EPISODE · Aug 18, 2023 · 15 MIN
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 4 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 4 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 4' - New Telugu Web Series Written By Pandranki Subramani 'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 4' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం. ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురాలు రూపవతి కనిపిస్తుంది. అతనిలో అలజడి మొదలవుతుంది. తన ఊరికి వెళ్లి రావడం కష్టంగా ఉందని, పని మానేసి వెళ్ళిపోతానంటాడు భద్రం. కుటుంబాన్ని ఢిల్లీకి తీసుకురమ్మని, అవసరమైన సహాయం చేస్తానని చెబుతుంది రూపవతి. ఇంటికి వెళ్లిన రామభద్రం ఢిల్లీకి రావడానికి తన కుటుంబ సభ్యులను ఒప్పిస్తాడు. 'ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై - పార్ట్ 4' చదవండి. రామభద్రం కుటుంబ సమేతంగా రైలు బండినుండి న్యూఢిల్లీ స్టేషనులో దిగేటప్పటికి తనతో బాటు అసిస్టెంటు కుక్సుగా పనిచేస్తూన్న భీమన్, సుందరయ్య ఇద్దరూ ఎదురు వచ్చారు చేయూత నివ్వడానికి. వాళ్ళను చూసిన మరుక్షణం అతడికి కడుపులో బిందెడు పాలు పోసినట్లనిపించింది. సహాయమంటే ఇది కాదా నిజమైన సహాయం! అదీను తను అడక్కుండానే తాముగాఎదురొచ్చి చేయూతనివ్వడమంటే ప్రాణదానం చేసినట్లుకాదూ! వాళ్ళను భర్త పరిచయం చేసిన తోడనే కాంతం ఇద్దరికీ నమస్క రించింది. అందరూ ట్రాలీలో సామానుంచుకుని స్టేషన్ బయటకు వచ్చేటప్పటికి చలి తీవ్రంగా తాకనారంభించింది. రాఘవయ్యా తాయారమ్మా తమతో తెచ్చుకున్న దట్టమైన దుప్పట్లను ఒంటినిండా కప్పుకున్నారు. పిల్లకాయలిద్దరూ వేసుకున్న నార స్వెట్ట ర్లకు ఉషారుగా గుండీలు వేసుకుని సర్దుకుని చుట్టు ప్రక్కల కలయ చూస్తూ నడవసాగారు; కదిలే ప్రవాహంలా సాగుతూన్న జనసం దోహం మధ్య. కాంతం మాత్రం చీర చెంగుని మెడనిండా పరచుకుంది. దేశరాజధాని పరిసరాలను అక్కడ కొత్తగా గోచరించే ప్రజల ఆహార్యాన్ని పరకాయించి చూస్తూ నడుస్తూంది. అలా వాళ్ళతో కలసి నడుస్తూనే ఆగాడు రామభద్రం- “ఎన్ని ఆటోరిక్షాలు మాట్లాడుకుందాం? మూడు చాలా? ”అని అడుగుతూ-- ఆ ప్రశ్నతో ఇద్దరు కుక్సులూ తిరిగి చూసి బదులిచ్చారు ముక్తకంఠంతో- “ఎందుకూ? మేడమ్ తన క్వాలీ జీప్ ని పింపించారు, నువ్వు భార్యాబిడ్డలతో అమ్మానాన్నలతో వస్తున్నావని తెలిసి— నువ్వి ప్పుడు నీకు మేడమ్ కేటాయించిన అపార్టుమెంటుకి తిన్నగా వెళ్లు. అక్కడ మీకు సామాను సర్దడంలో సహాయం చేయడానికి ఇద్దరు ముగ్గురు చౌకీదారుల్ని ఏర్పాటు చేసారు మేడమ్. మేం మాత్రం తిన్నగా మెస్సుకే వెళ్లిపోతాం. సరేనా?” అంటూ అక్కడ వాళ్ల ముందుకు వచ్చిన క్వాలీస్ బండిలో కి సామానంతటినీ ఎక్కించి ప్రక్క కు తప్పుకున్నారు భీమన్ సుందరయ్యలిద్దరూ-- Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/3rTCsYTHhwk
Embed this episode
Ready to play
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 4 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 4 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.