EPISODE · Nov 18, 2022 · 16 MIN
కాకతి రుద్రమ ఎపిసోడ్ 21 | Kakathi Rudrama Episode 21 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 21 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 21 వ భాగం గత ఎపిసోడ్ లో ఏరవీరాదేవి పూజ ముగించుకొని తన సహచరులతో తిరిగి వస్తోంది రుద్రమ దేవి. రేచెర్ల రుద్రారెడ్డి, అనుచరులతో రక్షణగా ఆమె వెంట ఉన్నాడు. హఠాత్తుగా హరిహర మురారి దేవులు వారిని సైన్య సమేతంగా చుట్టుముడతారు. రుద్రమ దేవిని అప్పగించి పారిపొమ్మని రుద్రారెడ్డికి చెబుతారు. ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 21 చదవండి.. వీరభద్రప్రభువు గుర్రము, నోటివెంట నురుగులు కక్కుచున్నది. అయినా వేగం తగ్గించ లేదు. అలసట లేదు. మార్గము రాను రాను - ఆ గుర్రము కాళ్ళ వెనుకకు జారిపోయి, దగ్గరవుచున్నది. వడ్డిపల్లె నుంచి మొగలిచెర్ల కూతవేటు దూరం. గుర్రమును ఇంక బాధ పెట్టదలచు కోలేదు. వడ్డిపల్లెలో పది గంటలయినది. సూర్యుడు అప్పటికే చురచుర లాడు చున్నాడు. గ్రామాధిపతి వీరభద్ర ప్రభువును చూసి, ప్రజలతో వచ్చి నమస్కరించి విధేయతతో నిలబడియున్నాడు. వీరభద్రప్రభువు కళ్ళు ఎర్ర గన్నేరులవలె వున్నవి. కంటికి కునుకెరుగడు. ఆత్మల పొరలలో, రుద్రమదేవికి ప్రమాదము జరగగలదని స్పందన మొదలైంది. కాలకృత్యములు తీర్చుకుని, స్నానమాచరించి, కాకతీదేవిని నిష్టగా అయిదు నిమిషములు ప్రార్థించినాడు. ప్రభువు ఆజ్ఞచేత గ్రామాధిపతి సుశిక్షితులైన వీరులనూ, ముఖ్యంగా విలువిద్యా ప్రవీణులను వెంటబెట్టుకుని బయలుదేరెను. ఆనాటి ఆంధ్రవీరులు విలువిద్యలో శబ్దమును విని, చోటును గురిచూసి ఒక్కబాణముతో కొట్టగల ధీమంతులు. ఈ విద్యను శబ్ధభేది అంటారు. ఇంతలో రథములోపల రుద్రమాంబిక కనుసైగను చూసి, అన్నమాంబిక విల్లును సిద్దము చేసి వుంచింది. రేచర్ల రుద్రసేనాని, ఎట్లా దెబ్బతీయాలా యని మధన పడుతున్నాడు. సైన్యం ఏమి చేసైనా- ఆఖరుకు ప్రాణాలు ధారపోసి అయినా తమ చక్రవర్తికి ఏ ప్రమాదమూ జరక్కుండా చూడాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వీరభద్రప్రభువు సైన్యంతో మొగలిచెర్ల చేరేసరికి, సాయంత్రం సూర్యుడు క్షీణిస్తున్నాడు. అప్పటికే రుద్రమదేవి ఓరుగల్లు వైపునకు బయలుదేరిందని తెలియవచ్చింది. ప్రభువు - ఒక్కక్షణం ఆగి ఏకవీరాదేవికి నిష్టగా ప్రణామం చేసి, మళ్ళీ గాలివేగంతో ఓరుగల్లు వైపునకు బయలు దేరినాడు. గుర్రాలు వేగం అందుకున్నవి. వీరభద్ర ప్రభువునకు చిన్నసైన్యం వెడుతున్నట్టు కనిపించింది. గుర్రాల గిట్టల చప్పుడువిని రుద్రమదేవి అన్నమాంబిక చెవిలో- ‘మన సైన్యం వస్తున్నది’ అన్నది . అన్నమాంబిక చిరునవ్వు నవ్వింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/62z9pklak60
Embed this episode
Ready to play
కాకతి రుద్రమ ఎపిసోడ్ 21 | Kakathi Rudrama Episode 21 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.