ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 5 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 5 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 24, 2023 · 13 MIN

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 5 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 5 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 5' - New Telugu Web Series Written By Pandranki Subramani (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ అతడు ఆమె వెనుకే నిదానంగా నడచి వెళ్ళాడు. అప్పుడామె స్వెట్టర్ని తీసి చీర చెంగుని ప్రక్కకు తొలగించి అమృతాంజనం చేతికిచ్చింది మెడ చుట్టూ మెడదిగువనా గట్టిగా అదుముతూ రుద్దమని-- రామభద్రం డబ్బా అందుకున్నాడే గాని చేష్టలుడిగి నిల్చున్నాడు. కలలో లేక ఊహలో మాత్రమే ఎదురు చూడగల పనిని రూపవతి మేడమ్ తనకు మక్కికి మక్కిగా అప్పగిస్తూంది. ఒక విధంగా ఇది నిప్పుతో చెలగాటమే- వాళ్ళ మరదలు మంజులవాణి ఆమెకు మర్దన చేయడం వేరు. అకౌంట్సు స్టాఫ్ మాలిని రుద్దడం వేరు. పరపురుషడైన తను తాకుతూ రుద్దడం అంటే, కత్తిపైన సాము చేయడమే అవుతుంది. ఈతంతు అంతా ఎక్కడో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూన్న ఆ మాజీ మిలిటరీ ఆఫీసరు భవ్యంగా చేయాల్సిన పని. అప్పుడతనికి రూపవతి గొంతు వినిపించింది- ”అదేమిటి గోడకు కొట్టిన పటంలా నిల్చుండిపోయారూ! నొప్పితో మెలికలు తిరిగి పోతుంటేనూ—త్వరగా ముగించండీ—నాకు బోలెడంత పనులున్నాయి“ “హాఁ హాఁ! డబ్బా విప్పుతున్నానండీ! ఐనా మీరు మరి కొంచెం సేపు మంజులవాణిగారి రాక కోసం నిరీక్షిస్తే బాగుంటుందేమో- లేదా మీ యింటి పనిగత్తెను పిలిపిస్తే బాగుంటుందేమో-- ” అంటూ అతడు మరొక మారు నిశ్చలంగా చూస్తూండిపోయాడు. అందమైన ఆమె శరీరఛ్చాయికి అతడి కళ్ళు రెండూ ఫెళ్లు మంటున్నాయి. తెల్లటి విశాలమై నునుపైన వీపు. చాతీ మధ్య పచ్చపాములా ప్రాకిన చార బిగువైన యవ్వనానికి ముత్యాల హారం. అతడెప్పుడో చదివిన పద్య భావం స్ఫురణకి వచ్చింది- ‘దొండపండులాంటినీ పెదవులు, గుండె ఎత్తులు, గిరిజాల జుత్తు, మెరిసే సుందరమైన నీ కన్నులు చూపించకుండా నీ సౌందర్యమైన వదనాన్ని అలుక వహించి చాటేసుకున్నంత మాత్రాన వచ్చిన నష్టం ఏ మొచ్చింది గనుక? అద్భుతమైన నీ నితంబాలు, పొడవైన వంపులు పోయే నీ జడ చాలవూ నన్నూ నా మనసునీ ముప్పిరిగొనడానికి! ’” అతడిక ఆలోచించడం ఆపుచేసాడు. ఆడది ఎదుర్కుంటూన్న అపాయ సమయంలో ఈ తెలివి మీరిన ఉపాయాలేమిటి? ఊహాగానాలేమిటి? అందులో తనకు ఉపాధి కల్పిస్తూన్న యజమానురాలాయె—ఐనా విధి విలాసం కాకపోతే, ఇటువంటి సమయంలోనే ఆ మంజులాదేవి మహాతల్లి మాలినీ మహాతల్లీ నల్లపూసల్లా కనుమరుగయి పోవాలా! తనను తను నిగ్రహించుకుని నిదానంగా “పాహిమాం! పాహిమాం! ”అని మనసున పదే పదే అనుకుంటూ అమృతాంజనం మెడ చుట్టూ కొంత మెడకి అవతలి వేపు మరికొంత రుద్ది డబ్బాను ఆమెచేతికిచ్చేసాడు భద్రం. రూపవతి రిలీఫ్ గా ఫీలవుతూ అంది- “అబ్బ! ఎంత రిలేక్స్ గా ఉందని—పోయిన ప్రాణం లేచి వచ్చినట్లుంది. నిజం చెప్తున్నాను- చాలా బాగ మర్దన చేసారు”. అప్పుడతను నవ్వి సమర్థింపుగా అన్నాడు- “ఔను! మీరు చెప్పిందాంట్లో వాస్తవం ఉంది. మర్దన చేయడం ఒక కళ మేడమ్. ఇది మా బాబు నేర్పాడు. కొన్ని కీలక స్థానాల్లోనే నొక్కి వదలాలి. అలాగని అంతటా గట్టిగా ఒత్తిడికి లోను చేయకూడదు” అంటూ క్యాష వింగ్ నుండి బైటకి వచ్చాడతడు. అప్పుడామె అంది-. “అదేంవిటి? థేంక్స్ కూడా తీసుకోరా!” ”అప్పుడతను వెనక్కి తిరిగి చూసి అన్నాడు- “థేంక్స్ నాకెందుకండీ? మీకు సహాయకారిగా ఉండటంలో నాకెంతో సంతోషం. లోపల సోమనాథం గారు నాకోసం వెతుకుతుంటారు ఐతే- వెళ్లే ముందు రెండు మాటలు చెప్తాను—మీరు గాని ఫ్రెండ్లీగా తీసుకుంటే--” “దానికేముంది? చెప్పండి” “మీరెప్పుడైనా మీ ముఖార విందాన్ని బాగా చూస్తుకున్నారా!” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/5DkXiDxpbJA

Episode metadata supplied by the publisher feed · Published Aug 24, 2023

Embed this episode

NOW PLAYING

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 5 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 5 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 13:22

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 13 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 24, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!