడా రూపవతి మేడమ్ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరు భార్య అన్నది మరచిపోవచ్చా! మరి కాసేపటికి లేచి చూస్తే అతడికి ముఖం నిండా చెమట చుక్కలు నిండాయి. తిన్నగా మొసలి నోట్లోకి తలదూర్చడం అంటే ఇదేనేమో! ఇంతకీ తనను ఇంతగా హత్తుకుపోవాడనికి రూపవతిలో తనకగుపించినది ఏమిటో! ఇంకేమిటి- అదెప్పుడో వీధి నాటకంలో యెవరో పాడి వినిపించిన పద్యం గుర్తుకి వచ్చింది; శ్రీనాథుడికి మనసార నమస్కరిస్తూ తలపోసాడు — “బిగువై, వట్రువులై, విరాజితములై, బింకంబులై- యుబ్బులై, నగసాదృశ్యములై, మనోహరములై, నాగేంద్ర కుంభంబులై, సొగసై, బంగరు కుండలై-” అబ్బో! ఇక తనవల్లకాదు బాబూ ఆ విరహాగ్నిని భరించడం-- గతి తప్పిన ఆలోచనల్ని తిరిగి దారిలోకి తీసుకురావడానికి కంకణం కట్టుకుంటూ ఆపుకున్నాడ తను. మొదట తన ఇద్దరు కొడుకుల్నీ కళ్లముందుకు తెచ్చుకున్నాడు- పిదప వయసు మళ్ళి కన్న తల్లి దండ్రుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. అప్పుడు తననే నమ్ముకున్న తన భార్యామణి కాంతం ముఖారవిందం కనిపించింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/mRL50JFkZaY
Embed this episode
NOW PLAYING
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 2 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 2 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.