EPISODE · Apr 8, 2023 · 7 MIN
కలసి ఉంటే కలదు సుఖము 3 | Kalasi Unte Kaladu Sukhamu 3 | Telugu Web Series | K. Lakshmi Sailaja | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
కలసి ఉంటే కలదు సుఖము 3 రచన, కథా పఠనం : కే. లక్ష్మీ శైలజ పెద్ద కథ 3/3 “ఏమత్తా, మాకు అన్నం పెట్టేదుందా, లేదా?” అనేవాడు వీళ్ళ పనులు చూసి రామసుబ్బారావు.“రాముడూ, ఈ నాలుగు రోజులూ అందరికీ ఇక్కడే భోజనాలు, ” అనేది సుభద్రమ్మ. “హైమా, మరి మాకు టిఫన్ అయినా చేసి పెడతావా?” అన్నాడు రామసుబ్బారావు. “అలాగే..చేస్తాను” అన్నది హనుమావతి. హనుమావతి పేరును పెళ్ళిలో రామసుబ్బారావు వాళ్ళు హైమావతి అని మార్చుకున్నారు. ఒకాదివారం రోజు స్కూల్ గ్రౌండ్ కు వెళ్ళి రామ్మూర్తికి, విజయ్ కూ ఫుట్ బాల్ నేర్పించాడు, రామ సుబ్బారావు. రామసుబ్బారావు మంచి ఫుట్బాల్ ప్లేయర్. వాళ్ళ నాన్న పేరు మీద ట్రోఫీ కూడా పెట్టారు. "నువ్వు బలే ఆడావు బావా!" రామ్మూర్తి అడ్మైరింగ్ గా చూశాడు, రామసుబ్బారావు వైపు. ఆడపిల్లలకు కొద్దిరోజులు బాడుగ సైకిల్ కూడా నేర్పించాడు, రామ సుబ్బారావు. ఆ స్ఫూర్తి తోనే నేమో రాణీ ' కోకో ' ఆటలో స్కూల్ తరఫున కర్నూల్ వెళ్ళి ఆడి వచ్చింది.పేలాలు, బియ్యంపిండి వడియాలప్పుడయితే అటు హనుమవతమ్మ ఇంట్లోనూ, ఇటు సుభద్రమ్మ ఇంట్లోనూ సందడే సందడి. ఆడవాళ్లు తెల్లవారు ఝామున నాలుగు గంటలకే లేచి, స్నానాలు చేసి పెద్ద గంగాళాలకు పిండి ఉడికించే వాళ్ళు. వాటిని స్పూన్ తోనూ, కారాల చిట్లతోనూ పెట్టేవాళ్ళు. అలా పెట్టడం కోసం నేత చీరలు, పంచెలు వాడనివి ముందు రోజు తీసి రెడీగా పెట్టుకునే వాళ్ళు. ఉదయాన్నే రాంమూర్తి బావిలో నీళ్లు తోడిపెడితే..... కుమారి, రాజ్యమ్మ ఆ చీరలు, పంచెలు పిండి పెట్టేవాళ్ళు. ఎండాకాలం అందరూ రాత్రి పూట మిద్దెలమీద నులక మంచాలు వేసుకొని దోమతెరలు కట్టుకొని పడుకునే వాళ్ళు కాబట్టి, ఆ మంచాల మీద ఈ తడి బట్టలు పరిచి ఉంచేవాళ్ళు. చెక్క నిచ్చెనలు అందరూ చక్కగా ఎక్కే వాళ్ళు, ఒక చేతిలో కొంచెం వేడిగా ఉన్న పిండి గిన్నెలు కూడా పట్టుకొని. మట్టి మిద్దెలయినా ఎవరూ ఫీలయ్యే వాళ్ళు కాదు. హాయిగా కిందనే కూర్చునే వాళ్ళు. “అమ్మా, నేనూ వడియాలు పెడతా, ” అని పేలాల వడియాలు పెడ్తున్న హనుమావతమ్మను బ్రతిమిలాడుతోంది, శైలజ. “ఇవి నీకు సరిగా రావు గానీ, బయ్యం పిండి వడియాలు పెడుదువులే, ” అని అనునయంగా చెప్పింది హనుమావతమ్మ. “పిల్లలందరూ ఇక్కడ రండీ, ” అని పిలిచి సుబ్బమ్మ బియ్యంపిండి వడియాల రోజు ఒక చిన్న చాప మీద పంచ పరిచి, చిన్న పిల్లలను దానిమీద స్పూన్ తో పెట్టుకోమన్నది. చిన్నపిల్లలు సంతోషంగా ఆ పంచ చుట్టూరు చేరి వడియాలు పెట్టారు, సుబ్బమ్మ ఆధ్వర్యంలో. అందరూ పెడు తున్నారు నేను కూడా పెట్టాలని, వాళ్ళమధ్యలోకి వెళ్ళి రెండు సార్లు పిల్లలు వడియాలు పెట్టిన ఆ పంచ మీద జారీ, వడియాల పిండి వళ్ళంతా పూసుకున్నాడు, ప్రమీల, సుబ్బారావు ల రెండు సంవత్సరాల కొడుకు బాబు. అది చూసి ముందు ‘అయ్యో, ’, అని అరిచేసినా, తరువాత అందరూ పడీ పడీ నవ్వారు. వడియాలు పెట్టడం అయిన తరువాత, గిన్నెలో అడుగున ఉన్న కొంచెం గట్టిగా, కొంచెం మాడినట్లున్న పిండిని అందరూ ఇష్టంగా తలా పిడికెడు తిన్నారు. మధ్యలో ఒకరోజు రాత్రి రెండు కిలోల గోధుమ పిండి తడిపి చపాతీలు చేశారు అందరికీ. పెద్దవాళ్ళు పిండి తడిపితే, మిగతావాళ్ళు ఒకరు ఉండలు చేస్తే, ఒకరు రౌండ్ గా రేకు వత్తిస్తే, ఒకరు ఆ రేకును చిన్న త్రికోణంగా వత్తిస్తే, ఇంకొకరు ఆ త్రికోణాన్ని పెద్ద త్రికోణంగా వత్తిస్తే ఇంకొకరు ఆ చపాతీలను నూనె వేసి కాల్చారు. అలా అందరూ కలిసి చపాతీలు చేశారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/PcE4h4NOQ6Y
Embed this episode
NOW PLAYING
కలసి ఉంటే కలదు సుఖము 3 | Kalasi Unte Kaladu Sukhamu 3 | Telugu Web Series | K. Lakshmi Sailaja | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.