కాకతి రుద్రమ ఎపిసోడ్ 16 | Kakathi Rudrama Episode 16 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com episode artwork

EPISODE · Oct 13, 2022 · 19 MIN

కాకతి రుద్రమ ఎపిసోడ్ 16 | Kakathi Rudrama Episode 16 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 16 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 16 వ భాగం గత ఎపిసోడ్ లో… గన్నారెడ్డి గురించి సరైన అవగాహన కలిగి ఉంటాడు శివదేవయ్య. అదే విషయాన్ని రుద్రమ దేవికి వివరిస్తాడు. శివ సాధువు వేషంలో లకుమయారెడ్డిని, అతని అనుచరులను స్పృహ తప్పిస్తాడు గన్నారెడ్డి. లకుమయారెడ్డిని బంధించి ఆ వర్తమానాన్ని శివదేవయ్యకి చేరవేస్తాడు. ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 16 చదవండి.. ఓరుగల్లులో  ఎక్కడ చూసినా ఆనందమే. కోలాహలమే. సంరంభమమే. సంరంభ ఆనంద కోలాహలమే. విజయదశమి.......... అమ్మవారి అలంకరణలు చూచుటకు వెయ్యి కన్నులు కావలెను. పగలు- వేడుకలు, జాతర. రాత్రి అమ్మవారు ఏడు గుర్రాలు పూనిన రధముమీద ఊరేగుతున్నది. అమ్మవారితో పాటు ఊరు ఊరేగుచున్నది. ఎటు చూసినా సందడి. సైనికులు, సేనాపతులు, ప్రజలు అమ్మవారి వెంట వున్నారు. మేళతాళములు ముందు మదగజము మీద రుద్రమదేవి. ఆమెను ఆ వేషంలో చూడటం ప్రజలకు అదే మొదలు. ఎంత అందముగా నున్నది.. తమ చక్రవర్తిణీ! ఎటు విన్నా అదే మాట. ఆ వెనుక ఏనుగు మీద వున్నది 'అన్నమాంబిక' కోటారెడ్డి ప్రభువుల కొమరిత యట. ఈమె నేనట గన్నారెడ్డి తెచ్చినది. ప్రజలు ఎవరి ఆనందంలో వారున్నారు. మధ్యరాత్రఐనది- వూరంతా కాగడాల వెలుగు. లకుమయారెడ్డి మీద యివాళ ఎవరికీ భయాలూ, అనుమానాలూ లేవు. అతనూ స్వేచ్ఛగా బయటికి వచ్చాడు. కాకతమ్మ గుడి వెనక అంతా చీకటి మయము. ఆ చీకటిలో వారు నలుగురు రుద్రయ్యమంత్రి, లకుమయారెడ్డి, హరిహ,ర మురారిదేవులు. వారి సంభాషణలు యిది: "మీరు యుద్ద ప్రయత్నాలుచేసి, కాకతీయ సామ్రాజ్యమును త్వరగా ఆక్రమించవలెను” అని లకుమయారెడ్డి అన్నాడు. "మేమునూ ఆ ప్రయత్నములోనే వున్నాము" "యాదవరాజులు, మహాదేవరాజు ప్రభువులు ఏమంటున్నారు" తమ తండ్రిగారు కృష్ణభూపతులు ఆఖరి దశలో వున్నారు. వారు హరీ అనటమూ, వీరు వురికి రావటము" "సైన్యములు సిద్దమా?" "ఆ.... ఆ ప్రయత్నము లన్నీయూ ఎన్నడో జరిగినవి". "ముందు రుద్రమదేవిని, ఆ తరువాత గణపతిదేవ చక్రవర్తినీ హతమార్చవలెను. " "తప్పక" "మరి యాదవ రాజులకు ఏమివ్వవలెను". "గెలిచిన తరువాత పదికోట్ల బంగారునాణెములు ". "అది ధర్మమే" అన్నాడు లకుమయారెడ్డి. "మనసేనలకు ఏల అంతరాయము కలిగినది. ?"  అన్నాడు మురారిదేవుడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/0uLohMsVlgM

Episode metadata supplied by the publisher feed · Published Oct 13, 2022

Embed this episode

Ready to play

కాకతి రుద్రమ ఎపిసోడ్ 16 | Kakathi Rudrama Episode 16 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

0:00 19:19

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 19 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on October 13, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!