EPISODE · Dec 2, 2022 · 14 MIN
కాకతి రుద్రమ ఎపిసోడ్ 23 | Kakathi Rudrama Episode 23 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 23 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ 23 వ భాగం గత ఎపిసోడ్ లో మహాదేవుడి సైన్యాన్ని గన్నారెడ్డి దారిలోనే అటకాయించి, బాగా చికాకు పెడతాడు. అయినా అతడి సైన్యం ఓరుగల్లును చుట్టుముడుతుంది. దాడిని ఎదుర్కోవడానికి రుద్రమదేవి సైన్యం సన్నద్ధమౌతుంది. కోట పరిరక్షణ వ్యూహాలను రుద్రమ స్వయంగా పర్యవేక్షిస్తుంది. ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 23 చదవండి. . రుద్రదేవి తన సేనాపతులనందరినీ, ఆ రాత్రి తన ఆలోచనా మందిరానికి పిలిచింది. "మీరు తెలుగువీరులు. పగరకు వెన్నిచ్చి పారిపోయే వారుకాదు. నేటి మేటి శూరులు. విరోధిని పూర్తిగా ఓడించడానికి నెలదినాలకన్నా ఎక్కువకాలం పనికిరాదు. పదిరోజుల లోపు మనం విజయం పొందగలం అని నేననుకోను. "మన యుద్దవిధానం మనకోటను రక్షించుకోటం కాదు. అని మీరు నిస్సందేహంగా నమ్మండి. శత్రువును సర్వనాశనం చేసి ఓడించడమే మన కర్తవ్యము. అది ఒక్కటే మన ధర్మము. మన కోటబలం అందుకే ఉపయోగపడాలి. "ఒక్క నిమిషము కూడా శత్రువునకు విశ్రాంతి తీసుకునే అవకాశం ఈయకూడదు. గవనులు వెడలి వారిపై బడి నాశనం చేస్తూ ఉండడము, వారి ఒత్తిడి ఎక్కువైతే కోటలోకి వచ్చేయడము! అన్ని గవనుల నుండీ ఒక్కసారి ముందుకు దుమికి వెనక్కురావడం, ముందుకుపోతే జాగ్రత్తతో పోవాలి! "ఈ నాటికి మూడవ దినం శత్రువులను కంపకోటకడకు రానిచ్చి, పోరు మంచిపట్టు ఉన్నసమయంలో కంపకోట అంటించాలి. అంటించేముందు తక్కిన సైన్యం మట్టికోటలోనికి వచ్చివేయాలి! అగ్నిహస్తులు మాత్రం అగ్ని ముట్టించి లోపలికి వచ్చేయండి. శత్రువు రక్షణకోసం వెనక్కు తగ్గగనే, అగ్ని ఆరిపోయే సమయం లో అన్ని సింహద్వారాల నుంచి, దిడ్లనుంచీ లక్షమంది పైకురికి శత్రువును చీకాకు పరచండి. శత్రువు బలం ఎక్కువ అయ్యే విషయం మేము కోటగోడలమీదనుంచీ చూచి మహాకాహళాలు ఊదిస్తాము. కాహళాల ధ్వని విని నెమ్మదిగా వెనక్కు అడుగువేయండి... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Embed this episode
Ready to play
కాకతి రుద్రమ ఎపిసోడ్ 23 | Kakathi Rudrama Episode 23 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.