EPISODE · Sep 27, 2022 · 13 MIN
కాలవలో ఈతలు పడవల మీద షికార్లు | Kalavalo Ethalu Padavala MIda Shikarlu | Telugu Short Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాలవలో ఈతలు – పడవల మీద షికార్లు రచన : M R V సత్యనారాయణ మూర్తి కాటన్ దొర పుణ్యమా అని ధవళేశ్వరం వద్ద గోదావరి నదికి ఆనకట్ట వచ్చింది. ఉభయగోదావరి జిల్లాలలో సాగునీటికోసం పెద్ద పెద్ద కాలువలు తవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే మా పశ్చిమ గోదావరి జిల్లాకు విజ్జేశ్వరం నుండి నర్సాపురం వరకు పెద్ద మంచినీటి కాలువ వచ్చింది. ఈ కాలువ కింద వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. లారీలు అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. సరుకుల రవాణా ఈ కాలువ మీద తిరిగే పడవల ద్వారా బాగా జరిగేది. ప్రజలు కూడా ఈ కాలవలమీద తిరిగే పడవలలో తరచూ ప్రయాణాలు సాగించేవారు. అప్పుడప్పుడు పుణ్య క్షేత్రాలకు కూడా పడవలమీద నిడదవోలు వరకూ వెళ్లి అక్కడనుంచి రైలు ఎక్కి వెళ్ళేవారు. ఉప్పు పప్పు కాదండోయ్, బెజవాడ నుంచి సిమెంట్ కూడా పడవలమీద మా పెనుగొండ సిమెంట్ కొట్టులకు వచ్చేది. ఇంకో గొప్ప విషయం కూడా ఉందండోయ్, పాలగుమ్మి పద్మరాజు గారి పేరు తెలుసు కదండీ, అదేనండి బాబూ ‘గాలివాన’ కథతో మన తెలుగువాడి సత్తాని ప్రపంచానికి చాటిన మహానుభావుడు. ఆయన రాసిన మరో గొప్ప కథ ‘పడవ ప్రయాణం’ మా విజ్జేశ్వరం – నర్సాపురం కాలువ మీదే నడిచిందండి. అంతటి పేరూ, ప్రఖ్యాతి ఉన్న మా కాలువమీద ఎన్నెన్ని సరదాలు, సిత్రాలు,చమక్కులు జరిగేయో తెలుసుకుంటే మీరు ‘అవాక్కు’ అవడం ఖాయం. మా పెనుగొండలో సహం మంది మొగాళ్ళు కాలవలోనే స్నానాలు చేస్తారు. స్నానం అవగానే ప్రత్యేక్షనారాయుడు ఆ సూర్నారాయుడికి దణ్ణం పెట్టుకుని మరీ ఇంటికి వెళ్ళరు. ‘ఆ మీకు మళ్ళీ నీళ్ళు తోడిఇచ్చే ఖాళీ ఎవరికుంది? పోయి కాలవలో మునిగి రండి’ అని ఆళ్ళ ఆడంగులు అంటారని కిట్టని వాళ్ళు అంటారు. అయన్నీ మీరు పట్టించుకోకండి. ఎందుకంటే మనం అన్నీ మంచిగా ఆలోచించాల. అప్పుడే మన వళ్ళూ ,మనసూ ప్రశాంతంగా ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీషులో కూడా పెద్ద పెద్ద వాళ్ళు అదే అంటన్నారుకదండీ, ‘పాజిటివ్ థింకింగ్’ అని. అదన్నమాట.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/t2o4jCv6epg
Embed this episode
Ready to play
కాలవలో ఈతలు పడవల మీద షికార్లు | Kalavalo Ethalu Padavala MIda Shikarlu | Telugu Short Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.