'జెన్' - పతంజలి శాస్త్రి గారు episode artwork

EPISODE · May 14, 2021 · 28 MIN

'జెన్' - పతంజలి శాస్త్రి గారు

from Harshaneeyam

రిటైరై, కొడుకూ కోడలితో జీవించే నాయుడు గారు. వృత్తి రీత్యా ఒక మెకానిక్. చుట్టూ వుండే ప్రపంచాన్ని ఆశావహ దృక్పధంతో చూస్తూ, ఓపిగ్గా, చుట్టూవుండే పరిస్థితులను కావలసిన విధంగా మలుచుకుంటూ, జీవించడాన్ని ఇష్టపడతారు. ఆయనకు పూర్తిగా విరుద్ధ స్వభావం వుండే ఆయన కొడుకు కృష్ణ , తన జీవితంలో వుండే అసంతృప్తిని వస్తువులపై చూపించడమే కాక , తన భార్యను కూడా వాటి గాటన కట్టేసే మనిషి.కథలోవుండే ఇంకో ముఖ్యపాత్ర ‘అమ్మతల్లి’ - స్నేహితుడు పనికి రాదని పారేస్తూంటే నాయుడుగారు అతన్ని ఆపి తన ఇంటికి తెచ్చుకున్న, పాడుబడ్డ ఒక మెషీను.చెప్పదల్చుకున్న విషయాన్ని పాఠకుడికి చేరవేయడానికి , ఒక శిల్పాన్ని చెక్కినట్టు కథను చెక్కుతూ మెల్లగా పాఠకుణ్ణి తనకు కావలసిన ఆవరణంలోకి తీసుకువెళతారు, శాస్త్రిగారు.  నా కథలన్నీ అనుభూతి ప్రధానమైనవి, కథ నుంచి ఏమి తెల్సుకోవాలో, పాఠకుడే అలోచించి అందిపుచ్చుకోవాలి అంటారు ఆయన. పతంజలి శాస్త్రి గారు రాసిన అనేక గొప్ప కథల్లో ఇప్పుడు మీరు వినబోతున్న ‘జెన్’ ఒకటి. హర్షణీయం టీం తరఫున ఆయనకు డెబ్భై ఐదవ జన్మ దిన శుభాకాంక్షలు . Happy Birthday Sir.హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast)‘జెన్’ :గేటు ముందర స్కూటరు భయంకరంగా పొరబోయి దగ్గుతోంది. కిక్ కొట్టే కొద్దీ పొడి దగ్గే తప్ప ప్రాణం పోసుకుంటున్న జాడలేదు. కృష్ణ మొహం చెమటతో తడిసిపోయింది. తన భార్యని మానభంగం చేసిన దుర్మార్గుడిలా కనిపించింది స్కూటరు. ఆఖరిసారి కసి కొద్దీ కిక్ కొట్టి, దగ్గి ఆగిపోయిన వాహనాన్ని, అదే వేగంతో ఓ తాపు తన్ని నాలుగు బూతులు తిట్టాడతను.“నీడలోకి రండి” గేటు వెనక నిలబడి అంది అతని భార్య, డాబానీడ ఆమె మీద పడుతోంది. మొహం తుడుచుకుంటూ ఆమె పక్కన నించున్నాడు కృష్ణ. స్కూటర్ని చంపేయాలనిపించిందతనికి.“ఛీ ఎదవ స్కూటరు. సరిగ్గా టైముకు పెంట పెట్టింది. పది రూపాయలక్కూడా ఎవడూ తీసుకోడు.” తరువాత స్కూటరు శీలం గురించి అతని అభిప్రాయం వెలిబుచ్చాడు.సరళ కొంచెం సిగ్గుపడి నవ్వుతూ అంది “చీ. మామయ్యగారు వింటారు”"వింటే విన్నీ, మధ్యలో నీకేం? ఆఫీసుకెళ్ళేదినువ్వా? నేనా? దరిద్రం. నా కంటే ఎదవ ఎవడూ దొరక్క నాకమ్మాడు. నాకీ చండాలం పట్టింది""కృష్ణ ఇంకా వెళ్లలేదా?" భుజం మీది తువాలుతో కళ్లజోడు తుడుచుకుంటూ గేటు దగ్గరకొచ్చాడు నాయుడుగారు."స్టార్టవట్లేదండి” పక్కకి తొలుగుతూ చెప్పింది సరళ.కొడుకు వైపు చూశారు నాయుడుగారు. ఆగ్రహంతో స్కూటర్నే చూస్తూ మాట్లాడలేదు కృష్ణ. గేటు తోసుకొని బయటికొచ్చి గూడకట్టు చుడుతూ వాహనం దగ్గరికి వెళ్లారాయన.“ఎండ్లో మీరెందుకు. మీ వల్లకాదు. నే చూస్తాలేండి.”ఆగమన్నట్టు చెయ్యి చూసింది. స్కూటరు కింద చెయ్యి పెట్టి చూశారు నాయుడుగారు. ట్యూబు సరిచేసి పైకి లేస్తూ కొడుకు వైపు చూసి నవ్వారు.“ఓవర్ ఫ్లో. చూసుకోలేదేవీ?". ఆశ్చర్యపోయాడు కృష్ణ. దగ్గరికొచ్చి నుంచున్నాడతను. “కంగార్లో చూసుకోలేదు.”“కంగారెందుకు? బండి ఆగిపోతే జాగ్రత్తగా చూసుకోవాలి. కాలిరిగేలా కిక్కిస్తే లాభం లేదు. బయలుదేరు.”నీలి ధూపం సమర్పించి బయలుదేరింది, స్కూటరు. ఇద్దరూ నవ్వుకుంటూ వరండాలోకి వచ్చారు."ఆఫీసుకు లేటయిందని కంగారండి" భర్త తరఫున అంది సరళ.“ఆఫీసుల గొడవ స్కూటర్లకి తెలీవు. బయలుదేరే ముందు మనమే చూసుకోవాలి. ఆదివారం పూట ఓ అరగంట బండి దగ్గర కూర్చుని శుభ్రంగా అన్నీ సరిగా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవాలి."సరళ నవ్వింది. అంటే 'మీ అబ్బాయికి అంత ఓపిక ఎక్కడుందని అర్ధం’.“కొంచెం కాఫీ ఇవ్వు. ఓ అరగంట అమ్మతల్లి దగ్గర కూర్చుని తరవాత స్నానం చేస్తాను”తల ఊపి లోపలికి వెళ్లిపోయింది సరళ. చిన్న డాబా ముందు మూడు లుంగీల స్థలం. ఉద్యోగంలో ఉండగానే జాగ్రత్తగా కట్టించుకున్నాడు నాయుడుగారు. డాబా పిట్ట గోడ మీద కుండీలు పెట్టి మొక్కలు వేశారు. గేటు పక్కన అటూ ఇటూ రెండు రోజా మొక్కలు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ నీళ్లు పోస్తూ వాటితో నాయుడుగారు మాట్లాడతారని కృష్ణ గట్టి నమ్మకం. ఎన్ని పువ్వులు పూసినా, కోడలికి రెండూ పక్కింటిపాపకు ఒకటి, దేవుడి దగ్గర ఒకటి, మొత్తం నాలుగు పువ్వులు మొక్కలవి. గోడ బయట తురాయిమొక్క నాటారాయన. చైత్రమాసం నుంచీ కెంపులు పూస్తుందది. ఉదయం సాయంకాలం నాయుడుగారు గోడవతల పెరిగిన ఎర్ర నెమల్ని చూస్తూ కూచుంటారు. ఆయన్నలా చూసి చూసి కోడలు కాసేపట్లో మామగారే ఎర్రగా పూసుకొస్తారను కుంటుంది. ఇంకొంచెం పెద్ద స్థలం లేదని ఆయన బెంగ. మధ్యాహ్నాలు భోజనం చేస్తూ కోడలితో ఆయన చిన్నతనాన్ని, యవ్వనాన్నీ నెమరేస్తుంటారు నాయుడుగారు. సరళ ఓపిగ్గా వింటుంది. మామగారి బాల్య, కౌమార, మౌనవ జీవిత విశేషాలు ఆమెకి కామా చుక్కలతో సహా నోటికి వచ్చేశాయి. గడచిన పది సంవత్సరాల్లో చెప్పినవే చెప్తున్నానని తెలీదాయనకు.కాకినాడ దగ్గర చిన్న పల్లెటూరు. ఊరికి కొంచెం దూరంగా దట్టంగా పచ్చటి ముద్దల్లా పెరిగిన మడచెట్ల అడవుల్ని చీలుస్తూ ఏర్లు సముద్రంలోకి జారుకుంటాయి. నదిలో మెత్తగా ఆయన జ్ఞాపకాల పడవలో ఊగుతూ బయల్దేరతారు నాయుడుగారు. తెల్లటి పెద్ద ఏటి కొంగలు, ఆశ్చర్యపడ్డ నీటి పిల్లి, డైనింగు టేబులు మీద ప్రత్యక్షం అవుతాయి. ఒకసారి సముద్రపు ఆటు సమయంలో మడచెట్ల ఏట్లో పడవలో చిక్కుకుపోయి నీరు తీస్తుండగా పడవ తోసుకుంటూ పడ్డ అవస్థను సరళ అయిదువందల నలభైరెండోసారి వింటూ ఓపిగ్గా నవ్వుకుంటుంది. ఆమె నిజానికి పదహారోసారి నుంచే వినడం మానేసింది కానీ, నాయుడుగారు ఆమెతో మాట్లాడరు. ఆమె వైపు చూస్తూ ములక్కాడ చప్పరిస్తూ మాట్లాడతున్నా ఆయన కళ్లలో సముద్రం, అడవి, కొంగలూ పాత సినిమాలా కనిపిస్తాయి. చిన్నతనం గురించి చెప్తుంటే ఒక్కోసారి ఆయన కళ్లజోడు పెట్టుకున్న కొంగలా కనిపిస్తారు కోడలికి.కాఫీ తీసుకుని వరండాలోకి వచ్చింది సరళ. చేతిలో సిగరెట్ తో పరధ్యానంగా చూస్తూ కాఫీ అందుకున్నారాయన. కాఫీ చప్పరించి సిగరెట్టు పారేసి అమ్మతల్లి వైపు చూశారు. నాయుడుగారు. వరండా ఓ చివర సగం కిందికీ, మిగతా వరండాలో చెక్కల మీద బైఠాయించింది అమ్మతల్లి. స్టూలు మీదకూచుని రెంచి అందుకుని చిన్న చక్రాన్ని విప్పడం మొదలు పెట్టారు. కొంచెం నైవేద్య తైలం; గ్రీసు, పాత ఇనప రంగుతో కళకళ లాడుతూంటుంది తల్లి. తోలు తీసి పేగులు బైటపడేసినట్టు మరలూ, ప్లాస్టిక్ గొట్టాలు, పెద్ద చక్రం, రెండు చిన్న చక్రాలూ, స్క్రూలతో వరండాలో వేంచేసిన పాత యంత్రం అమ్మతల్లి. ఈ యంత్రం దేనిదో, ఎందుకు ఉపయోగపడుతుందో, ఎందుకు బాగు చెయ్యాలో ఆయన ఎప్పుడూ చెప్పలేదు. (“ఇనుం దరిద్రం గూడా. చెప్తే ఇనరుగా") దానికి నామకరణం చేసింది ఆయనే. జానపదుల పూజారిలా నాయుడుగారు భక్తిగా, ప్రేమగా, ఓపిగ్గా అమ్మతల్లిని సేవిస్తుంటారు. చిన్న చిన్న స్కూలూ, వాషర్లూ నూనెలో ఊరబెట్టి మళ్లీ బిగిస్తుంటారు.చక్రం చేతిలోకి ఊడొచ్చింది. రెంచి పక్కనబెట్టి కాఫీ తాగుతూ చక్రాన్ని పరిశీలించారు. ఎక్కడా వెంట్రుకవాసి బీటలేదు. త్రెడ్లు బాగానే ఉన్నాయి. నిన్ననే గ్రీసు పెట్టారు. మళ్లీ చక్రం బిగించి యంత్రం అవతలివైపు కరెంటు సరిగ్గా వస్తుందో, లేదో పరిశీలించారు. అంతా సవ్యంగావున్నట్టే. ప్లగ్ తీసి మళ్లీ బిగించారు. మళ్లీ స్టూలు మీద కూర్చుని జాగ్రత్తగా చక్రాన్ని బిగించి పాత గుడ్డతో చెయ్యి తుడుచుకుని స్విచ్చి నొక్కారు నాయుడుగారు. ముందు గొంతు సవరించుకుని కసకసమంటూ ఒక్కసారి ఊగి ఆగిపోయింది అమ్మతల్లి. స్విచ్చి ఆపి తేరిపార చూస్తూ కూర్చున్నారాయన.నాయుడిగారి అనుభవంలో ఎన్నో యంత్రాలు మొరాయించి మాట వినక తప్పలేదు. ఆయన స్పర్శ తగలగానే నాడి కొట్టుకుని ప్రాణంతో కెవ్వుమంటాయి యంత్రాలు. చెడిపోయిన యంత్రం చూడగానే ఆయనకి ప్రాణం లేచొస్తుంది. ఆయన కింద మెకానికులు పడుకునీ. దొర్లీ, కూర్చునీ వాటితో కుస్తీ పడుతుండేవారు. (మెషీనూ మనిషి లాటిదే! మనం అర్థంజేసుకోవాలంతే") రెండు రోజులు చూసి సరదాగా ఆయనే గ్లోవ్స్ తొడిగి రెంచి పట్టుకు తయారయ్యేవారు. ఇంజక్షన్ తీసుకుంటున్న రోగిలా యంత్రం నీరసంగా మూలిగి, కాసేపట్లో పూర్ణారోగ్యంతో బయటపడుతుంది."మొత్తం చూసుకోవాలయ్యా నువ్వు. కరెంటు వస్తానే ఉంది. లోపల ఏవైందో చూడాలి. నీకసలా సౌండ్ వింటే అర్ధం గావాలి. ఇప్పుడు జూడూ. పెర్ఫెక్ట్ సౌండు ఉంటే మెషీను పెర్ఫెక్ట్ గా ఉందన్నమాట.స్థిమితం ఉండాలయ్యా" శ్రీశైలం నీటిమట్టం వల్లా, ప్రభుత్వం వల్లా కరెంటు పోవాలి తప్ప నాయుడిగారింట్లో గీజరూ. లైట్లూ, కుళాయిలూ, పనిచెయ్యకపోవడం ఉండదు. సరళ స్నానం చేసి వచ్చేసరికి మామగారింకా అమ్మతల్లి దగ్గరే ఉన్నారు. ప్లాస్టిక్ గొట్టం తీసి శుభ్రం చేసి మళ్లీ బిగిస్తున్నారు. ఒక్క క్షణం ఆయన వేపే చూస్తూండిపోయిందామె. ఆయన బాల్యం, కౌమారం ఆమెకి కొంచెం అర్ధమైనాయి కానీ పాతబడి చెడిపోయిన ఈ యంత్రాన్ని ఆయన అంత ఓపిగ్గా ఎందుకు బాగు చెయ్యాలో తెలీలేదామెకు. ఒక్కసారికూడా ఆయన చీకాకు పడ్డం, విసుక్కోవడం చూడలేదు సరళ. ఒకటి రెండుసార్లు చటుక్కున ప్రాణం వచ్చి మెషిను తిరగడం మొదలుపెట్టి మరుక్షణంలో ఆగిపోయింది. నాయుడుగారు తల అడ్డంగా ఊపుతూ నవ్వుకున్నారు. సామాన్యంగా ఆదివారాలు భార్యాభర్తలిద్దరూ సాయంకాలం బయటికి వెడతారు. టీ టైముకి లేవగానే ఇద్దరికీ ఆయన అమ్మతల్లి దగ్గరో, స్కూటరు పేగులు సవరిస్తూనో కనిపిస్తారు. సామాన్యంగా రాత్రి ఇద్దరూ తిరిగి రాగానే గొడవ పడతారు.స్నానం చేసి బట్టలు మార్చుకుని పేపరుతిరగేస్తూ కూర్చున్నారు నాయుడుగారు. మార్చి నెల ఎండలు ముదరలేదు. హైదరాబాదు నీటి కరువుకి సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రిగారు వీలయితే హిమాలయాల్లోంచి నీళ్లు తెచ్చి రాజధాని దాహం తీర్చే పథకం తన దగ్గర రహస్యంగా ఉందని తెలియచేస్తున్నారు. ఈలోగా కృత్రిమ వర్షాలు కురిపిస్తారుట. ప్రధానమంత్రిగారు మెక్సికో అధ్యక్షుణ్ణి పిలుస్తూండగా నాయుడిగారికి చిన్న కునుకు పట్టింది. పేపరు చేతిలో ఉండిపోయింది. మధ్యలో ఒకసారి సరళ వచ్చి చూసి వెళ్లింది.ఆయన్ని అలా చూస్తూ అప్పుడప్పుడు ఆమెకి భయం వేస్తుంది.“మామయ్యగారండీ! భోజనం వడ్డించాను” చటుక్కున మెళకువ వచ్చిందాయనకి. “సాయంకాలం మలక్ పేట వెళ్లాలటండి” “దేనికి!”“ప్రసాద్ గారి అబ్బాయి పుట్టిన రోజు, ఇద్దరం వెళదాం. రెడీగా ఉండమని చెప్పేరండి.”“వెళ్లిరండి. మరీ లేటవుకుండా వచ్చెయ్యండి." “అబ్బే. పిల్లాడి చేతిలో ఏదైనా పెట్టి త్వరగానే వస్తాంలెండి” “వాణ్ణి బండి జాగ్రత్తగా తీసుకెళ్లమనిచెప్పు" సరళ నవ్వింది. తండ్రీ కొడుకులు ఎక్కువ మాట్లాడుకోకపోయినా కృష్ణకి తండ్రి అంటే గౌరవం ఆయన ఎప్పుడూ ఒక్కమాట అనడం గుర్తులేదతనికి. చిన్నప్పుడు కూడా చెయ్యి చేసుకునేవారు కాదు. కోడలు రావడం వల్ల పొరపొచ్చాలు రాలేదు. స్కూటరు వల్ల వస్తుంటాయి. కృష్ణ గేరు...

NOW PLAYING

'జెన్' - పతంజలి శాస్త్రి గారు

0:00 28:49

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Harshaneeyam?

This episode is 28 minutes long.

When was this Harshaneeyam episode published?

This episode was published on May 14, 2021.

What is this episode about?

రిటైరై, కొడుకూ కోడలితో జీవించే నాయుడు గారు. వృత్తి రీత్యా ఒక మెకానిక్. చుట్టూ వుండే ప్రపంచాన్ని ఆశావహ దృక్పధంతో చూస్తూ, ఓపిగ్గా, చుట్టూవుండే పరిస్థితులను కావలసిన విధంగా మలుచుకుంటూ, జీవించడాన్ని ఇష్టపడతారు. ఆయనకు పూర్తిగా విరుద్ధ స్వభావం వుండే ఆయన...

Can I download this Harshaneeyam episode?

Yes, you can download this episode by clicking the download button on the episode player, or subscribe to the podcast in your preferred podcast app for automatic downloads.
URL copied to clipboard!