EPISODE · Sep 4, 2023 · 20 MIN
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 7 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 7 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 7' - New Telugu Web Series Written By Pandranki Subramani 'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 7' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ మెస్సు చీఫ్ కుక్ సోమనాథం హిందీ సరళంగా మాట్లాడగలడు. అక్కడక్కడ కొంచెం పంజాబీ మరికొంచెం రాజస్థానీ కూడా జోడించి మాట్లాడగలగటం వల్ల అక్కడివాళ్ళతో కలగలసిపోతాడు. చూసేవారికి అతడు అక్కడి ప్రాంతానికి చెందినవాడి గానే తోస్తూంది. ఐతే- అతడు నిజానికి ఢిల్లీ నగరానికి చెందినవాడు మాత్రం కాడు. ఆ మాటకు వస్తే, రూపవతి మేడమ్ లా మంగళూరు ప్రాంతానికి చెందిన వాడు కూడా కాడు. తమిళనాట తెలుగు పూర్వీకులైన కుటుంబానికి చెందిన వాడు. త్యాగరాజు స్వామివారు తంబూరా పట్టుకుని తిరిగిన దక్షిణ తమిళ ప్రాంత ధాన్యాగారమైన తంజావూరు ధరణిలో పుట్టి పెరిగిన వ్యక్తి. అత డి పూర్వీకులకు శాస్త్రీయ సంగీత రంగంతో- రాగాల శృతులతో అవినాభావ సంబంధం ఉంది. అప్పటిలా కాకపోయినా ఇప్పటికీ అక్కడున్న సోమనాథం కుటుంబీకులందరూ ప్రతి ఏడూ జరిగే త్యాగరాజు స్వామివారి ఆరాధనోత్సవాలకు- కీర్తనోత్సవాలకు ఉన్నంతలో సేవలు చేస్తూనే ఉన్నారు. తరిస్తూనే ఉన్నారు. సంప్రదాయ సంగీతాభిమానమంటే—పూర్వజన్మ సుకృతమే కదూ! ”నిధి సుఖమా! లేక రాముని సన్నిధి చాలా సుఖమా! ” అని నిలదీయలేదూ తెలుగు రసికుల హృదయ పెన్నిధి త్యాగయ్య! ఇకపోతే, విషయానికి వస్తే—సోమనాథం మాత్రం కొన్నివ్యక్తిగత పరిస్థితుల వల్ల పుట్టునూరులో ఉండలేకపోయాడు. ఎప్పుడెక్కడ ఎటువంటి అపచారం జరిగిందో గాని- వాళ్ళింటికి ప్రేతకళ వాటేసుకుంది. ఉన్న మాగాణిని సాగుచేసుకుంటూ బ్రతుకీ డుస్తూన్న పెద్దన్నయ్య ఆ తరవాత చిన్నన్నయ్య- ఆ తీరున ఒకరు తరవాత ఒకరుగా పరలోక ప్రాప్తి చెందారు. ఆ దు:ఖ పూరిత క్షోభనుండి తేరుకొనక ముందే అతడి జీవిత భాగస్వామిని బిడ్డ ప్రసవించిన మరునాడు పైలోకాలకు దారిచూసుకుంటూ అదృశ్య ప్రపంచానికి చేరుకుంది. దానితో భూకంపానికి లోనై నెర్రెలు బారిన నేలలా సోమనాథం గుండె పగిలింది. మాటలకందని వైరాగ్యం తనువెల్లా ప్రబలింది. తనకత్యంత ప్రియమైన ప్రాణ ప్రదమైన శాస్త్రీయ సంగీత పైరు గాలిని విస్మరించి, మాంసపు ముద్ద లాంటి పాపను ఇద్దరు వదినమ్మలకు అప్పగించి- పెట్టే బేడా అందుకుని యెకాయెకిన ఊరువిడిచి వచ్చేసాడు. తిన్నగా కొత్త ఢిల్లీలో దిగి కరోళ్ బాగ్ కి చేరుకుని తెలిసిన మిత్రుడి పంచన చేరాడు. అతడి సహాయంతో అదే ప్రాంతంలో ఉన్న రూపవతి వాళ్ల నాన్నగారి మెస్సులో కుక్ సహాయకుడిగా చేరాడు. ఆనువంశికంగా అతడు వంటలు వార్చే వృత్తికి చెందిన వాడు కాకపోయినా మన్ననతో పనిచేస్తూ వంట పనులు నేర్చుకుంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు. రూపవతి నాన్నగారు స్వర్గస్థులైన తరవాత మెస్సు నిర్వహణ రూపవతి హయాములోకి వచ్చింది. సమర్థనీయురాలూ- విద్యావంతురాలూ అయిన రూపవతి మంగుళూరు నుండి తనతో బాటు తన మరదలు మంజులవాణిని తోడ్కొ ని వచ్చి మెస్సుని ఆధునీకరించి పకడ్బందీగా నడుపుతూంది. మిలిటరీ ఫీల్డులో ఉన్నప్పుడు- ఆ తరవాత స్వఛ్ఛంద ఉద్యోగ విరమణ పొంది సెకెండ్ ఇన్నింగ్స్ గా ప్రైవేటు కంపెనీలో చేరిన రూపవతిగారి భర్త లీవు పొందినప్పుడల్లా మంగళూరు వచ్చి చేరుతాడు. భార్యతో గడుపుతాడు. పిమ్మట అటునుంచి అటుగా వెళ్లిపోతాడు. అప్పుడీమె కూడా మంజులకూ మాలినికీ తాత్కాలిక నిర్వహణా బాధ్యతలు అప్పగించి వెళ్తుంది. ఎటొచ్చీ ఆమెకు బిడ్డలు కలగక పోవడమే పెద్ద నష్టజాతకంగా తయారయింది. అంత ఉత్కృష్ట గుణ సంపద గల స్త్రీకి అలా పుష్పవిహీనగా మిగిలిపోవడం అందరితో బాటు అక్కడి మెస్ స్టాఫ్ ని కూడా పీడిస్తుంటుంది. విషయానికి వస్తే ఆ పరిస్థితి ఏ స్త్రీకి దాపరించకూడదు. అందునా మంచీ మన్ననగల రూపవతి వంటి ఉత్తమురాలికి అటువంటి పరిస్థితి కలగనే కూడదు. పుత్రకామేష్టి యాగం చేయడానికి ఇంతవరకూ భార్యా భర్తలిద్దరూ ఎందుకు పూనుకోలేదో రామభద్రానికీ సోమనాథానికీ అగమ్య గోచరంగానే ఉంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/xS5mCV2QdEA
Embed this episode
NOW PLAYING
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 7 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 7 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.