EPISODE · Jul 14, 2022 · 19 MIN
కలిసి పోరాడు | Kalisi Poradu | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కలిసి పోరాడు రచన: పెండేకంటి లావణ్య కుమారి అవగాహన లేక అన్యాయాల పాలయ్యే బడుగు వర్గాల వారు కలిసి పోరాడటం వల్ల జరిగిన న్యాయం గురించి తెలిపే కథ. ***** గౌరిని చూస్తే ఎవ్వరికైనా నల్ల కలువే గుర్తొస్తుంది. మరి పొద్దుటి నుండి మాపటి వరకు సూర్యుడి క్రింద పని చేసేవారు నల్లగా కాక ఎలా వుంటారు. వారంతా సూర్యుడి ముద్దు బిడ్డలు. గౌరి లంగా, ఓణీ వేస్కుని తెలుగుదనం ఉట్టిపడేలా చక్కగా వుంటుంది. గౌరీ వాళ్ళది బడుగు వర్గానికి చెందిన దినసరి కూలీ కుటుంబం. గౌరి ఒక్కతే కూతురు, గౌరిని కంటూనే సరైన వైద్యమందక తల్లి చనిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్ళి చేస్కోకుండా, తన తల్లి సాయంతో గౌరీని పెంచాడు. గౌరీకి పన్నెండేళ్ళప్పుడు, ముసల్ది చనిపోయింది. ఇప్పుడు గౌరీకి పదహారేళ్ళుంటాయి, ఈ మధ్యే వాళ్ళ నాన్నకు పక్షవాతమొచ్చి మంచం పట్టాడు. అప్పటి నుండి గౌరీనే, వాళ్ళ నాయనకు అన్నీ చేసి పెడ్తోంది. ఊరి బయట వాళ్ళ వర్గమంతా పాకలేస్కుని వుంటున్నారు. ఎలక్షన్ల ముందు పక్కా ఇళ్ళు ఇస్తామన్నారు గానీ ఎప్పుడిస్తారో, ఎదురు చూస్తూనే వున్నారు. వాళ్ళకొరకు అక్కడే ఒక ప్రభుత్వ పాఠశాల నడుస్తోంది, దాంట్లోనే వాళ్ళ నాయనకు బాగున్నన్ని రోజులు చదువుకుంది గౌరి. చదవడమంటే, పర్వాలేదు ఏదో బాగానే చదివేది. ఇంకొక్క ఏడాది అయ్యుంటే పది పాసయ్యేది, కానీ అంతలోనే వాళ్ళ నాయన మంచం పట్టాడు. అప్పటి నుండి బడి మానేసి పొలం పనికి పోతోంది గౌరి. ఆ దినం నుండి గౌరిని చూచి వాళ్ళ నాయన ఏడ్వని రోజు లేదు. ఇంకా గౌరీనే ఆయనకు ధైర్యం చెప్తూ, "ఏమీ కాదులేయ్యా, ఊర్కో," అనేది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/GzNBto4awWs
Embed this episode
Ready to play
కలిసి పోరాడు | Kalisi Poradu | Telugu Short Story | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.