EPISODE · Dec 30, 2022 · 11 MIN
కాఫీ | Coffee | Telugu short Story | Sujatha Thimmana | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాఫీ రచన: సుజాత తిమ్మన (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అమ్మ ఫోటో ముండు పొగలు గ్రక్కుతున్న కాఫీ గ్లాసు పెడుతూ...దుఃఖం ఆపుకోలేక పోయింది మంజుల . పీట మీద వెలుగుతున్న దీపం చిరు గాలి తెరలకు మెల్లగా ఊగుతూ ఓదారుస్తుంది అమ్మ చల్లని స్పర్స లా. "అమ్మ గా తను సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నా ..తనని కన్న అమ్మని అలక్ష్యం చేసానేమో..."అన్న బాధ ఎదలో సుడులు తిరుగుతూ ఉంటె ముడుచుకొని కూర్చున్న మోకాళ్ళపై తల ఆన్చి వెక్కి వెక్కి ఏడ్వసాగింది మంజుల. "పాపా! ఒక్క సారి చూడాలని ఉందమ్మా..!" అని ఎంతగా కలవరించింది. తనకమో రావడానికి వీలుపడలేదు . ఆఖరి క్షణాల్లో కూడా తను దగ్గర లేకపోయింది. "మమ్మీ ! కంట్రోల్ యువర్సేల్ప్! అమ్మమ్మ వియోగం తననీ భాదిస్తున్నా...తనను కన్న అమ్మను అనునయిస్తూ నిఖిత అమ్మని వాటేసుకొని ఓదార్చాలని ప్రయత్నిస్తుంది. ******* 1963..ఆ రోజుల్లో ఇంచు మించు అందరి ఇళ్ళల్లోనూ కుంపట్లు ఉండేవి. కుంపటి అంటే. (బొగ్గులతో మండే పొయ్యి ) కుంపట్లో సైజు ఇత్తడి గుండిగలోని మరుగుతున్న నీళ్ళలో కాఫీ పొడి వేసి మూత పెట్టి దించేసారు నారాయణ రావు గారు. అయిదు కాక మునుపే నిద్రలేచి పాలు పోయించు కొచ్చేవారు . ఆ సమయానికల్లా లలితాంబ వాకిలి ఊడ్చి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టి కుంపటి వెలిగించేది. నారాయణరావుగారు కాఫీ డికాషన్ కాచేవారు .అది వారి రోజు ఉదయపు దినచర్య. పాలు కూడా కాగిన తరువాత ఇద్దరు చెరొక గ్లాసు (పెద్దది) నిండా కాఫీ కలుపుకొని త్రాగేవారు మాట్లాడుకుంటూ అలా వంటింట్లోనే పీటలపై కూర్చుని. (బ్రిటిష్ వాళ్ళ దాస్యశృంకలాలను తెంచు కొనడానికి హరహరము పోరాడి చివరికి భారత దేశం అంతా ఒక్కటై "అహింస " ఆయుధంగా "సత్యాగ్రహం "సాయుధంగా గాంధీగారి న్యాయకత్వంలో స్వతంత్రం సంపాదించుకున్నాము కాని..వాళ్ళు మనకి నేర్పి వెళ్ళిన ఈ కాఫీత్రాగే అలవాటుని మానలేక పోతున్నాం . పొద్దున్నే ఓ గ్లాసు కాఫీ పడందే ఈ మిషన్ (శరీరం) కదలని మొరాయిస్తుంది ఏంటో? తనలో తనే అనుకుంటూ పైకే అనేస్తూ ఉంటారు రోజుకొకసారయినా నారాయణరావు గారు . చీకటి దుప్పటిని తోసేస్తూ తొలి కిరణాల కాళ్ళతో తన్నుతూ సంధ్య ఒడిలోంచి లేస్తూ ఉంటాడు బాల భానుడదే సమయానికి. మంజుల , మనోహర్ రెండేళ్ళ తేడాతో ఇద్దరు పిల్లలు . ఆదాయపు శాఖలో చిన్నపాటి గుమాస్తాగా ఉద్యోగం నారాయణరావు గారిది. నిజనికయితే ఆ శాఖలో పనిచేసే ఎవరయినా...అంతో ..ఇంతో...సంపాదించు కునేవారే కానీ... నారాయణరావుగారు గాంధీగారి హయాములో వారి ఆశయాలతో జీవంపోసుకున్నవారు, నిజాయితీ ఉపిరి ఆయనకి. ఆత్మ స్తైర్యం ,స్వాభిమానం .అయన ఆహారాలు మరి ఆయనకు అన్ని విధాల తగిన అనుకూలవతి అయిన ఇల్లాలు లలితాంబ. ఎప్పుడూ ఆప్యాయతల పొదరిల్లులా ఉంటుంది ఆ చిన్న పెంకుటిల్లు. అయన చేసిన కాఫీ త్రాగుతూ అయన భావాలని జీర్ణం చేసుకొని ఆ కొమ్మలోనుంచి వచ్చిన పూవులాగే మంజుల పెరుగుతుంది . కొద్దో గొప్పో ..తమ్ముడనని గారం వల్ల కొంచం పెంకితనం అబ్బినా బుద్దిగా చదువుకునేవాడు మనోహర్. కాలమనే పాకుడు రాళ్ళపై సంవత్సరాలెప్పుడు జారిపడిపోతూనే ఉంటాయి మరి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/sBkPziQ3X3s
Embed this episode
NOW PLAYING
కాఫీ | Coffee | Telugu short Story | Sujatha Thimmana | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.