EPISODE · Aug 19, 2023 · 12 MIN
కొత్త కెరటం! ఎపిసోడ్ - 1 | Kottha Keratam Episode 1 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Kottha Keratam Episode 1' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 1' తెలుగు ధారావాహిక ప్రారంభం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఆపరేషన్ థియేటర్ వెలుపల, తలుపు పైన ఎర్రబల్బు వెలుగుతోంది. కళ్యాణిని ఆపరేషన్ థియేటర్ లోనికి తీసుకుని వెళ్ళాక, లోపలినుంచి ఎవరూ బయటకు రాలేదు బయటనుంచి లోనికీ ఎవ్వరూ వెళ్ళలేదు. సమయం గడుస్తున్నా లోపల ఏం జరుగుతోందనే దాని గురించి ఎటువంటి సమాచారమూ లేదు. ఒక పేరొందిన ప్రైవేటు ఆస్పత్రిలో, ప్రసవ సంబంధిత ఆపరేషన్ థియేటర్ బయట కుర్చీలో కూర్చుని, లోపల ప్రసవవేదన పడుతున్న భార్య, కళ్యాణిని, తలుచుకుని ఆందోళన చెందుతున్నాడు రాజేంద్ర. కొడుకుకి ధైర్యం చెప్తూ ప్రక్కనే దిగులుగా కూర్చుని ఉన్నారు రామయ్య జానకి. ఇంతలో ఆపరేషన్ రూము తలుపు తెరిచి బయటకి వచ్చిన గైనకాలజిష్ట్ “మిస్టర్ రాజేంద్ర, మీ భార్య కడుపులో బిడ్డ అడ్దం తిరిగింది. ఆపరేషన్ చెయ్యాలి” అని చెప్పారు. “ఏమంటున్నారు డాక్టర్?” “అంతకు ముందే ఇంకో ముఖ్యవిషయం కూడా తెలియజేయాలి. మునుపటికంటే ఇప్పుడు ఆమె స్థితి మరింత ఆందోళనకరంగా మారింది, తల్లీ బిడ్డలు ఇరువురినీ కాపాడేందుకు మా ప్రయత్నం మేము చేస్తాము కాని ఇద్దరిలో ఒక్కరినే కాపాడగలము. అయితే ఎవరిని కాపాడాలి అనే విషయంలో మీ నిర్ణయం, అనుమతి కూడా అవసరం” డాక్టర్ చెప్పినది విని హతాశుడయ్యాడు. “తల్లిని అంటే నా భార్యనే బ్రతికించండి డాక్టర్” “సరే మీ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అయితే ఆమెకి ఇకపై పిల్లలు పుట్టే అవకాశం ఉండదు” ఒకదానిపై ఒకటిగా వింటున్న వార్తలు శరాఘాతంలా బాధిస్తుంటే గిలగిలలాడారు రాజేంద్ర, రామయ్య, జానకి. ముందుగా తేరుకున్న రాజేంద్ర, కృంగిపోతున్న మనసుని అదుపులోకి తెచ్చుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ “అయినా సరే నా భార్యనే బ్రతికించండి డాక్టర్” ధృఢంగా పలికాడు. కొడుకు నిర్ణయం రామయ్య హృదయాన్ని ముక్కలు చేసింది. జానకి నోట మాటలేదు. ఒకవైపు కోడలు క్షేమంగా బ్రతికి బయటపడాలని కోరుకుంటున్నా మరోవైపు ఆమెకిక తల్లయ్యే అవకాశం లేదని విని హతాశురాలైంది. ‘ఓ భగవంతుడా! ఇంత నిర్దయుడవేమయ్యా, ఎందుకిలా చేసావయ్యా, ఈ జన్మకి మనవడిని కళ్ళజూసుకుని ఒడిలో ఆడించి మురిసిపోయే యోగమే లేదా? మా వంశం ఇక్కడితో ఆగిపోవాల్సిందేనా?’ అనుకుంటూ జానకి మధనపడుతుంటే, మనసులో బాధని దైవానికి విన్నవించుకుంటూ కన్నీరు కారుస్తున్నారు రామయ్య. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/iC6sqlHPnvI
Embed this episode
NOW PLAYING
కొత్త కెరటం! ఎపిసోడ్ - 1 | Kottha Keratam Episode 1 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.