కాకతి రుద్రమ ఎపిసోడ్ 22 | Kakathi Rudrama Episode 22 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com episode artwork

EPISODE · Nov 25, 2022 · 17 MIN

కాకతి రుద్రమ ఎపిసోడ్ 22 | Kakathi Rudrama Episode 22 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 22 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 22 వ భాగం గత ఎపిసోడ్ లో అన్నమాంబిక ధనస్సు నందుకుని, మురారి దేవుని శిరస్సు ఖండించబోయినది. హరిహర దేవుడు, అన్నమాంబిక ధనస్సును ఖండించాడు. అక్కడికి చేరుకున్న వీరభద్రుడు దూరంనుండే ఒక బాణంతో హరిహరదేవుని శిరస్సు ఖండించాడు. రుద్రమ దేవి, తన బాణంతో మురారి దేవుని సంహరించింది. ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 22 చదవండి.. మంజీర నదిని దాటడం బ్రహ్మప్రళయమే అయినది. మంజీర నదిని దాటి, కాకతీయుల నెగ్గినంత సంబరపడినారు. మహాదేవరాజునకు వచ్చేది వానాకాలమని తెలియును. అందుకు తగిన సన్నాహా లతో యుద్దయాత్ర ప్రారంభించినాడు. కోట్లకొలది చాపలను, వెదురు ఊచలను కూడా పట్టించుకొని వచ్చినాడు. దానితో లక్షలకొలది నివేశాలు నిర్మించడం, వానలు వెలిసిన వెనుక ముందుకు సాగడం, ఈ రీతిగా అంచెలుగా యుద్దయాత్ర సాగుచున్నది. గోనగన్నారెడ్డి బలాలు, చౌండుని బలాలు యాదవుని సేనావాహిని ముప్పుతిప్పలు పెడుతూ నాశనం చేయసాగినవి. ఎప్పుడు ఓరుగల్లు జేరుదామా, ఎప్పుడు మహానగరం చుట్టూవున్న పాళెములన్నీ ఆక్రమించుకొని, తాను నిశ్చయించుకున్న వ్యూహం ప్రకారం ముట్టడి సాగించడమా అని తహతహ జనించినది మహాదేవరాజునకు! నెల ముట్టడి సాగేసరికి ఆంధ్రులు కాళ్ళ బేరానికి వస్తారు. ఆడదాని రాజ్యం అంటే అసహ్యము కొలది తనతో కలిసి పోదురు. ఈ లాంటి ఆశతో ఏ మాత్రమూ పట్టుదల సడలకుండా మహాదేవరాజు ప్రయాణం చేస్తున్నాడు మహావాహినితో. గన్నారెడ్డి యుద్దతంత్రాలు అర్థం చేసుకుని మహాదేవరాజు, కొన్ని ఎత్తుగడలు, రక్షణలు సృష్టించాడు. రాళ్ళచక్రాలున్న కొండల్లాంటి బళ్ళు కట్టించాడు. ఆ బళ్ళపైన చిన్న చిన్న కర్రకోటలు, ఎనమండుగురు, పదిమంది పట్టేవి కట్టించాడు. ఆ రథాలను ఎనిమిది జతల ఎద్దులు లాగుతుంటాయి. బండిమీద చిన్న కర్రకోట గోడలతో ఉన్న వీరులు బాణాలు వేయడానికి పెద్దరంద్రాలు చేయించాడు. వీరిని సేనల చూట్టూ మహాదేవరాజు ఉంచినాడు. విరోధి కనబడగనే శత్రువును చూచి కోటలబండ్లు ఆపుచేయించి వారిని కోటగోడలా చేశాడు. ఈ ఏర్పాటు గన్నారెడ్డి బాగా అర్థం చేసుకున్నాడు. యుద్దచమత్కృతి అంతా ఎత్తుకు పై ఎత్తు వేయుటలోనే ఉంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/oqMkMNkaB8c

Episode metadata supplied by the publisher feed · Published Nov 25, 2022

Embed this episode

Ready to play

కాకతి రుద్రమ ఎపిసోడ్ 22 | Kakathi Rudrama Episode 22 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

0:00 17:44

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 17 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 25, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!