EPISODE · Oct 25, 2023 · 12 MIN
కొత్త కెరటం! ఎపిసోడ్ - 14 | Kottha Keratam Episode 14 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Kotha Keratam Episode 14' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 25/10/2023 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 14' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “అవును అందుకు ఆరంభంగా మీరు గ్రామస్తులని ఒక చోట సమావేశపరిచి ఒక తెర ఏర్పాటు చేస్తే, తన కంప్యూటర్ ద్వారా ఒక ఫిల్మ్ చూపించి ఇంకుడు గుంటలు ఎలా ఏర్పాటు చేసుకోవాలీ, ఆ పద్ధతి విశదీకరిస్తానని అంటున్నాడు మా మనవడు. అదే మీతో సంప్రదించుదామని ఇలా వచ్చాను” “దానికేం మహాభాగ్యం. మంచి పనికి అలస్యమెందుకు? ఇప్పుడే గ్రామంలో దండోరా వేయిస్తాను. ఆలోగా మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి” మునసబు వద్ద సెలవు తీసుకుని వచ్చేసారు తాతా మనవడూ. ఆ తరువాత ఏర్పాట్లన్నీ చక చకా జరిగిపోయాయి. మునసబు ఇంటి ముందున్న విశాలమైన ఖాళీ ప్రదేశంలో పెద్ద తెర ఏర్పాటు చేయబడింది. రామయ్య పట్నంనుంచి ఒక ప్రొజెక్టర్ తెప్పించారు. తాను పవర్ పాయింట్ లో తయారుచేసిన సమాచారాన్ని ఫిల్మ్ లాగ ప్రదర్శించి గ్రామస్తులకి ఇంకుడు గుంటల గురించి వివరంగా చెప్పాడు భార్గవ... “ఇంకుడు గుంటల వలన భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. ఇవి ఇళ్ళల్లో, పొలాల్లో, రోడ్లప్రక్కనా... ఇలా ఎక్కడైనా నిర్మించవచ్చు... ” అంటూ ఆరంభించి “ఈ ఇంకుడు గుంటల పరిమాణాన్ని నేల స్వభావం, పరిసరాలు, నీటిలభ్యత... వీటన్నిటినీబట్టి నిర్ణయించుకోవాలి. బహిరంగప్రదేశాల్లోను, పొలాల్లోనూ నిర్మించే, చాలా పెద్ద ఇంకుడు గుంటలకు పైన కప్పు అవసరముండదు. వీటి నిర్మాణానికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ... ” అంటూ గ్రామస్తులకి అర్థమయ్యేలా సరళమైన పదాలలో భార్గవ వివరించిన విధానం గ్రామస్తులని ఆకట్టుకుంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/o-1E0EofsHg
Embed this episode
NOW PLAYING
కొత్త కెరటం! ఎపిసోడ్ - 14 | Kottha Keratam Episode 14 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.