EPISODE · Dec 25, 2022 · 16 MIN
కాకతి రుద్రమ ఎపిసోడ్ 26 | Kakathi Rudrama Episode 26 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 26 'Kakathi Rudrama Episode 26' New Telugu Web Series Written By Ayyala Somayajula Subrahmanyam రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో మహాదేవుడు ఓటమిని అంగీకరించి, రుద్రమదేవిని శరణు కోరుతాడు. రుద్రమ దేవి నిండు సభలో గన్నారెడ్డిని అభినందిస్తుంది. రాజద్రోహం చేసిన లకుమయా రెడ్డి, జన్నిగ దేవులు క్షమాబిక్ష పొంది రాజ్యం వదిలి వెళ్ళిపోతారు. ఇక కాకతి రుద్రమ ఎపిసోడ్ 26(చివరి ఎపిసోడ్) చదవండి.. రుద్రమదేవి అలసటతో అంతఃపురము లోకి చేరింది. ఆమె తల్పమున శయనించినది. ఆమెకు గతము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. మహాదేవరాజు ఓటమి --- తన విజయము. గన్నారెడ్డి చాణుక్య రణము- వీరభద్రుల వీరపరాక్రమములు. ఆనాడు తాను ఒక్కతే, అన్ని లక్షలమంది సమూహమున సింహాసన మధిష్టించినది. ఆమెకు తరతరాల నుండి కాకతీయవంశ ప్రాభవాలు దీవింపజేసిన, ముత్తా తల - తండ్రిగారల నిలువెత్తు పఠములు చేతులెత్తి దీవిస్తున్నట్టు, ఆమె చెవిలో విజయధ్వానాలు వినిపించుచుండెను. ఆమెకు దుఃఖం వచ్చుచుండెను. ఐననూ అదిమి పెట్టుకుంది. వీరభద్రప్రభువు చిరునవ్వుతో, గంభీరంగా మెరిసెడి కళ్ళతో తనవైపునకే చూచుచుండెను. ఆమె లేచి నిలబడి- "ప్రభూ! మీరునూ, నా ప్రక్కన సింహాసనంపై కూర్చొనుడు. నేను ఒంటరిగా ఇంతపెద్ద సామ్రజ్యపు బాధ్యత తీసుకోలేను" అని అందామనిపించింది. చక్రవర్తిణి ఐనా ఆమె స్త్రీ కదా! బేలతనం స్త్రీల హక్కు కదా! ఆమె అలంకరించుకుంది. దాసదాసీలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. శివదేవయ్యామాత్యులు, వీరభద్రప్రభువు లతో మంతనాలు చేస్తున్నారు. భవిష్యత్తు విషయంలో సుధీర్ఘ చర్చలు సాగుతున్నవి. సూర్యకాంతి చల్లగా వుంది. శ్రావణమాసపు మబ్బులు ఆకసమున చెమ్మచెక్కలాడుచున్నవి. వీరభద్రుల పినతండ్రి కుమారులు, మహాదేవరాజు కూడా చర్చలలో పాల్గొన్నారు. ( యాదవ మహాదేవులు, చాళుక్యమహాదేవులు వేరు వేరు) రుద్రమ పరిచారికలను పిలిచింది. "చక్రవర్తిణీ.. ఆజ్ఞ" "ముమ్ముడాంబికాదేవి ని తొందరగా అలంకరించి తీసుకుని రావలెను". ఈ చర్య ముమ్ముడమ్మకుగానీ, ఆమె తల్లిదండ్రులకు గానీ ఏమీ అర్దము కాలేదు. ఆమెను క్షణాలలో అలంకరించి తీసుకొని వచ్చినారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ywEJFzW0_Dc
Embed this episode
Ready to play
కాకతి రుద్రమ ఎపిసోడ్ 26 | Kakathi Rudrama Episode 26 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.