EPISODE · Nov 16, 2022 · 8 MIN
ఇల్లు అద్దెకు ఇవ్వబడును | Illu Addeku Ivvabadunu | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఇల్లు అద్దెకు ఇవ్వబడును రచన : జీడిగుంట శ్రీనివాసరావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అది ఆరు ఫ్లాట్స్ కలిగిన అపార్ట్మెంట్. మంచి డిమాండ్ వున్న ఏరియా లో వుంది. అందులో ఒక ఫ్లాట్ అమెరికాలో వున్న ప్రవీణ్ ది. దాని బాధ్యతలని హైదరాబాద్ లో వున్న మామగారు కుమార్ కి అప్పగించారు. రెంట్ కి యివ్వడం, రిపేర్స్ వుంటే చూడటం కుమార్ పని. పక్క ఫ్లాట్ లో వున్న రాజేష్ కి మా ఫ్లాట్ కూడా చూసుకోమని చెప్పి, కుమార్ రెంట్ పడిందో లేదో చూసుకునే పని పెట్టుకున్నాడు. కరోనా టైం లో ఖాళీ అయిన ఫ్లాట్ కరోనా తగ్గిన చాలా రోజులకి ఒక బిజినెస్ మ్యాన్ కి యిచ్చి, అమ్మయ్య అనుకున్నాడు. మొదటి నెల నుంచే అద్దె యివ్వడం లేట్ చేయడం, ఆలస్యం కి ఏదో కారణం చెప్పడం మొదలుపెట్టాడు టెనంట్. ప్రతీ నెలా అడుకుంటే గాని అద్దె రావటం లేదు. అమెరికా నుంచి కూతురు 'అటువంటి వాడికి ఎలా యిచ్చారు డాడీ, ఇల్లు కదలకుండా ఎవడికి పడితే వాళ్ళకి యిస్తే యింతే', అంటూ నిష్ట్ఠురం గా మాట్లాడటం తో, అద్దెకు వున్న అతనికి నోటీసు యిచ్చి ఖాళీ చేయమని చెప్పి, మళ్ళీ అద్దెకు ఇవ్వబడును బోర్డు తగిలించాడు. బోర్డు పెట్టిన రోజు నుంచి ఫోన్ కాల్స్ ఎక్కువ అయిపోయాయి. రాజేష్ వచ్చిన వాళ్ళకి చూపించడం, చూసిన వాళ్ళు మళ్ళీ వస్తామని చెప్పడం, రాకపోవడం.. మొత్తానికి ఒక ఆదివారం, ఒకళ్ళు ఇల్లు చూసి, కుమార్ కి ఫోన్ చేసి ఇల్లు నచ్చింది మాకు, మీ అడ్రస్ యిస్తే వచ్చి వివరాలు మాట్లాడి అడ్వాన్స్ యిస్తామని చెప్పారు. మొత్తానికి ఎవరో తీసుకుంటామని ముందుకు వచ్చారు అనుకుని, వాళ్ళని రమ్మన్నాడు కుమార్. ఒక గంట తరువాత కారులో నుంచి యిద్దరు ఆడవాళ్లు, ఒక మొగతను దిగి లోపల కి వచ్చి కూర్చున్నారు. "మీరు ఎక్కడ పని చేస్తున్నారు, మీ వివరాలు చెప్పండి" అన్నాడు కుమార్. ఆ వచ్చిన అతను ఒక స్త్రీ ని చూపించి, "ఈవిడ నా భార్య, రెండవ ఆమె నా చెల్లెలు. నేను అమెజాన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని" అన్నాడు. "మేము మా ఇల్లు ఫ్యామిలీ కే యిస్తాము. మీరు ఫ్యామిలీ కాబట్టి మీకు యివ్వడానికి యిబ్బంది లేదు. అద్దె ప్రతీ నెల 5 వ తేది కి యివ్వాలి. లేట్ చేయడానికి వీలులేదు" అని చెప్పాడు కుమార్. వాళ్ళు కుమార్ చెప్పిన కండిషన్స్ కి ఒప్పుకుని, అడ్వాన్స్ యిచ్చి, "ఫస్ట్ కి వచ్చి జాయిన్ అవుతాము. ఇల్లు క్లీన్ చేయించండి" అని చెప్పి వెళ్లిపోయారు. వాళ్ళు వెళ్లిన ఒక అర గంటకి, ఒకతను ఫోన్ చేసి, "కుమార్ గారితో మాట్లాడాలి" అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/GeVNvGXtxcI
Embed this episode
Ready to play
ఇల్లు అద్దెకు ఇవ్వబడును | Illu Addeku Ivvabadunu | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.