జీవిత చదరంగం | Jeevitha Chadarangam | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com episode artwork

EPISODE · Mar 1, 2023 · 18 MIN

జీవిత చదరంగం | Jeevitha Chadarangam | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) జీవిత చదరంగం రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) శ్రీధర్ కి ప్రగతి నగర్, నిజాంపేట్ రోడ్ లో మూడువందల గజాల స్థలం.. ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం కొని పెట్టినది అలాగే ఉంచేసాడు. శ్రీధర్ పెద్ద అన్నయ్య వేణుగోపాల్ అప్పట్లో తను కొనుక్కుంటూ శ్రీధర్ చేత కూడా కొనిపించాడు. అప్పట్లో శ్రీధర్ 'గురుగాం సిటీ' లో 'ఆదిదాస్ కంపెనీ హెడ్ ఆఫీస్' లో అకౌంట్స్ మేనేజర్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఇరవై సంవత్సరాలు అక్కడే పనిచేసి రెండు సంవత్సరాల క్రితం హైద్రాబాద్ వచ్చేసాడు. హైద్రాబాద్ లో 'బజాజ్ ఫైనాన్స్ సర్వీసెస్' లో ఇన్ వెస్ట్ మెంట్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు. శ్రీధర్ ఒక్కగానొక్క కొడుకు ఆదిత్య ఐ. ఐ. టి ఖర్గ్ పూర్ లో చదువు పూర్తి అయిన వెంటనే హైద్రాబాద్ 'ఎమ్ జాన్' కంపెనీ లో పోస్టింగ్ రావడం తో కుటుంబం అంతా 'గురుగాం' నుండి హైద్రాబాద్ వచ్చేసారు. తను ఎప్పుడో కొన్న స్థలం ఇప్పుడు బాగా డెవలప్ అయి చుట్టుపక్కల అనేక భవంతులు, అపార్ట్ మెంట్ లు వెలిసాయి. అక్కడ ఇల్లు కట్టుకుంటే కొడుక్కి ఆఫీస్ కూడా దగ్గర అవుతుందన్న ఉద్దేశంతో సొంత ఇంటి నిర్మాణం కోసం ప్లేన్ చేస్తున్నాడు. పైగా శ్రీధర్ పెద్ద అన్నయ్య వేణు అక్కడ ఇల్లు కట్టేసుకున్నాడు. తమ్ముడిని కూడా కట్టుకోమని ప్రోత్సహిస్తున్నాడు. తను కొన్న స్థలంలో సదుపాయంగా ఉండేటట్లు డూప్లెక్స్ ఇల్లు కట్టాలన్న ఉద్దేశ్యంతో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేట్ ఆఫీస్ కు ప్లేన్ అప్రూవల్ మొదలైన ఫార్మాల్టీస్ నిమిత్తమై వారం రోజులనుండి నుండి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఆఫీస్ అంతా వచ్చీ పోయే జనంతో కిట కిటలాడిపోతోంది. తన పని ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. ఆ రోజు తను వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో తన ముందు నుండి ఒక నలభై అయిదు సంవత్సరాల యువతి నడుచుకుంటూ లోపలకు వెళ్లడం చూసాడు. ఆమెను ఎప్పుడో ఎక్కడో చూసినట్లు చటుక్కున మనసుకి అనిపించినా పెద్దగా ఆలోచించకుండా మామూలుగానే తీసుకున్నాడు. అనేకమంది వస్తున్నారు వెడుతున్నారు. ఆ జన ప్రవాహంలో ఎవరు ఏమిటోనని ఆలోచించే ధ్యాసే ఉండడం లేదు. మరో గంట తరువాత మళ్లీ ఆ యువతే బయటకు వస్తూ ఏదో ఫైల్ తీసుకుని రిజిస్ట్రార్ కేబిన్ వైపు వెడుతూ, మధ్యలో ఆగి ఎవరితోనో మాట్లాడుతున్నపుడు ఆమెను పరీక్షగా చూసే అవకాశం కలిగింది. ఒక్క క్షణం సాలోచనగా చెంపలు నిమురుకుంటూ ఆమె వైపే చూస్తూ ఆలోచిస్తున్నాడు. పింక్ కలర్ ప్యూర్ సిల్క్ చీర కి సన్నని జరీ అంచు, కాంట్రాస్ట్ బ్లౌజ్, జారుముడి, చెవులకు చిన్న చిన్న స్టడ్స్, మెడలో సన్నని ముత్యాల దండతో ఎంతో హుందాగా అందంగా ఉంది. ముఖాన బొట్టులేదు. ఎవరబ్బా ఈవిడ, ఎక్కడో, ఎప్పుడో చూసిన జ్నాపకాలు కందిరీగల్లా ముసురుకుంటుంటే ఆలోచనలలో పడ్డాడు గానీ గుర్తుకు రావడంలేదు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/rycUEJFOb9I

Episode metadata supplied by the publisher feed · Published Mar 1, 2023

Embed this episode

NOW PLAYING

జీవిత చదరంగం | Jeevitha Chadarangam | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

0:00 18:18

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 18 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on March 1, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!