EPISODE · Sep 28, 2022 · 12 MIN
జ్ఞాపకాల పూలసజ్జ | Jnapakala Pulasajja | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) జ్ఞాపకాల పూలసజ్జ రచన: యశోద పులుగుర్త ఆముక్త- తన భర్త విక్రాంత్, కూతురు గేయ తో కలసి ప్రతీ రెండు సంవత్సరాలకు ఒక సారి అమెరికా నుండి ఇండియా వచ్చి వెడుతుంది. ఆరు సంవత్సరాల క్రితం చనిపోయిన తల్లి ప్రియంవద జ్ఞాపకాలెన్నో పూలసజ్జలో పేర్చిన పూల దొంతర్లలాగ కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. అమ్మా తనూ కలసి ఎన్నో సాయంత్రాలు తమ తోటలో కలసి తిరిగిన జ్ఞాపకాలనెన్నిటినో సన్నజాజుల మాలలా అందంగా అల్లుకుంటూ, పువ్వుల్లా పూసిన రోజులు రాలిపోయాక తొడిమల్లా మిగిలిన జ్ఞాపకాలతో భారంగా అమెరికా తిరిగి వెడ్తుంది. అలాగే ఈ సారీ వచ్చారు. ఔట్ హౌస్ లో తోటమాలి శీనూ, అతని కుటుంబం ఆ ఇంటినీ, తోటనీ పర్యవేక్షిస్తూ అక్కడే ఉంటారు. ఆముక్తా వాళ్ళు వచ్చేసరికి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతారు. తాను ఆ తోటలో తిరుగుతూంటే అమ్మతో గడిపిన ఎన్నో జ్ఞాపకాలు మదిలో మెదులుతూ అమ్మతో గడిపిన జీవితంలో ప్రతీ సంఘటన కళ్లకెదురుగా కదలాడుతుంటే వాటినే తలచుకుంటూ అలాగే నిలుచుండి పోయింది. ప్రియంవద పెళ్లైన నాటికే ఒక డిగ్రీ కాలేజ్ లో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తూ ఉండేది. భర్త సుధాకర్ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లో సైంటిస్ట్ గా పనిచేస్తున్నాడు. తల్లితండ్రులకు ఒకర్తే కూతురు అయిన మూలాన ఎంతో గారాబంగా పెంచి పెద్దచేసి చదువు చెప్పించారు. కూతురూ అల్లుడూ తమ కళ్ల ఎదుటే ఉండాలన్న తాపత్రయంతో సుధాకర్ సంబంధాన్ని ఇరువైపుల పెద్దలే కాకుండా ప్రియంవద, సుధాకర్ కూడా ఇష్టపడడంతో పెళ్లి జరిపించారు. ప్రియంవదకి తన పుట్టింటివారు బహుమానంగా ఇచ్చిన అందమైన విల్లాలో సుధాకర్ తో ఆనందంగా కాపురం చేసుకుంటోంది. అందమైన తోట మధ్యలో కట్టబడిన ఆ విల్లాని తన అభిరుచికి అనుగుణంగా మార్చుకుంది. తోటలో ఎన్నెన్నో పూలమొక్కలు తెప్పించి నాటించింది. ఆ తోటలో పూసిన గులాబీల రంగులను చూడడానికి రెండుకళ్లూ సరిపోవు. సాయంత్రం కాలేజ్ నుండి రాగానే ముందస్తుగా తోటలోకి వెళ్లి ప్రతీ మొక్కనీ, పూవునీ ప్రేమగా పరామర్శించేది. ఒకరోజు ఆమె పున్నాగ చెట్టుకింద నిలబడి ఏదో ఆలోచిస్తున్న తరుణంలో సుధాకర్ వచ్చాడు అక్కడకు. “నీకు నామీద కంటే ఈ తోటమీదే ఎక్కువ ప్రేమ కదూ ప్రియా..” అన్న సుధాకర్ మాటలకు " అసలు ప్రేమంటే ఏమిటి సుధా" అంటూ ప్రశ్నించింది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/E0fIIbyJTS8
Embed this episode
NOW PLAYING
జ్ఞాపకాల పూలసజ్జ | Jnapakala Pulasajja | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.