EPISODE · Oct 25, 2022 · 15 MIN
కన్నమ్మ | Kannamma | Telugu Shot Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కన్నమ్మ రచన : M R V సత్యనారాయణ మూర్తి పెనుగొండలో లింగాలవీధి లో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఒక పెద్ద నుయ్యి ఉంది. దాని వెనుకే ఓ పది ఇళ్ళు ఉన్నాయి. ఎనిమిది పాకలు, రెండు పెంకుటిళ్ళు. వాటికి పక్కనే గున్నయ్య మాస్టారి బడి ఉంది. అది మాస్టారు కన్యకాపరమేశ్వరి అమ్మవారి పేరు మీద నడుపుతున్న ప్రాథమిక పాఠశాల. కొన్ని ఏళ్ళ క్రితం శ్రీకాకుళం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన కొన్ని కుటుంబాలు ఉంటున్నాయి అక్కడ. తెల్లారిలేస్తే ఆ పది కుటుంబాలవారు ఆ నూతి దగ్గర సందడి చేస్తూ ఉంటారు. కొందరు నూతి లోంచి నీళ్ళు బకెట్లతో తోడుకుంటూ ఉంటారు. మరి కొందరు తమ పిల్లలకి అక్కడే స్నానాలు చేయిస్తూ ఉంటారు. కన్నమ్మ అక్కడకు రాగానే పిల్లలు అందరూ గోల గోలగా అరుస్తారు, తమకి స్నానం చేయించమని. ఎందుకంటే కన్నమ్మ చిన్న పిల్లలకు స్నానం చేయించడంలో ఎక్సుపర్టు. చిన్నగా నవ్వుతూ అక్కడ ఉన్న పిల్లలకు ఎంతో ఓపికగా స్నానాలు చేయిస్తుంది కన్నమ్మ. ఆ పని అయ్యాకే తను మంచినీళ్ళు తోడుకుని ఇంటికి పట్టుకెల్తుంది. కన్నమ్మ భర్త దుర్గారావు దుబాయిలో ఉంటాడు. అక్కడ తాపీ పని చేస్తున్నాడు. రెండేళ్ళకో, మూడేళ్ళకో ఒకసారి పెనుగొండ వచ్చి నెలరోజులు ఉండి వెళ్తాడు. పన్నెండేళ్ళ వారి వైవాహిక జీవితానికి గుర్తుగాముగ్గురు పిల్లలు కలిగారు. కన్నమ్మ, భర్త కన్నా రెండు అంగుళాలు పొడుగు ఉంటుంది. దుర్గారావు తల్లి సింహాచలం ‘కోడలు పొడుగ్గా వుంటే నువ్వు పొట్టి బుడంకాయలా ఉంటావు. ఈ సంబంధం వద్దు’ అని చెప్పినా, అందంగా తెల్లగా ఉన్న కన్నమ్మని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాడు దుర్గారావు. తమకు పుట్టబోయే పిల్లలు పొడుగ్గా, అందంగా ఉంటారని అతని ఆశ. అతని ఆశ నిరాశ కాలేదు. వాళ్లకి కలిగిన ముగ్గురు పిల్లలకీ కన్నమ్మ రంగే వచ్చింది, కను ముక్కూ తీరు బాగుంటుంది. భర్త దుబాయి నుండి పంపిన డబ్బు జాగ్రత్తగా దాచి, ఈ మధ్యనే రెండెకరాలు పొలం కొంది కన్నమ్మ. ఒక పాలేరుని పెట్టుకుని తనే స్వంతంగా వ్యవసాయం చేస్తోంది. ఇంటి దగ్గరే ఒక గేదెని మేపుతూ పాలు కూడా అమ్ముతుంది. తమ పది కుటుంబాల వారికే కాకుండా, ఎవరికీ ఏ సాయం కావాల్సి వచ్చినా చేస్తుంది కన్నమ్మ... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/FZNFAITx_cQ
Embed this episode
NOW PLAYING
కన్నమ్మ | Kannamma | Telugu Shot Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.