EPISODE · Oct 5, 2023 · 12 MIN
కొత్త కెరటం! ఎపిసోడ్ - 10 | Kottha Keratam Episode 10 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Kotha Keratam Episode 10' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 10' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ టామీకి రోజూ తిండి పెట్టాలన్న భార్గవ ఆలోచన పిల్లలంతా తు.చ. తప్పకుండా అమలు చేయటంతో మూడు నెలలకల్లా మునుపటిలా చక్కగా ఆరోగ్యంగా బలంగా తయారైంది టామీ. పిల్లలతో స్నేహం ఏర్పడ్డాక ఇదివరటిలా వాళ్ళని చూసి అరవటం కూడా తగ్గించిన టామీ పార్కులో ఒక ప్రక్కగా కూర్చుని పిల్లల ఆటలు చూస్తోంది. ఆటల మధ్యలో బిస్కెట్ పెట్టడానికి వచ్చిన భార్గవని చూసి లేచి ఉత్సాహంగా తోకాడించి ‘భౌ..భౌ’ మంటూ సంతోషాన్ని వ్యక్త పరచింది టామీ. “తాతయ్యా చూసారా టామీకి నాకూ ఫ్రెండ్షిప్ కుదిరింది” తన సంతోషాన్ని తాతగారితో పంచుకున్నాడు భార్గవ. “అద్సరేగానీ మునుపు కుక్కలంటే ఆమడ దూరం పరిగెత్తేవాడివి అలాంటిది టామీని భలే మచ్చిక చేసుకున్నావే” ఆశ్చర్యం వ్యక్తం చేసారు. “మీరే చెప్పారు కదా భయం ధైర్యం మనలోనే ఉంటాయని. అది గుర్తు పెట్టుకున్నాను. కుక్కలంటే భయం పోవడానికి అవసరమైన సమాచారాన్ని తెలుసుకున్నాను” “ఏమిటో అది?” “అబ్బో చాలా ఉంది తాతగారు చెప్పాలంటే” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/vNX5WVhc_A0
Embed this episode
NOW PLAYING
కొత్త కెరటం! ఎపిసోడ్ - 10 | Kottha Keratam Episode 10 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.