EPISODE · Oct 5, 2022 · 16 MIN
కాకతి రుద్రమ ఎపిసోడ్ 15 | Kakathi Rudrama Episode 15 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 15 అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 15 వ భాగం గత ఎపిసోడ్ లో… నిండు సభలో మహామాత్యులు శివదేవయ్య రుద్రమ దేవి స్త్రీ అనీ, ఆమెకు ముందులా సహకారం అందించాలనీ కోరుతాడు. ముమ్ముడాంబిక కి తాను స్త్రీనని చెబుతుంది రుద్రమ దేవి. ఇక చదవండి.. శివదేవయ్యలు యిప్పటినుంచి కాదు. ఎప్పటినుంచో గన్నారెడ్డిని రాజభక్తిగల వీరుడుగా గ్రహించ గలిగారు. ఆ మాత్రమన్నా ఆకళింపు చేసుకొనలేక పోయినట్లయితే ఈ అఖండ కాకతీ సామ్రాజ్యమునకు మహామాత్యు లెట్లు కాగలరు. గోనబుద్దారెడ్డి ప్రభువుల దగ్గరనుంచి వీక్షించినట్లయితే, ప్రభుభక్తికి వారు పెట్టని కోటలని జగద్విదితమైన విషయమే. తనకి అన్యాయం జరిగిందని గన్నారెడ్డి సోదరులు కృంగిపోలేదు.గణపతి రుద్రదేవులతో, తమ రాజ్యం తమకిప్పించమని యాచించలేదు. పట్టుమని పాతికేళ్ళయినా నిండకుండానే అరణ్యాల్లో చేరారు. కొండలను పిండి చేయగల వీరులను సేకరించారు. ఖడ్గచాలనం నేర్పాడు. ద్వంద యుద్దము నేర్పారు. మల్లవిద్యలో ప్రవీణులు గావించారు. విలువిద్యలో శబ్ధభేరుల్ని చేసి శరపరంపరలతో వళ్ళు తూట్లు గొట్టగల నేర్పరులను చేశారు. గదావిద్యలో నేర్పులను చేశారు. ఇక వారి గుర్రపు స్వారి అనన్య సామాన్యమట. కన్ను తెరిస్తే కనిపించే గుర్రం, కన్ను మూస్తే కనిపించదట. తమ్ముడు అన్నకు తగినవాడు. అన్న ' ఆ' అంటే చాలు, తమ్ముడు ' సై' అంటాడు. సూరారెడ్డి, వీరారెడ్డి, ఎలమరెడ్డి, దామరెడ్డి అందరూ అందరే నట. సింహపు కూనలట. అతగాడు నాలుగేళ్ళనాడు ఇరవై వొక్క సంవత్సరమన్నా రాని పాలుగారే వయస్సులో కాకతి ప్రభువులకే కమ్మ పంపగలిగిన ధీరుడు. అందులో ‘కాకతీ రాజ్యక్షేమం కోసం మేము దొంగలమై అరణ్యాల్లో మంచికి మంచి- చెడుకు చెడు. ఊళ్ళేలినా, అరణ్యాల్లో వున్నా ప్రభుభక్తి మా ఊపిరి' అని. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/Qeu9D_C-XtM
Embed this episode
NOW PLAYING
కాకతి రుద్రమ ఎపిసోడ్ 15 | Kakathi Rudrama Episode 15 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.