EPISODE · Apr 4, 2023 · 9 MIN
ఇల్లే బృందావనం | Ille Brundavanam | Telugu Short Story | Sripathi Lalitha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఇల్లే బృందావనం రచన: శ్రీపతి లలిత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)"టిఫిన్ బాక్స్ పెట్టుకున్నావా ? నీకు ఇష్టమని మసాలా వడలు చేశాను. రెండు డబ్బాలు పెట్టాను. ఒకటి నువ్వు తిను వేరేది మీ ఫ్రెండ్స్ కి ఇవ్వు. జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి. ఆఫీస్ కి వెళ్ళాక మెసేజ్ పెట్టు. " లిఫ్ట్ దగ్గర నుంచుని చెప్తున్న మాలతిని చూసి నవ్వుతూ " అలాగే అమ్మామీరు లోపలికి వెళ్ళండి ఓకే, బై " లిఫ్ట్ రాగానే వెళ్ళింది ప్రియ.అవి హైటెక్ సిటీ దగ్గర ఒక గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్న ఫ్లాట్స్. ప్రియ, ప్రమోద్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. వాళ్ళకి ఒక పాప ఐరా, 5 ఏళ్ళు.ప్రియ వెళ్ళగానే లిఫ్ట్ నుంచి ఫ్లాట్ లోపలికి వస్తున్న మాలతి ని చూసి ఎదురు ఫ్లాట్లో ఉన్న ఆమె పలకరింపుగా నవ్వింది." నా పేరు స్వాతి, మేము కొత్తగా వచ్చాము ఆంటీ. ప్రియ ఆఫీసుకి వెళ్లిందా? " అంది. ""అవునమ్మా ? ప్రియ చెప్పింది మీరు ఈమధ్యే వచ్చారని. అలవాటు పడ్డారా ? "అడిగింది మాలతి."లోపలికి రండి ఆంటీ " పిలిచింది స్వాతి. " లేదమ్మా పొయ్యి మీద కూర పెట్టాను తరవాత వస్తానులే " అంటూ హడావిడిగా లోపలి వెళ్ళింది మాలతి.స్వాతి, ఆమె భర్త సంతోష్ కొత్తగా ఫ్లాట్ కొనుక్కొని వచ్చారు. వాళ్ళ అబ్బాయి చెన్నై లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. సంతోష్ కి సొంత బిజినెస్. స్వాతి ఇంట్లోనే ఉంటుంది.ఒక్క ప్రియా వాళ్ళ తోనే కొంచెం పరిచయం. ఒక్కతికి ఏమి తోచక ఎవరైనా కనిపిస్తే మాట్లాడుతుంది. మెయిన్ డోర్ దగ్గరికి వేసి కూర్చుంటుందికొద్దిగా మాటలు వినపడితే సందడిగా ఉంటుంది అని.ప్రియా వాళ్ళ అమ్మ నాన్న వచ్చినట్టున్నారు అనుకుంది.కొంచెం సేపటికి ప్రమోద్ కూడా బయటికి వచ్చాడు.కరెక్ట్ గా ప్రియా కి చెప్పినట్టే చెప్పింది. మాలతి."ఆఫీస్ కి చేరాక మెసేజ్ పెట్టు. టిఫిన్ బాక్స్ లో నువ్వు తీసుకోని మిగిలినవి ఫ్రెండ్స్ కి ఇవ్వు "అంటూ."గుర్తుంటే మెసేజ్ పెడతాను. అందరమూ కూర్చుని తినేప్పుడు అలా కుదరదు. " కోపంగా అంటూ వెళ్ళాడు ప్రమోద్."అల్లుడి పొగరు " అనుకుంది స్వాతి.సాయంత్రం ఐరా ని స్కూల్ బస్సు నుంచి తీసుకొని వచ్చారు మాలతి ఆమె భర్త మనోహర్.ఐరా ఆపకుండా ఒకటే కబుర్లు " తాతా, అమ్మా ". అంటూ.మరికాసేపటికి ప్రియ వచ్చింది. వాళ్ళు కూడా తలుపు దగ్గరికి వేసారేమో నవ్వులు కబుర్లు బాగా వినిపించాయి.అందరూ కూచుని భోజనం చేస్తున్నట్టున్నారు " అనుకుంది స్వాతి.స్వాతి భర్త పొద్దున్న వెళితే రాత్రి రావడం. ఇద్దరు కలిసి ఒకపూట కూడా భోజనం చేయరు.కలిసి తింటే ఒక ముద్దా ఎక్కువ కూడా తింటాము. కబుర్లు చెప్పుకుంటూ తింటే తిన్న తిండి ఒంటికి పడుతుంది.ఇలా ఒక్కతీ ఇంట్లో ఉండి చాల బోర్ గ ఉంటోంది. " నిట్టూరుస్తూ లోపలి వెళ్ళింది.ఆ తరువాత రోజు ఇదే తంతు.ఎంతైనా అమ్మ అమ్మే. ఆమె వచ్చాక ప్రియ మొహంలో సంతోషం కనిపిస్తోంది.రెండు రోజుల తరవాత ప్రియ స్వాతి దగ్గరికి వచ్చిందిస్వాతి గారు నాకు ఒక సహాయం కావాలి " అంది"తప్పకుండ ప్రియా ఏమిటి ? "అంది స్వాతి."ఇవాళ అమ్మ పుట్టిన రోజు ముందు చెపితే తనకు వద్దు అంటారు. నేను ఆన్లైన్ లో చీర, బొకే కేక్ బుక్ చేశాను. అవి మీరు తీసిపెట్టుకుంటారా ?నేను రాత్రి 10 తరవాత తీసుకుంటాను"అంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/kijM4j7Q19Q
Embed this episode
NOW PLAYING
ఇల్లే బృందావనం | Ille Brundavanam | Telugu Short Story | Sripathi Lalitha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.