కాకతి రుద్రమ ఎపిసోడ్ 17 | Kakathi Rudrama Episode 17 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com episode artwork

EPISODE · Oct 21, 2022 · 10 MIN

కాకతి రుద్రమ ఎపిసోడ్ 17 | Kakathi Rudrama Episode 17 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 17 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 16 వ భాగం గత ఎపిసోడ్ లో… గణపతి దేవుడు రుద్రమ దేవిని పిలిచి, రాజ్యాధికారం రుద్రమ దేవి భర్తకు ఉండదని, అది కాకతీయ వంశజులకే చెందాలని ప్రమాణం చేయించుకుంటాడు. అన్నమాంబిక తను కూడా కదన రంగానికి వస్తానని కోరుతుంది. బాప్పదేవుడు యుద్ధంలో నాగయ్య నాయకుని సంహరిస్తాడు. ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 17 చదవండి.. తొలి విజయం రుద్రమదేవిని ఆనందపరిచింది. ఆమె పేరుప్రఖ్యాతులు మండలాల వరకూ వ్యాపించినాయి. కాకతీ రాజ్యానికి కలలు కంటున్న వాళ్ళ కళ్ళంటుకున్నవి.... అదీగాక గోనగన్నారెడ్డి కాకతీ రాజ్యపాలనను సుగమం చేసి - చక్రవర్తిణికి నీడలాగా వుంటూ చాలా చిత్రంగా ఎదురు తిరుగుచున్న సామంత రాజులని అణచివేయటం- అభాసుపాలు చేయడం చేస్తున్నాడు. బలమైన లకుమయారెడ్డి, కాచమనాయకుడు లాంటివారే అతని చేతిల శృంగ భంగం చెందితే తామెంత? అని రెక్కలు విప్పిన సామంతులు కొందరు మళ్ళీ రెక్కలు ముడుచుకుని గూళ్ళలో దూరాల్సొచ్చింది. యిది యిట్లా వుండగా- రుద్రమదేవి తన అపార బలగంతో, సమధికోత్సాహ సైన్యంతో, సామంత రాజ్యాల మీదుగా, పక్కన అన్నమాంబికను కూర్చుండబెట్టుకుని ప్రయాణాలు చేయసాగింది. ఆమె ఎటు వెళ్ళినా గౌరవపురస్కారమైన అభినందనలే- విజయధ్వానాలే. కోట పేర్మినాయుడు  సిగ్గుతో తల చిదికిన పామువలె నిలబడి "కాకతీచక్రవర్తిణీ! నన్ను క్షమించవలెనని ప్రార్థన" అని వేడుకున్నాడు. కాటమనాయకుడు మాటరాక- ఆమె పాదాలదగ్గర నిలబడి పోయినాడు- ఆమె ఏమీ అనలేదు. చిరునవ్వు నవ్వింది. క్షమా హృదయము కాకతీయులకు తొలినుంచీ వున్నది. ఆమె ఎంతటి చక్రవర్తిణి అయినా, స్త్రీ గనుక హృదయలాలిత్యము వుండటం చేత క్షమించగలిగింది. పొనుగంటి సామంతప్రభువు జన్నిగదేవుడూ, ఆయన కుమారుడు, త్రిపురాంతక ప్రభువు రుద్రమహారాజు ఆమెకు దోవ పొడుగునా అఖండ స్వాగతాలు ఇచ్చారు. స్త్రీలు మంగళహారతులు ఇచ్చారు. నృత్య -గాన వినోద విభావరి ఆది. అంతులేని సంతోషహేల. ప్రజలకు తమ చక్రవర్తిణిని చూసిన సంరంభము. ఆమె శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించింది. సింహపురి రంగనాయకస్వామిని కొలిచింది. కంచి కామాక్షిని ప్రార్దించింది. ప్రతిరోజూ ఆమె ఎక్కడుంటే అక్కడ తిరునాళ్ళే. అంతులేని - అదుపు చేయలేని జన సందోహమే. ఆమె కర్నూలు లో కాలిడినది. ఆదవోనిలో ఒకపూట ఆగినది. కోటారెడ్డి  ప్రభువుతో మాట్లాడినది. అన్నమాంబిక భయము మీకు వలదని అభయ మిచ్చింది. బుద్ధపురం ప్రభువులను పరామర్శించినది. వర్ధమానపురంలోని రాజకీయ జీవితమును ప్రత్యక్షముగా వీక్షించినది. ఆమె స్నేహ సౌశీల్యత, మృధుస్వభావము, మధుర భాషణా అందరినీ చకితులుగా చేసింది. అన్నమాంబిక మాత్రం ఆదవోని ప్రభువుల, ప్రజల కంట పడలేదు. తరువాత పదిదినములకు కాకతీనగరము చేరినది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/PS6vcOEQ5n0

Episode metadata supplied by the publisher feed · Published Oct 21, 2022

Embed this episode

Ready to play

కాకతి రుద్రమ ఎపిసోడ్ 17 | Kakathi Rudrama Episode 17 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

0:00 10:59

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on October 21, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!