EPISODE · Nov 4, 2022 · 13 MIN
కాకతి రుద్రమ ఎపిసోడ్ 19 | Kakathi Rudrama Episode 19 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
కాకతి రుద్రమ ఎపిసోడ్ 19 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 19 వ భాగం గత ఎపిసోడ్ లో… శివదేవయ్యామాత్యులు, చాళుక్య వీరభద్ర ప్రభువును కలుస్తాడు. రుద్రమదేవితో అతని వివాహానికి గణపతి దేవులు విధించిన షరతులు వివరిస్తాడు. అన్నిటికీ అంగీకరిస్తాడు చాళుక్య వీరభద్రుడు. గణపతిరుద్రదేవ చక్రవర్తులు శివ సాయుజ్యం పొందుతారు. రాజ్యంలో తిరుగుబాట్లు జరగకుండా తగిన ఏర్పాట్లు చేస్తారు రుద్రమదేవి , శివదేవయ్య. ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 19 చదవండి.. ----------------------------------------------------------------------- " రామప్ప ఆలయం- మన వారసత్వ వైభవము" -------------------------------------------- భారతావనిలో ఆలయాలు నిర్మించని రాజులు లేరంటే అతిశయోక్తి కాదు. చిన్నా, చితకా రాజులే ఆలయాలు నిర్మిస్తుంటే కాకతీయుల్లాంటి చక్రవర్తులు ఊరుకుంటారా! అసలు ఆలయ నిర్మాణశైలిని ప్రపంచానికిచ్చారు. కాకతీయుల శిల్పకళాచాతుర్యానికి పరాకాష్ట అని చెప్పదగ్గ నిర్మాణం 'రామప్ప ఆలయం'. ఇక్కడున్న ప్రతిశిల్పం ఓ సజీవమూర్తిగానే తోస్తుంది చూపరులకి అందుకే.... ఎనిమిది వందల ఏళ్ళక్రిందట ఈ ఆలయాన్ని చూసిన ప్రఖ్యాత యాత్రికుడు మార్కొపోలో 'ఆలయాలనే నక్షత్రరాశిలో ..............ఇదో వేగు. చుక్క!' అని రాశాడు. అంతగా ఏముంది ఇందులో అంటే.................. మిగతా గుడుల్లాగా రామప్ప ఆలయం కేవలం భక్తి కోసం నిర్మంచింది కాదు.....దీని నిర్మాణం వెనక గొప్ప కళానురక్తి ఉంది. ఓ రకంగా చెప్పాలంటే నాట్యరీతుల్ని భావితరాలకోసం నిక్షిప్తం చేయాలనే తలంపుతో, ఆలోచనలతో కట్టిన ఆలయం ఇది.కాకతీయ గజసేనాధిపతి జాయప రాసిన ' నృత్తరత్నావళి' అనే గ్రంథానికి ఈ ఆలయం ఓ శిల్పరూపం. ఇప్పుడైతే ఎవరైనా ఏదైనా పుస్తకం ఇస్తే దాన్ని ఆడియో రూపంలోనో, డిజిటల్ రూపంలోనో పదిలం చేస్తున్నారు.ఆ కాలంలో అవన్నీ లేవు కదా! అందుకే .....ఆ పుస్తకం కోసం ఇలా ఓ ఆలయాన్ని నిర్మించి శాశ్వతం చేశారు. అందుకే ఈ గుడిని ' నృత్తరత్నావళి' అన్న గ్రంథానికి ' లక్షిత'( Refrence) ఆలయం అంటున్నారు పరిశోదకులు.మనదేశంలో ఇలాంటి ఆలయం ఇంకొకటి కనిపించదు.అందుకే ఈ ఆలయం అడుగడుగునా నాట్యభంగిమలే కనిపిస్తాయి. ముఖ్యంగా ఇక్కడి శివతాండవ శిల్పాలను చూడడానికి రెండు కళ్ళూ చాలవు.24 గంటలూ సరిపోవు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/IDsMEQkeoXI
Embed this episode
Ready to play
కాకతి రుద్రమ ఎపిసోడ్ 19 | Kakathi Rudrama Episode 19 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.