EPISODE · Oct 30, 2023 · 14 MIN
కొత్త కెరటం! ఎపిసోడ్ - 15 | Kottha Keratam Episode 15 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Kotha Keratam Episode 15' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 30/10/2023 'కొత్త కెరటం! ఎపిసోడ్ - 15' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ స్నేహితుడి దుఃఖం చూడలేక బాధపడుతున్న మనవడిని ఓదారుస్తూ “అయితే ఆయనకి మంచి వైద్యం చేయిస్తే తగ్గే అవకాశం ఉందని చెప్పారా!” సాలోచనగా అన్నారు. “అవును తాతయ్యా” “నువ్వో పని చెయ్యి. ఆయన మెడికల్ రిపోర్టులు తదితర వివరాలన్నీ మీ ఫ్రెండ్ ని అడిగి నాకు తెచ్చియ్యి. నాకు తెలిసిన క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్నారు. అతడిని సంప్రదించి మీ ఫ్రెండ్ కుటుంబ పరిస్థితులు వివరించి వీలైతే వైద్యానికయ్యే ఖర్చు కూడా తగ్గించమని అడుగుతాను.” “నిజంగానా. మీదెంత మంచి మనసు తాతయ్యా” భార్గవ ముఖంలో చాలారోజుల తర్వాత నవ్వు చూసి రామయ్య మనసు తేలికైంది. “ఇంకో విషయం, నువ్వు నీ స్నేహితులూ కూడా ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నామన్నావు కదా! మన కాంప్లెక్స్ లోనే సుమారు 300 ఇళ్ళదాకా ఉన్నాయి. ఫ్లాట్స్ అసోసియేషన్ సెక్రటరీకి విషయం వివరించి ఫండ్ రైజింగ్ కాంపైన్ చేద్దాము. ఇచ్చిన వాళ్ళు ఇస్తారు. మీ స్నేహితులనీ అలాంటిదేదో చేసి డబ్బులు సమకూర్చమని చెప్పు. అలా జమ అయిన మొత్తాన్ని అనిల్ కుటుంబానికి అందచేద్దాము. అలా వాళ్ళ అవసరానికి మనవంతు సహాయం చేసినట్లు అవుతుంది. ఏమంటావు?” “చక్కటి ఆలోచన. ఊరికే దిగులు పడ్డాను తప్ప ఇలా చేయవచ్చని ఆలోచనే తట్టలేదు ఎందుకని తాతయ్యా ఛ ఛ” నుదురు కొట్టుకున్నాడు. “అందులో నీ తప్పేమీ లేదురా. ఇటువంటి వార్తలు విన్నప్పుడు బాధతో సహజమైన ఆలోచనా శక్తిని కూడా కోల్పోతాము. పైగా మనవాళ్ళెవరికైనా ఇలా జరిగితేనో అనే భయం కూడా కమ్మేసి బుర్ర ప్రత్యామ్నాయాల గురించి అలోచించదు.” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/EbiTVGH4eJc
Embed this episode
NOW PLAYING
కొత్త కెరటం! ఎపిసోడ్ - 15 | Kottha Keratam Episode 15 | Telugu Web Series | Dinavahi Sathyavathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.