EPISODE · Sep 13, 2022 · 12 MIN
కాకతి రుద్రమ ఎపిసోడ్ 12 | Kakathi Rudrama Episode 12 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 12 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… చాళుక్య వీరభద్రుడు, రుద్రమ దేవి ఉద్యానవనం లో కలుస్తారు. వారి కలయిక చూసిన శివదేవయ్య సంతోషిస్తాడు. ఇక చదవండి.. తెల్లారింది. తూర్పు మబ్బు రాగరంజితమైంది. రుద్రదేవుడికి రాత్రంతా నిద్రలేదు. ఎడతెగని ఆలోచనలు. శత్రువులు దుమకటానికి సిద్దంగా వున్నారు. ఇటు చూస్తే కాకతీయ సామ్రజ్యం కత్తుల వంతెనవలె వున్నది. శత్రువులు యెంతమంది వున్నారో, కొమ్ముకాసే మిత్రులూ అంతే వున్నారు. గన్నారెడ్డి వార్తలు తెలియరావటం లేదు. లకుమయారెడ్డి - యాదవరాజులతోనూ, హరిహర మురారి దేవులతోనూ, కళింగులతోనూ ఈ సామ్రాజ్యలక్ష్మి ని చేపట్టాలనే పాచికలు వేస్తున్నాడనేది వేగులు తెచ్చిన వార్తలు. అయితే మురారిదేవుల మహామంత్రి రుద్రయ్యను గోన గన్నారెడ్డి బంధించినాడనీ- అతను యింకా బంధీగానే ఉన్నాడని మరొక్క నిర్దారితమైన కబురు. గన్నారెడ్డికి తమమీద వున్న అపారమైన ప్రేమకు, ప్రభుభక్తికి యిది మరొక మచ్చు తునక. ఉదాహరణ. అదీగాక, అన్నమాంబిక ను వలచినవాడు, నిండు మనసుతో ప్రేమను పంచుకున్నవాడు. చాటుమాటున తమకు సహాయం చేస్తున్నాడు కానీ, తమ సహాయాన్ని అతనెన్నడు ఆశించలేదు. అతడు వీరుడు. మెరుపు యుద్దతంత్రంలో దిట్ట. శత్రువును నిర్జించుటలో సిద్ధహస్తుడు. ఏమైనా అతడు మహావీరుడైన బుద్దారెడ్డి కుమారుడు కదా!.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/0c-iFJdXX-k
Embed this episode
NOW PLAYING
కాకతి రుద్రమ ఎపిసోడ్ 12 | Kakathi Rudrama Episode 12 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.