EPISODE · Sep 21, 2022 · 16 MIN
కాకతి రుద్రమ ఎపిసోడ్ 13 | Kakathi Rudrama Episode 13 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 13 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… గొంక ప్రభువు రుద్ర దేవుడిని కలుస్తాడు. గన్నారెడ్డి, మైలవనాయకుని ఓడించి సంహరించిన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు వివరిస్తాడు. గన్నారెడ్డి, మార్కాపురం ప్రభువైన సోమనాధప్రభువుని వధించిన వార్తకు సంబంధించిన వివరాలు అడుగుతాడు రుద్ర దేవుడు. ద్వంద యుద్ధంలో గన్నారెడ్డి, సోమనాధుడిని ఆలా చంపాడో చెబుతాడు గొంక ప్రభువు. ఇక చదవండి.. ఓరుగల్లు, నాగరికతా ప్రాభవాలకు పుట్టినిల్లు. కోటలు, బాటలు, వీధులు, రాచనగరులు, మంత్రి, సేనానాయకుల నివాసగృహాలు, బ్రాహ్మణ, వైశ్య వీధులు. గుర్రపుశాలలు, ఏనుగుల నివేశన స్థలములు, అంగళ్ళు, రకరకాల అలంకరణ సామగ్రులు, సుగంధ ద్రవ్యాలు.. అన్నీ విరివిగా దొరుకుతూ వుంటాయి. ఓరుగల్లులో దొరకని వస్తువు లేదు. ఆ నాళ్ళలోనే కవిత్వ, సంగీత, సాహిత్య, చిత్రలేఖనా, శిల్పకళ లు వుద్భవిల్లినాయి. ...... కమనీయ భరతనాట్య భంగిమలకు ఓరుగల్లు పెట్టిన పేరు. ఎన్నో శత్రురాజుల ఆటు పోట్లకు నిలబడిన కాకతీసామ్రాజ్యము తిన్నన్నీ ఢక్కా మొక్కీలు మరే సామ్రాజ్యము తినలేదు. గణపతి రుద్రదేవుల విశాలహృదయము , ఈవి, ఠీవి, ఔదార్యము, చరిత్రపుటలలో శాశ్వతకీర్తులతో నిలబడిపోయాయి. అలాగే రుద్రమదేవి కళాసహృదయత కూడా. ఒక సామ్రాజ్య ప్రాభవాలు ఆ ప్రభువుల దక్షతమీద, సిద్దహస్తత మీద నిలుస్తాయి....... ఇది రుద్రమదేవి తాతముత్తాతలనుంచి నిలుపుకున్న మగటిమి. అయితే గణపతి రుద్రదేవులు, తమసామంతరాజుల విషయంలో ఎంత ఉదారంగా ఉండేవారో, అవసరం వచ్చినప్పుడు అంత కఠోరంగాను వుండేవారు. తప్పు చేస్తే, వారు ఎవరైనా శిక్షించటానికి ఎన్నడూ వెనుకాడేవారు కాదు. -------------- గణపతి రుద్రదేవులు అంతిమక్షణాల్లో వున్నారు. మృత్యువు ఆయనను తనవెంట తీసుకు వెళ్ళడానికి అన్ని సంరంభాల్లోనూ సిద్దంగానే వున్నది. ఆయన, మహాభినిష్క్రమణము చెందబోయే వృద్దసింహంలాగా వున్నాడు. శరీరం క్షీణించింది. రాచకార్యాలకు విముఖంగా వున్నారు. శివదేవయ్యమంత్రులు తీరికలేని పనులతో సతమతమవుతున్నారు. సర్వసేనానులు తమ సైన్యాలతో సిద్దంగా వున్నారు. ఈ క్షణాల్లోనే ఎటు చూసినా , ఎటువైపు నుంచయినా శత్రువులు చుట్టుముట్టుకు రావచ్చు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Embed this episode
Ready to play
కాకతి రుద్రమ ఎపిసోడ్ 13 | Kakathi Rudrama Episode 13 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.