EPISODE · Jan 10, 2023 · 4 MIN
కోతి కొమ్మచ్చి | Kothi Kopmmachhi | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కోతి కొమ్మచ్చి రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఒరేయ్ ధన్వి! కొద్దిగా యిటు రారా” అని పిలిచాడు మనవడిని, రంగనాధం. “నేను చదుకుంటున్నా తాతయ్యా” అని జవాబు. “యిదిగో. . ఒకసారి యిటు వస్తావా, కాళ్ళు పీకేస్తున్నాయి. కొద్దిగా నొక్కి వెళ్ళు” అని భార్య ని పిలిచాడు. “వుండండి, బట్టలు ఆరేస్తున్నాను” అని జవాబు. “ఒరేయ్ అబ్బాయి! ఒకసారి వచ్చి వెళ్ళరా” అని కొడుకుని పిలిచాడు. “ఆఫీస్ కాల్ లో వున్నాను నాన్నా” అని జవాబు. “ఛీ. . పాడు జీవితం! దురదృష్టం వెంటాడి నడుం విరగడం తో డాక్టర్ గారి సలహాతో మంచానికి అతుక్కుపోయాను. నడక లేకపోవడం తో కాళ్ళలో రక్తప్రసరణ తగ్గి, కాళ్ళు ఒకటే నొప్పి. మనవడు పైక్లాస్ కి రావడంతో, ఎప్పుడూ చదువుతోనే వుంటాడు. ఎక్కువ జీతం అని పేరేగాని, అన్నం తినటానికి కూడా టైం వుండదు కొడుకుకి. కోడలు కి సహాయంగా తను వంటగది వదిలి రాదు. అందులో ఆదివారం అవడంతో టిఫిన్ రెడీ చేస్తున్నట్టు వున్నారు. రిటైర్ అయ్యేటప్పుడు, తోటివాళ్ళు అందరూ "మీకేమి సార్, పిల్లలు చేతికి అంది వచ్చారు. హాయిగా విశ్రాంతి తీసుకోండి " అని. . ‘పిల్లలు చేతికి అందిరావడం కాదు, వాళ్ళ పనులతో చేతికి అందకుండా వున్నారు’ అనుకున్నాడు రంగనాధం. 70 వచ్చిన తరువాత జీవించాలని అనుకోవడం బుద్ది తక్కువ. ఓపిక వుండదు, నడిచివెళ్లి కావలిసినవి తెచ్చుకోలేడు. ఈ బిజీ కాలంలో ఎవరి పనులు వాళ్ళకి. యిహ ముసలితనం తో ఒంటరిగా గడపటం ఎంత కష్టమో అనుభవిస్తే కాని తెలియదు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/KEmRgEmp0Fc
Embed this episode
NOW PLAYING
కోతి కొమ్మచ్చి | Kothi Kopmmachhi | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.