EPISODE · Feb 25, 2023 · 8 MIN
కళ్యాణం – కమనీయం | Kalyanam Kamaniyam | Telugu Short Story | Damaraju Visalakshi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కళ్యాణం – కమనీయం రచన: దామరాజు విశాలాక్షి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పెళ్ళి సంబంధం కోసం, వచ్చిన, కామేశం కళ్యాణి లను చూసి ఖంగు తిన్నది శ్రీ విద్య.. తనను చూసి కూడా ఏమీ తెలియనట్లు, ఎవరో.. అన్నట్లు మాట్లాడుతున్న వారిని చూస్తే ఒళ్ళు మండుతున్నా భరించింది కూతురికోసం.. చక్కగా పలహారాలవీ తిని, ‘ఇక మేము వెళ్తామండీ.. ఫోన్చేస్తాము ఇంటికెళ్ళి’ అన్న కామేశంతో, ఇక ఊరుకోలేక, అంది విద్య.. “అవసరం లేదులెండి.. పలహారాలవి అయ్యాయిగదా! ప్రశాంతంగా ఉండండి. మా అమ్మాయి ఈ పెళ్లికి ఏమంత సుముఖంగా లేదు. ” శ్రీవిద్య మాటకి ఉలిక్కిపడి, సూటిగా తలెత్తి చూసిన కామేశం, ఆలోచించే లోపల అంది విద్య. “పర్లేదులెండి, కొడుకు పెళ్లిచూపుల పేరుతో, మీరిద్దరేగాక, మీ కోడుకుతో సహా మరి కొందరిళ్ళల్లో తిని వెళ్ళొచ్చుగదా?.. ” విద్య అంటుంటే, “ఏమిటి నాన్నా। ఈమె వెటకారంగా మాటాడుతోంది? మేనర్స్ తెలీదా ? మీరే కదా.. వాళ్ళు పెళ్ళిచూపులకు రమ్మని కబుర్లు పెడుతున్నారన్నారు.. వీలుకాకపోయినా పర్మిషన్పెట్టి వచ్చాను” అన్నాడు ఆవేశంగా అబ్బాయి. “అంత ఆవేశపడకు బాబూ ! అనుభవజ్ఞులైన మీ అమ్మానాన్న అన్నీ, నేర్పిస్తారు. అన్నట్టు నీతోపాటు పెళ్లి చూపులకు రాడానికి, నీకు అత్తకూతురో, మామకూతురో, పక్కింటి అమ్మాయో లేరా? లేకపోయినా పర్వాలేదులే! మీనాన్న ఎవరినో తీసుకొస్తారు” అంది శ్రీవిద్య. “ఈమేమిటి, నాన్నా! ఇంత అసహ్యంగా అలా మాటాడుతోంది?” అంటున్న కృష్ణతో.. “మొదట నువ్వు ఇలాగే అంటావు. నాలుగు రోజులుపోతే, నీకే బాగుంటుంది. మీనాన్ననడుగు, నేర్పుతాడు. లేదా మీ అమ్మనడిగితే సలహాలు చెప్తుంది” అంది శ్రీవిద్య.. చురచురలాడుతూ వాళ్లనిచూసి.. ఆమె అలాగనగానే, “మాటాడుతుంది.. ఆమె తీరే అంత! పద౦డి పద౦డి.. ” అని అబ్బాయి తండ్రి కామేశ్వరరావు అన్నాడు. “ఆవిడ గారు ముందునుంచే ఇంతే।.. వీళ్ళని తెలిస్తే రాకపోదుము” అని తల్లి కళ్యాణి అంది. “మీ సంబంధమని తెలిస్తే, ముందే రానిచ్చేదాన్ని కాదు. ఇంత సేపూ నేనెవరో తెలియనట్లు ఎంచక్కా నటించారు? అయినా ! నటన మీకలవాటేగా.. ?” కోపంగా అంది శ్రీవిద్య.. కామేశం, కళ్యాణిలను ఆసహ్యంగా చూస్తూ.. “చాలు.. ఇక పదండి” అని విస విసా వెళ్లి పోయాడు కామేశం కొడుకు కృష్ణ.. వెనక్కి తిరిగి చూడకుండా కొడుకును అనుసరించారు కామేశం, కళ్యాణి.. అయోమయంగా చూస్తున్న పెళ్లి కూతురు, ఆమె తండ్రీ, అడుగుతున్నా వినిపించుకోకుండా. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/3_vLiDJ6vec
Embed this episode
NOW PLAYING
కళ్యాణం – కమనీయం | Kalyanam Kamaniyam | Telugu Short Story | Damaraju Visalakshi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.