కలతల కెరటాలు | Kalathala Keratalu | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 3, 2022 · 20 MIN

కలతల కెరటాలు | Kalathala Keratalu | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కలతల కెరటాలు రచన: యశోద పులుగుర్త హఠాత్తుగా ఉరుములేని పిడుగులా వస్తూనే “ అత్తా అంటూ" తనని హత్తుకుపోయిన వీణాధరిని చూస్తూనే ఆశ్చర్యపోయింది నీలవేణి. “ఏమిటీ..  డాక్టర్ వీణాధరే.. ఇలా చెప్పా పెట్టకుండా ఈ అత్తను చూడాలని వచ్చింది?” బుగ్గల మీద చేయి వేసుకుంటూ, ఆశ్చర్యంగా చూస్తూ “ ఏడీ డాక్టర్ వంశీకృష్ణ” అంటూ వీణాధరి వెనుకనే ఉన్నాడేమోననుకుంటూ వెతకసాగింది నీలవేణి. “లేదు అత్తా, నేను ఒక్కర్తినే వచ్చాను. ఏం.. వంశీ రాకపోతే నన్ను లోపలికి రానీయవా, వెళ్లిపోనా అయితే?” అంటూ వెనుతిరగబోయింది అత్తను ఏడిపించాలని. 'పిచ్చి పిల్లా' అంటూ వీణాధరి ని ఆప్యాయంగా హత్తుకుని సూట్ కేస్ అందుకోబోయింది. మేనత్త ఆప్యాయతకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. సూట్ కేస్ తో అత్త వెనుకే లోపలకి నడిచింది.. పూజగదిలోనుండి వినిపిస్తున్న ఎమ్.. ఎస్.. సుబ్బలక్ష్మి విష్ణుసహస్రనామాలు మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తున్నాయి. అత్త ఇంటికి వస్తే మనసుకి ఎంతో హాయిగా ఉంటుందెప్పుడూ. కానీ ఈ మధ్య అత్త ఇంటికి వచ్చి చాలా రోజులే అయింది. ఈ లోపుల మామయ్య లోపలనుండి వస్తూనే " ఏమ్మా వీణా ఎలా ఉన్నావు? వంశీ రాలేదా?”  అని అడిగాడు. “రాలేదు మామయ్యా” అంటూ బాత్ రూమ్ లోకి వెళ్లి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి వచ్చింది. అత్త వంటింట్లో హడావుడిగా వంట చేస్తూనే, మేనకోడలికు వేడి వేడి కాఫీ కప్పులో పోసి అందించింది.. వీణ అత్తను పరికించి చూసింది.. చామనచాయరంగులో, ఒకమోస్తరు ఎత్తులో, నిరంతరం పెదవులమీద నర్తించే అందమైన చిరునవ్వు తో ఎప్పుడూ కళ కళ లాడుతూ ఉండడమే కాదు, ఎటువంటి సమస్యనైనా అవలీలగా ఎదురుకొనే ఆత్మస్తైర్యం తో అందరినీ ఆకట్టుకుంటుంది.. ఎమ్.. ఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి పెళ్లికి ముందు కొద్దికాలం లెక్చరర్ గా పనిచేసింది.. అనర్గళన ఇంగ్లీషు మాట్లాడడమే కాదు, సొసైటీ లో స్త్రీలు ఎదుర్కొనే అనేక సమస్యలు గురించి, ఉద్యోగినులు ఆఫీసులలో ఫేస్ చేసే చెప్పుకోలేని పరిస్తితులను చక్కటి ఆర్టికల్స్ గా వ్రాసి రీడర్స్ డైజస్ట్, ఉమెన్ మేగజైన్స్ లాంటి వాటికి పంపిస్తూ ఉంటుంది. పైకి సాదాసీదాగా కనిపించే అత్త ఇంత చేస్తున్నా తన గరించి గొప్పగా ఎవరికీ చెప్పుకోదు. అందుకే అత్త అంటే తనకు ఆరాధన, గౌరవం. పెళ్లితరువాత ఉమ్మడి కుటుంబం బాధ్యతలు, ఆ తరువాత తన పిల్లల బాధ్యతలను నిర్వర్తించడంలో తన ఉద్యోగానికి రిజైన్ చేసి పూర్తిగా కుటుంబ బాధ్యతలలో మునిగిపోయి తన కూతుళ్లిద్దరనూ బాగా చదివించి చక్కని సంబంధాలు తెచ్చి పెళ్లిచేసింది.. నీలత్త గురించి ఆలోచిస్తూనే అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గరనున్న కుర్చీలో కూర్చుని కాఫీ సిప్ చేయసాగింది.. నా అనుకునే ఒక మనిషి సమక్షం ఎంతో సెక్యూరిటీని ఇస్తున్నట్లుగా భావన కలుగుతోంది.. వీణాధరి కి గత కొద్దినెలలుగా తన వైవాహిక జీవితంలో చోటుచేసుకుంటున్న కలతలు గుర్తొచ్చి మనసు భారమైపోయింది.. ఇంతసేపైనా తన రాకకి కారణాన్ని ఆరాతీయని నీలత్త వ్యక్తిత్వం ఎంతగొప్పది.. " ఏమిటే వీణా ఆ మూగనోము? నేను మాట్లాడుతున్నా పరాకుగా ఉన్నావు?” “నీ గురించే ఆలోచిస్తున్నాను. మా నీలత్త అలాగే ఉంది, ఏ మార్పూ లేదని.. అవునూ, ఎప్పుడూ అలా నవ్వుతూ ఎలా ఉంటావు అత్తా?” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/WPtXdADghKM

Episode metadata supplied by the publisher feed · Published Dec 3, 2022

Embed this episode

NOW PLAYING

కలతల కెరటాలు | Kalathala Keratalu | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

0:00 20:20

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 20 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 3, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!