EPISODE · Jan 13, 2023 · 18 MIN
కోబ్రాల మధ్య వానపాము | Cobrala Madhyana Vanapamu | Telugu short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కోబ్రాల మధ్య వానపాము రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఓ దొంగ దైవమయ్యాడు. అక్షరాలు నేర్వనివాడు న్యాయదేవతకి రక్షకుడయ్యాడు. అబద్దము చెప్పాలంటూ శరీరాన్ని నుజ్జునుజ్జు చేసినా నిజం వైపే నిష్ఠగా నిలిచాడు. అందుకే 28 ఏళ్ళపాటు సాగిన నళిని హత్యకేసు తీర్పులో న్యాయస్థానం ఆ మాజీ దొంగని వేనోళ్ళ ప్రశంసించింది! సమాజం అంతా చేతులెత్తి నమస్కరించిన "చిల్లర రాజు" కథ కాని కథ ఇది............... షాలినీ-శివాణీ లో సెకండ్ షో చూస్తున్న చిల్లరరాజు ధ్యాస సినిమాపైన లేదు. ఆ సినిమా విడిచాక... తాను చేయబోతున్న దొంగతనం గురించే ఆలోచిస్తున్నాడు. తాను మూడురోజులుగా రెక్కీ నిర్వహిస్తున్న ' విక్టోరియా హోమ్స్" పరిసరాలనే గుర్తు చేసుకుంటున్నాడు. సిటీ లోని డయాసిస్ కి చెందిన ఉద్యోగినులూ, విద్యార్థినులూ ఉండే హాస్టల్ అందులో ఉంది. ఆ భవంతి పై పిడుగుని నిరోధించే కంభంపైనుండే రాగి తీగపైన రాజు కన్నుపడింది! రాజు ఎప్పుడూ అంతే... పెద్ద పెద్ద వస్తువులూ, బంగారు నగలవైపు వెళ్ళడు. చిన్నా చితకా రాగి వస్తువులూ, నీటిమీటర్లూ, గడ్డి అన్నారం పళ్ళమార్కెట్ కు వచ్చేలోడు బళ్ళ మీద పళ్ళు కిలోలకు కిలోలు దొంగతనం చేస్తాడు. అవి దొరకనప్పుడు చుట్టుప్రక్కల సబ్ స్టేషన్‌లలో కాపర్‌తీగలు చోరీ చేస్తాడు. పెద్ద వాటి జోలికి అస్సలు వెళ్ళడు. అందుకే చిల్లరరాజూ అని అంటారు. పగలంతా ఎవరికీ అనుమానం కాకుండా పళ్ళమార్కెట్ లో దింపులు దింపుతుంటాడు. మార్కెట్‌లో హమాలీ గానూ ఉంటాడు! 26 మార్చి 1992న.. సెకండ్‌షో ముగిసి రోడ్లపైన సందడి తగ్గాక మెల్లగా " విక్టోరియాహోమ్స్" దగ్గరకెళ్ళాడు రాజు. దక్షిణం వైపు కాంపౌండ్ గోడ పక్కనున్న చెట్టుపై నెక్కి లోపలికి దూకబోతుండగా.... అతని కళ్ళ పడ్డారు ఇద్దరు వ్యక్తులు! చేతిలో టార్చ్ తో గ్రౌండ్‌ఫ్లోర్‌మీద నుంచి సెల్లార్ లోకి దిగుతూ కనిపించారు.. అందులో ఒకరు వార్డెన్ అరుల్‌రాజు- ఆ చుట్టు ప్రక్కల అరుల్‌రాజు పెద్దమనిషి గా చలామణి అవుతున్నాడు. ఇంకొతను అక్కడి కాలేజీలో లెక్చరర్. విక్టోరియా వ్యవహారాలు చూస్తూంటాడు. వాళ్ళని చూసి రాజు ఉలిక్కిపడ్డాడు. ‘ఏ మగ పురుగుని లోపలికి రానివ్వని అమ్మాయిల హాస్టల్ లోకి ఈ ఇద్దరూ ఎలా వచ్చారు.... అదీ ఈ జామున!' అనుకున్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Embed this episode
Ready to play
కోబ్రాల మధ్య వానపాము | Cobrala Madhyana Vanapamu | Telugu short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.