EPISODE · Dec 17, 2022 · 14 MIN
కాకతి రుద్రమ ఎపిసోడ్ 25 | Kakathi Rudrama Episode 25 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 25 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో మహాదేవరాజు పరాజయం చెందబోతున్నట్లు శివదేవయ్య కి చెబుతుంది రుద్రమదేవి. మహాదేవరాజు దేవగిరి పారిపోవాలని తలుస్తాడు. గన్నారెడ్డి అతడిని నిలువరించే ప్రయత్నం చేస్తాడు. ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 25 చదవండి.. ఎల్లోరా గ్రామము ప్రక్క తన సైన్యాలను నిలిపి మహాదేవరాజు ఈ గజదొంగను హతమార్చే సమయం ఇదేనని తన ఏబదివేల ఆశ్వికబలమును, మిగిలిన వెయ్యి ఏనుగులను గరుడవ్యూహం రచించి గన్నారెడ్డి పై దాడి చేసినాడు. అక్కడ గన్నారెడ్డి బలగంలో ఒక్కడు కూడా లేడు. గన్నారెడ్డి ఆ కొండదారిలో ఇంకను వెనుకకు పోయి ఉన్నాడు. మహాదేవుడు ఆ వ్యూహం చెదిరిపోకుండా ముందుకు రాలేడు. ఇంతలో రాత్రి అయినది. మహాదేవుడు తన సేనల నన్నింటినీ ఆపి, చారుల వార్తల కొరకు నిరీక్షించు చుండగ, అతని వేగులనాయకుడు వచ్చి మహాప్రభూ! రుద్రమ్మ తన సేనలతో కోట ముట్టడి చేసి సగం బలగాలను మనవేపు గన్నారెడ్డికి సహాయంగా పంపుతున్నది" అని వార్త తెచ్చినాడు. మహాదేవరాజు నిరుత్తరుడైనాడు. తన సేనల నాశనం తప్పదనుకున్నాడు. తాను కోటలోనికి వెళ్ళుటకు వీలు లేదు. కోటలో వారు తనకు సహాయం చేయడానికి వీలులేదు. భోజనసామగ్రి అయిపోయినది. లక్షలకొలది క్షతగాత్రులైన బలగాలతో ఈ రాక్షసి కాకతి మూకలతో పోరాడుట ఎట్లు? కవులమాటలన్నీ తెగడ్తలే. తనకు భయపడి ఓరుగల్లు సింహాసనంపై ఆడుదాన్నిఎక్కించారుట. ఆడదాన్ని తానేమి చేయలేనని, చేయనని వారికి ధైర్యమట! అలాంటి వాడు తాను మహావీరున్నని వెళ్ళినాడే. అబ్బ రాజ్యతృష్ణ! రుద్రమ్మ ఆడదా? బ్రహ్మరాక్షసి! మహామారి! కాళరాత్రి! చీల్చిచెండాడి వెంట తరుముకు వచ్చిన కాకతిదేవతే రుద్రమ్మ! ఏమి యుద్దం! ఏమి పరాక్రమం! ఎంత నిర్వహణశక్తి! ఎంత వ్యూహరచనా చమత్కృతి! తన బలగాలు నాశనం కాకూడదు. చాలు: ఇక తనకు బుద్ది వచ్చింది. కందిరీగలతుట్ట. కాకతీయులకు కోపం తెప్పించకు తండ్రీ! అని తండ్రి చెబుతే తాను విన్నాడా! వినక, తెచ్చుకున్నదీ విపరీతమయిన పరాభవం. తాను రుద్రమ్మకు ఎదురుపడక తన సైన్యాలతో ఏ కొండలకో వెళ్ళిపోతే తనంటే ప్రజలకు గౌరవమూ, భక్తి పూర్తిగా నశించిపోవును. మరిరెండు మూడు దినాల ప్రయత్నించుదమనుకుంటే, ఇంకా కొన్నివేలమంది నాశనమగుదురు. మహాదేవునకు మతి పోవుచున్నది. గౌరవం పోయినది. నలుగురిలో తల ఎత్తుకొనలేడు. అందుకు తగినట్లు తాను రుద్రమదేవికి లొంగిపోతే తనను ఏ విధముగా గౌరవించును? ఏ విధముగా చూచును? ఆమె తనను ఎలాంటి అగౌరవాలకు లోను చేస్తుందో? Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Mmp6ScyfJNA
Embed this episode
NOW PLAYING
కాకతి రుద్రమ ఎపిసోడ్ 25 | Kakathi Rudrama Episode 25 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.