EPISODE · Nov 11, 2022 · 11 MIN
కాకతి రుద్రమ ఎపిసోడ్ 20 | Kakathi Rudrama Episode 20 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 20 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 20 వ భాగం గత ఎపిసోడ్ లో రామప్ప దేవాలయ శిల్పకళా వైభవం గురించి, అక్కడ చెక్కబడ్డ వివిధ నాట్య భంగిమల గురించి చక్కగా వివరించారు రచయిత. కాకతీయులకు అండగా ఉన్న గన్నారెడ్డికి వర్ధమాన పురాన్ని అప్పగించబోతున్నట్లు సభాముఖంగా ప్రకటిస్తాడు శివదేవయ్య. యుద్ధానికి సన్నద్ధులుగా ఉండమని అందరినీ కోరుతాడు. ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 20 చదవండి.. కాకతీయ దేవాలయ శిల్పము, చాళుక్యశిల్పమున కొన్నిమార్పులు కల్పించింది. ఆంధ్ర శాతవాహనుల కాలంలో గుహవాస్తు, స్తూపవాస్తులతో పాటు, దేవాలయ వాస్తు కూడా వర్ధిల్లినది. ఆంధ్రులు, బౌద్దులు కాకమునుపు శైవమతావలంబకులు. ఆంధ్రలు నెలకొల్పిన దేవాలయ శిల్పము అద్భుతమయినది. వారు గోడలు కట్టుటకు రాళ్ళు వుపయోగించలేదు. వివిధ మృత్తికలను కలిపి, ఇటుకలు చేసి వానితో నాలుగైదు అంతస్థుల భవనములు నిర్మించేవారు. అటుల ఇటుకలతోనే వారు దేవాలయాలు నిర్మించుకునేవారు. బౌద్దయుగంలోనూ ఆంధ్రులు స్థూపాలు ఇటుకలతోనే నిర్మించిరి. విగ్రహాలకు, ద్వారాలకు, ఆలయస్థంభాలకు శిలలను ఉపయోగించెడివారు. కొండలు తొలిచి చైత్యాలుగా, విహారాలుగా, గుహలూ నిర్మించారు. ఇక్ష్వాకుల కాలంలో రాతితో ప్రథమచైత్య గృహ నిర్మాణము జరిగెను. పల్లవుల కాలములో ఒకేరాతితో చెక్కిన దేవాలయాలు నిర్మాణములు చేసినారు. ఆంధ్రశిల్పులు చాళుక్యులకాలం నాటికిగూడా పూర్వరీతినే దేవాలయాలు ఇటుకలతో, సున్నముతో కట్టుచూ, మండపాలు, స్థంభాలు, విగ్రహాలు రాళ్ళతో నిర్మింపసాగిరి. రానురాను చాళుక్యుల కాలము వరకూ ఆంధ్రశిల్పులు ప్రతిభతో గర్భాలయము, వివాహ మండపాలు శిలలో నిర్మించి, శిఖరాలు మాత్రము ఇటుకలతో నిర్మించిరి. కాకతీయ చక్రవర్తులకాలంలో స్తంభశిల్పము, ద్వారశిల్పము ఇంకనూ అపూర్వ కౌశలముతో ముందుకు సాగెను. దేవాలయ శిఖరము గూడ చాళుక్యకాలపు రూపము నుండి మార్పుపొందెను. చాళుక్య శైవము లో సాధుశైవము- కాకతీయ శైవము వీరశైవము. వీరశైవ శిల్పములో వీరభద్ర నందికేశ్వర లింగమూర్తుల వికాసముచే నిండిపోయినది. వట్టి లింగమూర్తి పూజతో తృప్తిపడిన చాళుక్యశిల్పి శైవలీలా వినోది అయినాడు. రాష్ట్రకూట వంశాదరణలో కాకతీయ రసపూర్ణ జీవిత ప్రాబల్యాన, ఆంధ్రశిల్పి- నృత్య విన్యాసకుడు, దివ్యసౌందర్య లీలావిలాసుడు, అలంకార పూరితాత్ముడు ఆయెను. మొగలిచర్ల కాకతమ్మ గుడి శ్రీకాకతీయ ప్రోలమహారాజు ప్రథమ తనయుడయిన శ్రీరుద్ర చక్రవర్తి కట్టించెను. ప్రసిద్దాంధ్ర శిల్పి ఎఱ్ఱయ ఒజ్జ నిర్మించినది. ఆచార్య ఎఱ్ఱయ ఒజ్జ ప్రసిద్ర ఆంధ్రశిల్పి. అతని శిల్ప కౌశలము అనుమకొండ రుద్రేశ్వరాలయంలో ఆకాశమును చుంబించు చున్నట్లనిపించును. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/5PWXsRPnykQ
Embed this episode
Ready to play
కాకతి రుద్రమ ఎపిసోడ్ 20 | Kakathi Rudrama Episode 20 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.