ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 3 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 3 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 11, 2023 · 20 MIN

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 3 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 3 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 3' - New Telugu Web Series Written By Pandranki Subramani 'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 3' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం. ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురాలు రూపవతి కనిపిస్తుంది. అతనిలో అలజడి మొదలవుతుంది. తన ఊరికి వెళ్లి రావడం కష్టంగా ఉందని, పని మానేసి వెళ్ళిపోతానంటాడు భద్రం. కుటుంబాన్ని ఢిల్లీకి తీసుకురమ్మని, అవసరమైన సహాయం చేస్తానని చెబుతుంది రూపవతి. 'ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై - పార్ట్ 3' చదవండి. ఆవేదనా పూర్వమైన అతడి మాటలు విన్నంతనే ఆమెలో హృదయావేశం పొంగింది. వయసు ముదిరిన తల్లిదండ్రుల కోసం ఎంతమంది ఈరోజుల్లో అంతగా ఆలోచిస్తారు? ఇప్పటి తరం వాళ్ళు చాలా మంది గట్టు దాటిన తరవాత తెప్పను తగలబెట్టే రకమే-- అప్పుడు రామభద్రమే మళ్ళీ అందుకున్నాడు- “పోను రెండురోజులు- రాను మరొక రెండురోజులు- ఇది దాదాపు నాకు వల్లకాని వ్యవహారమండీ—ఇందులో మరొకటి కూడా ఇమిడి ఉందండీ! రాఘవయ్యగారు నాకు కన్నతండ్రే కాదు- నాకు గురువు గారు కూడాను. పాకశాస్త్ర వ్యవహారమంతా చిన్నప్పుడు ఆయనే నేర్పారు. ఆ తరవాతనే కామయ్యగారి వద్దకు మరింతగా వంట పనులు నేర్చుకోవడానికి పంపించారు. ఇప్పుడాయననూ అమ్మనూ అలా గాలికి వదిలి రావడం ఏమాత్రమూ సముచితంగా తోచడం లేదండీ! ఇక నేను బయల్దేరడానికి ఇంకా నాలుగైదు రోజులున్నాయి గనుక నేను గంగాధరానికి ఓ మాట చెప్పి- నాకు వత్తాసుగా నిలచిన ఇద్దరు ముగ్గురుకి కూడా ఓ మాట చెప్పి వస్తానండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు నా పట్ల చూపించిన ఆదరణ నేనెన్నటికీ మరవలేనండీ! మొదట్లో ఇంకేమో అనుకున్నాను గాని-- ఇంత కచ్చితంగా నికార్సుగా పని వాళ్ల అవసరాలు తెలుసుకుని జీతభత్యాలందించే ఓనర్ ని నేనింత వరకూ చూడలేదండి. పెద్ద పెద్ద హోటేల్ వాళ్ళు కూడా మా బోటి వాళ్ల వద్దకు వచ్చేటప్పటికి పిలకలు పట్టుకుని ఆటలు ఆడిస్తారు. జీతభత్యాలివ్వకుండా పి ఎఫ్ కట్టకుండా పదిహేనవ తేదీవరకూ ఈడ్చుకుంటూ పోతారండి. ఈవిషయంలో మీవి అమృత హస్తాలండి” అపరిమితమైన ఆవేశానికి లోనైపోయి అసంకల్పితంగా రూపవతి చేతిని అందుకుని కళ్ళకు హద్దుకున్నాడు. అతడు చూపించిన అభిమానానికి ఆమె నేత్రాలు తడిసాయి. ఇంతటి ఉన్న త సంస్కా రవంతుడి ఉనికిని కోల్పోవచ్చా! ఆణిముత్యాలు కడలి అడుగున కదూ ఉంటాయి-- ఆమె తన చేతిని వెనక్కి తీసు కుంటూ అంది- “నేనొకమాట చెప్తాను వింటారా! ” ఉఁ అన్నాడతను. “నా అనుభవంలో నాకు తెలిసినంత వరకూ చాలామంది పని చేస్తారు ఏనో తానుగా-- కాని అందరూ మనసుంచి పని చేయరు. కాబట్టి చెప్తున్నాను, ఇక మీరక్కడుండకండి. మళ్లీ ఇక్కడకు వెంటనే వచ్చేయండి. నాకిక్కడ కాస్తంత దూరాన సింగల్ విజిటర్స్ రూముంది. ఇన్నాళ్లూ బాడుగపైన అక్కడుంటూన్న వారు ఖాలీ చేయబోతున్నారు. మీరూ- మీవాళ్ళందరూ ఆ సింగిల్ రూము గదిలోకి వచ్చేయండి. సరేనా?" “వీలుపడదేమోనండీ! ఎందుకంటే మాకుటుంబానికి ముఖ్యంగా మా అమ్మానాన్నలకు సింగిల్ బెడ్ రూము చాలక పోవచ్చం డి. అందునా మాకుర్రాలిద్దరికీ ఇక్కడ స్కూలులో సీట్లు దొరకకడమంటే మాటలు కావుగా! వంటవాణ్ణి—అంతెత్తు విరాళాలు ఫీజు లూ ఇచ్చుకోలేనుగా-- అక్కడి వ్యవహారం వేరు—ఏదో ఒక పంచాయతీ బోర్డు స్కూలులో చేర్పించేయ వచ్చు” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Uk8BYmHBvFc

Episode metadata supplied by the publisher feed · Published Aug 11, 2023

Embed this episode

NOW PLAYING

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 3 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 3 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 20:10

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 20 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 11, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!