కాకతి రుద్రమ ఎపిసోడ్ 18 | Kakathi Rudrama Episode 18 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com episode artwork

EPISODE · Oct 28, 2022 · 16 MIN

కాకతి రుద్రమ ఎపిసోడ్ 18 | Kakathi Rudrama Episode 18 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 18 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 18 వ భాగం గత ఎపిసోడ్ లో… రుద్రమదేవి, అన్నమాంబికతో కలిసి  తన జైత్రయాత్రను ముగించి, కాకతి నగరానికి తిరిగి వస్తుంది. చోళజాతి ప్రభువు తిరుగుబాటు ప్రకటించి, సామంతులు తనకే కప్పం కట్టాలని ప్రకటిస్తాడు. ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 18 చదవండి.. రుద్రమదేవి అన్యమనస్కంగా వుంటున్నది. ఆమె మనస్సు చిక్కుబడిన దారమువలె గజిబిజిగా నున్నది. శివదేవయ్యామాత్యులు గ్రహించలేని అజ్ఞానులు కాదు. కాలుతున్న పెనం వలెనున్న కాకతీనగర పరిస్థితి కళ్యాణములకు అనువైన సమయమా? కాదా? అన్నది మాత్రమే చర్చించవలెను. కానీ యిక రుద్రమదేవి వివాహమునకు ఆలస్యము చేయరాదు. ఆమె మనస్సును యింకనూ క్షోభ పెట్టరాదు. ఆమెయూ తనబిడ్డ వంటిది కాదా! శివదేవయ్యామాత్యులు వున్నపడంగా తమ రాజ్యమునకు రావడము, చాళుక్య వీరభద్ర ప్రభువులు ఆశ్చర్యముతో తేరుకుని- " స్వాగతము, మహామాత్యులకు- ఆశ్చర్యముగా నున్నది". శివదేవయ్య నవ్వి- "తాము పిలవక పోయిననూ మేమే వచ్చితిమి" అని ఆయన ఉచితాసనం మీద కూర్చున్నారు. కూర్చుని- "మీతో చాలా ముఖ్యమైన విషయము మాట్లాడాలని వచ్చాము". " చిత్తము". "వీరభద్రప్రభూ! రాజ్యము కత్తుల వంతెనవలె వున్నది. ఎవరు ముఖ్యులో, ఎవరు శత్రువులో అంతు చిక్కదు. సామంతులు కుక్కగొడుగులవలె తలఎత్తుతున్నారు. అటు కాకతీచక్రవర్తులు అంతిమ ఘడియల అంచున వున్నారు. ఆయన శివ సాయుజ్యము ఏ క్షణములోనైనా  చెందవచ్చును. తమ కుమార్తె వివాహము చూడవలెనన్న కోరిక మిక్కుటముగా నుండెను. రుద్రమదేవి నా బిడ్డవంటిది. వంటిదే కాదు. ఆమె నా కుమార్తెయే. -ఆమె సుఖమును నేను సర్వదా ఆకాంక్షించు చున్నాను. అదీగాక గణపాంబదేవి భర్త బేతరాజు ప్రభువులు సహృదయులు. వారు చిన్న సామంతరాజులే కావచ్చుగాక. గుణమునగానీ, ఠీవిలోగానీ బంగారు తునక. మీరు రుద్రమదేవిని చక్రవర్తిణిగా చూడనక్కరలేదు. ఆమెను కర్కశత్వము నుంచి లలిత మృదు స్వభావినిగా, పురుషునినుంచి స్త్రీగా మార్చినది మీరు. మిమ్ములను మా  రుద్రమదేవి చక్రవర్తిణిని మీ జీవిత భాగస్వామినిగా చేయవలెనని నా అభీష్టము. అది ఆమె మనస్సులోని కోరిక. అదీగాక, ఈ వివాహ బాంధవ్యముతో ఈ రెండు రాజ్యములూ ఒకటి కావలెనని - ఇది చాళుక్య లక్ష్మికి నుదుట దిద్దిన కళ్యాణరేఖ కావలెనని మా అభీష్టము." " ఔను." "మీ యిష్టమే , మా యిష్టము, మీరు శాసించవలెను. మేము పాటించవలెను." " మీ సహృదయతకు నా కృతజ్ఞతలు." వీరభద్రప్రభువు నవ్వినాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/1XKsQb3kTYg

Episode metadata supplied by the publisher feed · Published Oct 28, 2022

Embed this episode

NOW PLAYING

కాకతి రుద్రమ ఎపిసోడ్ 18 | Kakathi Rudrama Episode 18 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

0:00 16:38

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 16 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on October 28, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!