ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 6 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 6 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 29, 2023 · 15 MIN

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 6 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 6 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 6' - New Telugu Web Series Written By Pandranki Subramani 'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 6' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం. ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురాలు రూపవతి కనిపిస్తుంది. అతనిలో అలజడి మొదలవుతుంది. తన ఊరికి వెళ్లి రావడం కష్టంగా ఉందని, పని మానేసి వెళ్ళిపోతానంటాడు భద్రం. కుటుంబాన్ని ఢిల్లీకి తీసుకురమ్మని, అవసరమైన సహాయం చేస్తానని చెబుతుంది రూపవతి. ఇంటికి వెళ్లిన రామభద్రం ఢిల్లీకి రావడానికి తన కుటుంబ సభ్యులను ఒప్పిస్తాడు. ఢిల్లీకి చేరుకున్న భద్రం కుటుంబానికి వసతి చూపిస్తుంది రూపవతి. రూపవతి ప్రవర్తన కాస్త అసహజంగా కనిపిస్తుంది భద్రానికి. ఆమెతో నిగ్రహంగా వ్యవహరించాలని అనుకుంటాడు. అతను ఆఫీసుకు రాకపోవడంతో ఏమై ఉంటుందని ఆలోచిస్తుంది రూపవతి. 'ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై- పార్ట్ 6' చదవండి. అనుకున్నట్టే రామభద్రం ముందస్తుగా తన సెల్ ఫోను ద్వారా మెస్సుకి వస్తున్నట్టు తెలియ చేసి మరునాడు డ్యూటీకి ఠంచనుగా వచ్చాడు. కాని మామాలు స్థితిలో కాదు; దవడలపై రెండు- నుదుటపైన మరొక చోటా ప్లాస్టరూ కట్టుకుని కనిపించాడు. అతడి వాలకం చూసి రూపవతితో బాటు తతిమ్మా ఇద్దరు లేడీ మెస్ స్టాఫ్ కూడా నివ్వెరపోయారు. “ఏమైంది రామభద్రం?" అని ముక్తకంఠంతో అడిగారాడాళ్ళూ ముగ్గురూ-- ఎందుకంటే అతడి ముఖం కూడా నీరసంతో జేవురించి ఉంది. “ఏమి లేదు మేడమ్. బాత్రూములో జారిపడ్డాను. మరేమీ కాలేదు“ అంటూ పాకశాల వేపు వెళ్లిపోయాడు. ముగ్గురూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇంత వరకూ అతడు చాలామంది ఢిల్లీ వాసుల్లా, సాయంత్రం పూట ఇల్లు చేరుకున్న తరవాత మజాగా మందు ద్రావకం వేసుకుంటాడన్న అనుమానం వాళ్ళకెప్పుడూ కలగలేదు. అలాగని అదొక పెద్ద నేరమని కాదు-- ఎందుకంటే అక్కడ హైస్కూలు పిల్లకాయలు సహితం కొందరు ధారాళంగా బీర్ అంటూ- జిన్ అంటూ మామూలు తేనీరులా పుచ్చుకుంటుంటారు. కాని- కుటుంబం పట్ల మిక్కిలి అక్కర చూపిస్తూ- మంచీ మర్యాద పాటిస్తూ- హందాగా కనిపించే రామభద్రం వాటి జోలికి వెళ్తాడా-- ముగ్గురూ ఎటూ తేల్చుకోలేక సతమయారు. అతను నిజంగానే ఏదైనా ప్రమాదానికి లోనై ఉంటే తనకు ఫోన్ చేసి చెప్పడూ-- అలా కాకుండా రోజంతా కబురు కూడా లేకుండా కనుమరుగవడానికి ప్రయత్నించాడంటే- ఇంకేదో జరిగుంటుంది. ఇక విషయానికి వస్తే- ఎదుటి మనిషిని అర్థం చేసుకొని ఎంత వరకు నమ్మాలో యెంతవరకు నమ్మకూడదో తేల్చుకోవడం నిప్పుకణి కల మీద సాగే నడకే-- ఏమో యిప్పటికిప్పుడు చెప్పడం కష్టం గాని యిరుగు పొరుగు వాళ్ళ సహవాస దోషం కూడా కావచ్చే మో! ఢిల్లీ నగరంలో చాలా మంది సిక్కు పంజాబీలకు గుంపుగా మందు పుచ్చుకోవడం అలవాటు. అటువంటి గుంపులోకి చేరక పోతే నామోషీగా భావిస్తారు వాళ్ళు. రామభద్రం వాళ్ళ వలయంలో చిక్కుకున్నాడేమో! Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/7DuawADGuSs

Episode metadata supplied by the publisher feed · Published Aug 29, 2023

Embed this episode

NOW PLAYING

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 6 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 6 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com

0:00 15:21

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 15 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 29, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!