EPISODE · Mar 2, 2023 · 10 MIN
కాలం తో పాటు | Kalamtho Patu | Telugu Short Story | Sita Mandalika | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాలం తో పాటు రచన: సీత మండలీక (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఈరమ్మా, ఈదినం చంద్రయ్య కొడుకు, బిడ్డ ని చూసుకుందికి వస్తాడట. స్వరూప ని మంచి బట్టలేసుకుని మంచిగా తయారవమను. వాళ్ళు వచ్చేక చాయ్ బిస్క్యూట్లు తయారుగుంచు” అని భార్యకి చెప్పి చేనుకి బయలు దేరేడు వెంకటయ్య. “బిడ్డా, సాయంకాలం పిల్లగాడు నిన్ను చూసుకుందికి వస్తాడట. జరా ఇల్లు నీటుగుంచి మంచిగా తయారవు” అంది ఈరమ్మ. “అమ్మా, ఇప్పుడే కళ్యాణం చేసుకోను. నేను ఇంకా సదూకోవాల” చెప్పింది స్వరూప. “ఏం మాట్లాడుతున్నావ్ స్వరూపా.. కళ్యాణం ఇప్పుడే సేసుకోవా. నీ దోస్తులందరూ పెండ్లాడి బిడ్డలను కన్నారే” కోపంగా అంది ఈరమ్మ. “అమ్మా, పెద్ద చదువులు చదివి నౌకరీ చెయ్యాల” చెప్పింది స్వరూప. “ఏంటి కొత్త కొత్త మాటలు సెప్తున్నావు. చంద్రయ్య కి మస్తు చేనుంది. ఒక్కడే కొడుకు. నామాట విని కళ్యాణం చేసుకో బేటా” “అస్సలు బాగోడు ఆ క్రిష్నయ్య. నౌకరీ ఉన్న అబ్బాయి నే చేసుకుంటా” “నా మాట సమజ్హ్చేసుకో బిడ్డా” అని చాయ్ పత్తా తెచ్చుకుని ‘వస్తా’ అంటూ వీరమ్మ బయలు దేరింది. *** "మమత అపార్ట్మెంట్స్" ఎదురుగా ఉన్న పార్క్ లో రోజూ పిల్లలు ఆడుకోడానికి వెళ్తూ ఉంటారు. పెద్దలు కూడా తమ తమ వీలుని బట్టి కలుస్తూ ఉంటారు. ఆ రోజు డాక్టర్ శర్మిష్ట, నర్మద సాయంత్రం పార్క్ లో కలవాలని నిశ్చయించు కున్నారు. నర్మద ఉమెన్స్ కాలేజీ లో లెక్చరర్ ఆరేళ్లనించి అదే అపార్ట్మెంట్స్ లో ఉండడం శర్మిష్ట తో బాగా స్నేహం ఏర్పడింది. అదీ కాక ఇద్దరూ ఇంచుమించు ఒకే వయసు వాళ్ళు. “హలో శర్మిష్ట.. ఎలా ఉన్నావు? మనం కలిసి చాలా రోజులయింది కదూ” అంది నర్మద “ఆ బాగానే ఉన్నాను నర్మదా.. ఈ మధ్య నైట్ డ్యూటీలు చెయ్యవలసి వస్తోంది. ఇక శని ఆది వారాలు అలసట, బద్దకం” అంది శర్మిష్ట. “అర్జెంటు గా పార్క్ లో కలుసుకొమ్మని కబురు చేసేవు. ఏమిటి విశేషం?” అడిగింది నర్మద. “ అదే నర్మదా.. మా ఇంట్లో నా పెళ్లి గురించి పెద్ద గొడవ అయిపోతోంది. నీకు తెలుసుకదా.. అశోక్, నేను ఈ ఏడాది పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామనుకుంటున్నాము. అమ్మ నాన్నకి ఈ పెళ్లి విషయం చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటె లాభం లేదని నేనే నిన్న నాన్నకి అన్ని విషయాలు చెప్పేను. ఆరు నెలలో పెళ్లి చేసుకుని ఒక ఏడాది ఎంజాయ్ చేసేక పీ. జీ. చేస్తామని. ” అంది శర్మిష్ట. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/8QUziRehDm4
Embed this episode
Ready to play
కాలం తో పాటు | Kalamtho Patu | Telugu Short Story | Sita Mandalika | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.